Posts

Showing posts from March, 2014

బ్లాక్‌బస్టర్‌ ఫ్రై డే!!!

Image
                                                                 వింటే భారతం వినాలి... తింటే గారెలే తినాలి... చూస్తే?... బ్లాక్‌ బస్టర్‌ ఫ్రైడేకి క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా రెడీ అయ్యారా? మూడు గంటల పాటు ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు టీ20 వరల్డ్‌ కప్‌ రెడీ అయ్యింది. ఓ మెగా ఫైట్‌తో ధానధన్‌ వరల్డ్‌ కప్‌కు తెరలేస్తోంది…. అది అలాంటి ఇలాంటి మ్యాచ్‌ కాదు… రియల్‌ వరల్డ్‌ వార్‌ను తలపించే ఫటాఫట్‌ ఫైట్‌… అదే దాయుదల మధ్య అసలైన సమరం…                  వింటే భారతం వినాలి... తింటే గారెలే తినాలి... ఇది ఒకప్పటి సామెత…. అదే క్రికెట్‌కు అన్వయించి చూస్తే భారత్‌-పాకిస్థాన్‌ల మధ్యే మ్యాచ్‌ చూడాలి? అనుకోక తప్పదు.  అప్పుడే క్రికెట్‌ చూసిన ఫీలింగ్‌. ఈ రెండు జట్లు మైదానంలో తలపడుతుంటే అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి క్రికెటర్‌ ఒక సైనికుడిలా మారుతాడు… డూ ఆర్‌ డై తేల్చుకోడానికి సై అంటాడు… అక్కడ మాటల తూటాలు… బౌండరీ బాంబులూ… టపటపా వికెట్లు పేలడం కామన్‌. ఓటమిని అంగీకరించడానికి ఏ ఒక్కరూ ఇష్టపడరు. సర్వశక్తులూ ఒడ్డేందుకు ట్రై చేస్తారు. చెమటలు చిందేలా శ్రమిస్తారు. ఎందుకంటే ఈ వార్‌లో

ఆటోగ్రాఫ్‌తో జర జాగ్రత్త

Image
                            ఆటోగ్రాఫ్‌ ఇస్తున్నారా జర జాగ్రత్త                ఆటోగ్రాఫ్‌ కేవలం స్వీట్‌ మెమొరీస్‌ కోసం అనుకుంటే కొన్నిసార్లు కష్టాల్లోకి కూడా నెట్టేస్తుంది. అంతెందుకు ఓ ఆటోగ్రాఫ్ కొందరి జీవితాల్నే మార్చేస్తుంది. ఓ అభిమాని అడిగాడని ఎంతో అభిమానపడి ఒక ఆటోగ్రాఫ్‌ ఇస్తే తరువాత చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది. ఈ విషయం చాలా లేటుగా అర్థమైంది దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ హెర్షల్‌ గిబ్స్‌కి.. ఇంతకీ ఏమైందని డౌట్‌ పడుతున్నారా?           అయితే  ఈ స్టోరీ చదవాల్సిందే… ఆస్కార్‌ పిస్టోరియస్‌… ఈ పేరే పెను సంచలనం. బ్లేడ్‌ రన్నర్‌గా చరిత్ర సృష్టించిన ఘనత అతడిది. ఒరిజినల్‌గా కాళ్లు లేకపోయినా కృత్రిమ కాళ్లతో ఒలింపిక్స్‌లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో చిరుతలా లంఘించి ఎంతో కీర్తి ప్రతిష్టాలు సంపాదించాడు. కానీ ఏం లాభం. తప్పతాగి తప్పు చేశాడు. ఎంత త్వరగా ఫేమస్‌ అయ్యాడో.. అంత త్వరగా అన్‌ పాపులర్‌ అయ్యాడు. తన గర్ల్ ఫ్రెండ్‌ రీవాను హ్యత చేసి కటకటాల పాలయ్యాడు. ఫాస్టెస్ట్‌ రన్నర్‌ కాస్త హంతకుడయ్యాడు. పిస్టోరియస్‌ అరెస్టయ్యాడు సరే ఈ మర్డర్‌తో గిబ్స
Image
                                      డి గ్యాంగ్‌ రెడీ అంటోంది...                  ఐ.పి.ఎల్‌ కాస్త ఇండియన్‌ ఫిక్సింగ్‌ లీగ్‌గా మారిన సమయంలో బీసీసీఐ మరో తప్పుడు నిర్ణయం తీసుకుంది... ఫిక్సింగ్‌.. బెట్టింగ్‌లకు అడ్డాగా మారిని దుబాయ్‌లో తొలి లెగ్‌ పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది. డీ గ్యాంగ్‌కు తీపి కబురు అందించింది.              ఐపీఎల్ సెవెన్త్ ఎడిషన్ మొదటి షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటిచింది. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల కారణంగా మొదటి దశలో జరిగే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహిస్తున్నట్టు అఫిషయల్‌గా తేల్చి చెప్పేసింది. ఆ లెక్కన మొదటి దశలో భాగంగా 20 మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. ఏప్రిల్ 16 న జరిగే ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‑తో డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఇక్కడ మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‌లు ఎలా సాగినా ఫిక్సింగ్‌.. బెట్టింగ్‌ లాంటి ఇతర అంశాలపై బీసీసీఐ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరులు ఇప్పటికే లీగ్‌పై కన్నేసి ఉంటారు. డీ గ్యాంగ్‌ ఇక ఆ పనిలో బిజీగా ఉండి ఉంటుంది. 

