అది అమ్మ ప్రేమ గొప్పతనం

అమ్మ ప్రేమ..

 

అమ్మ ప్రేమకు సాటేదని మరో ఘటన రుజువు చేసింది..

కొడుకు కోసం 1400 మీటర్ల  ప్రయాణం చేసింది  ఓ తల్లి 

అదీ స్కూటీపై.. అంత దూరం సింగిల్ గా వెళ్లివచ్చింది 

అదికూడా లాక్ డౌన్  ఆంక్షలు కఠినంగా అమలవుతున్న వేళ 

తెలియని మార్గమే అయినా.. అంత దూర ప్రయాణం.. 

అలవాటు లేకపోయినా.. కొడుకు కోసం సాహసం చేసింది 

అందుకే ఈ  అమ్మ ప్రేమకు అంతా  సలామ్ అంటున్నారు


                        లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్న వేళ రోడ్డు ఎక్కాలంటేనే అంతా భయపడతున్నారు.. పోలీసులు ఎక్కడ చితకబాదుతారో అనే భయంతో నిత్యావసరాలకు తప్ప జనాలు రోడ్డు ఎక్కడం లేదు.. అత్యవసర పనులను సైతం పక్కన పెడుతున్నారు.. కానీ ఈ ఆంక్షలు.. భయాలు.. ఇవేమీ ఆమె తల్లిప్రేమ ముందు నిలబడలేకపోయాయి. ఒకటి రెండు కాదు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడుకును చేరుకోవడానికి ఓ అమ్మ ప్రయత్నం అందరిచేత కన్నీరు పెట్టించింది. బస్సులు తిరగడం లేదు.. ట్రైన్ లు  లేవు.. ప్రైవేటు వాహనాలు తిరగడం లేదు.. అయినా ఇలాంటి సమయంలో ఆ అమ్మ తన కొడుకు కోసం స్కూటీపై అంత దూరం ప్రయాణించింది.. ఆమె పేరు రజియా బేగం.. ఆమె బోధన్ పట్టనంలో ఉంటున్నారు.. నెల్లూరులో ఉన్న తన కొడుకుని ఇంటికి తీసుకురావడానికి స్కూటీపై రానుపోను దాదాపు 1400 కిలోమీటర్ల ప్రయాణం చేశారు.
                             రజియాబేగం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. ఆమె భర్త పన్నెండేళ్ల కిందట మృతి చెందారు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు యాసర్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. కూతురు అయేషా డిగ్రీ పూర్తి చేసింది. చిన్న కొడుకు నిజాముద్దిన్ ఇంటర్ పూర్తి చేసి నీట్  కోసం హైదరాబాద్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. నిజాముద్దిన్ సహ విద్యార్థితో కలిసి మార్చి 12న నెల్లూరు జిల్లా రహమతాబాద్ కు వెళ్లాడు. ఆ తరువాత కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆంక్షలు మొదలయ్యాయి. ఇక అక్కడి నుంచి బోధన్ కు వచ్చే మార్గం లేకుండాపోయింది.

                     కొడుకు అంత దూరంలో ఉండటంతో రజియాబేగం కలవరపడింది. ఏరోజుకారోజు నచ్చజెప్పుకోవాలని ప్రయత్నించినా పిల్లాడు అంత దూరంలో ఉండటం మనసును కలచివేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొడుకు తన కళ్లెదుటే ఉండాలని ఆకాంక్షించింది. తన సమస్యలు చెప్పి మరొకరిని ఇబ్బంది పెట్టడమెందుకన్న ఆలోచనతో ఆమే స్వయంగా బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఉద్యోగరీత్యా 25 ఏళ్లుగా ద్విచక్రవాహనం నడిపే అలవాటు ఉండటంతో దాన్నే రవాణా సాధనంగా మలుచుకున్నారామె. 

                   ఇంట్లో ఎవరికి చెప్పినా నిరాకరిస్తారని చెప్పకుండానే బయల్దేరింది. రెండు చపాతీలను ప్యాక్ చేసుకుని స్కూటీపై సోమవారం ఉదయం 6 గంటలకు బయల్దేరిన రజియాబేగం మంగళవారం ఉదయం 8 గంటలకు రహమతాబాద్ చేరుకున్నారు. పెట్రోల్  సమస్య లేకుండా వాహనంలో 5 లీటర్ల పెట్రోలు డబ్బా వెంటబెట్టుకెళ్లి... పెట్రోలు నిరంతరం నిల్వ ఉండేలా చూసుకున్నారు. గూగుల్ మ్యాప్ ను వినియోగించుకుని ప్రయాణం సాగించారు. తూప్రాన్ , గజ్వేల్ మీదుగా ప్రయాణం కొనసాగించారు. 700 కిలోమీటర్ల ప్రయాణం. పోలీసులు ఎన్నోసార్లు అడ్డుకున్నారు. వారికి సమస్యను వివరిస్తూ బతిమాలుకుని ఆంక్షల అడ్డంకులను అధిగమించిందామె. 
పిల్లల విషయంలో తల్లి ప్రేమ ఎక్కడి వరకైనా తీసుకెళుతుందని విన్నాం కానీ రజియా కనబర్చిన ధైర్యంతో అది నిజమని నిరూపితమైంది. అధికారుల అనుమతి తీసుకుని, స్కూటీపై వెళ్లి తనయుడిని చేరుకుంది. సుమారు 1,400 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి తీసుకుని వచ్చింది. ఆ తల్లి సాహసానికి అందరూ సలామ్‌ చేస్తున్నారు. 

Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..