టచ్‌లోకొచ్చిన ధోనీసేన

Image
                                       టచ్‌లోకి వచ్చిన ధోనీసేన...                                                     ట్వంటీ20 వరల్డ్‌ కప్‌లో అసలైన సంగ్రామానికి ముందు యంగ్‌ ఇండియా టచ్‌లోకి వచ్చింది. చిరకాల ప్రత్యర్థితో వరల్డ్‌ వార్‌కు ముందు ఫాం అందుకుంది. తన రెండో వార్మ ప్‌ మ్యాచ్‌లో ఆల్‌ రౌండ్‌ షో చేసింది. ఇంగ్లండ్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది.                 టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన మెన్‌ ఇన్ బ్లూ ప్రత్యర్థి ముందు 179 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రొటీన్‌గా రోహిత్‌ శర్మ, ధావన్‌ ఫెయిలైనా.. యువరాజ్‌ సింగ్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైనా...  ఎప్పటిలానే కోహ్లీ మరోసారి చెలరేగాడు. బంగ్లాదేశ్‌కు వెళ్లే ముందు తనలో కొత్త ప్లేయర్‌ను చూస్తారు అన్న మాట నిలబెట్టుకునేలా రైనా మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 31 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లతో 54 రన్స్ చేసి విరాట్ కు అండగా నిలిచాడు.             రైనా ఔటైనా.. విరాట్‌ తనదైన స్టైల్లో చెలరేగాడు.. ధోనీ సహకారంతో సూపర్‌ ఫాం కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా బ్రెస్నన్‌ వేసిన ఆఖరి ఓవర్లో 3 బౌండరీలతో కలిపి 17 రన్స్ తో ధనాధన్ అనిపించాడు. 74 పరుగులతో

ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు

Image
            ఎన్నికల నగారా   మోగింది . దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ‌ ను ఎలక్షన్ ‌ కమిషన్ ‌ విడుదల చేసింది . మొత్తం 543 లోక్ ‌ సభ స్థానాలకు 9 విడతల్లో పోలింగ్ ‌ జరగనుంది .. మన రాష్ట్రం విషయానికి వస్తే  జూన్ ‌  రెండు నుంచి కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించినప్పటికీ … ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల్ ‌ కమిషన్ ‌ నిర్ణయం తీసుకుంది … రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న తేదీలు … రాష్ట్రం                                                       తేదీలు ఆంధ్రప్రదేశ్                                                          ఏప్రిల్ 30, మే 7   అరుణాచల్ ‌ ప్రదేశ్                                                   ఏప్రిల్ 9   అస్సాం                                                              ఏప్రిల్ 7, 12, 24   బీహార్                                                               ఏప్రిల్ 10, 17, 24, 30, మే 7, 12   ఛత్తీస్ ‌ గఢ్                                                            ఏప్ర

ఆట లేక అందమా?

Image
మీ ఫేరెట్‌ ఎవరు? మీరు క్రీడాభిమానులా? సైనా... సానియా... జ్వాలా లాంటి స్టార్‌ ప్లేయర్లను మీరు అమితంగా ఇష్టపడతరా? లేక ఇంకెవరైనా ఫేవరెట్‌ ఉన్నారా? ఆటను ఆరాధిస్తారా? అందాన్ని ప్రేమిస్తారా? భారత్‌లో టాప్‌ టెన్‌ మహిళా అథ్లెట్లను ఎంచుకోమంటే ఎవరికి ఓటేస్తారు?            సాధరణంగా భారత్‌లో పురుషులకు ఉన్న గుర్తింపు మహిళకు ఉండదు . ముఖ్యంగా క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నా … పురుషులకు ఉన్నంత ఆదరన ఉండదు.  ఐతే అవేవి లెక్క చేయకుండా మగవారిని దాటి క్రేజ్ ‌ సంపాందించిన ఉమెన్‌ అథ్లెట్స్‌ ఉన్నారు . పురుషుల కంటే ఎక్కువ ఫోకస్‌ తమపై ఉండేలా చేసుకున్నారు . కానీ ఇలాంటి వారి సంఖ్య పదిలోపే ఉండడం విచారకరం .. మరి అలాంటి మహిళా మహారానుల్లో  మీ టాప్‌ టెన్‌ ఎవరు ?.. సెలెక్ట్‌ చేసుకోండి …   సైనా నెహ్వాల్              భారత క్రీడా అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు సైనా నెహ్వాల్‌ . 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో బ్రాంజ్‌మెడల్‌తో చరిత్ర సృష్టించింది . బ్రాండ్‌ వాల్యూ అమాంతం పెంచుకుంది .              వరల్డ్‌ టాప్‌ ఫైవ్ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల్లో సైనా కూడా ఒక సూపర్  షట్లర్‌ . కెరీర్‌లో అత్యుత్తమంగా రెండో ర్యా