Posts

Showing posts from March, 2020

అర్థమవుతోందా..?

Image
ఓయ్‌ అర్థమవుతోందా..?  మీరేమైనా తోపులా..? మీకు మాత్రమే పనులు ఉన్నాయా..? ఇంట్లో ఉండండి.. పిల్లలతో ఆడుకోండి.. కుటుంబంతో గడపండి.. కాళ్లపై కాళ్లు వేసుకొని టీవీ చూడండి.. పనులన్నీ పక్కన పెట్టి కాలక్షేపం చేయండి.. ఇళ్లే మీకు శ్రీరామ రక్ష అని చెబుతుంతే చెవికి ఎక్కడం లేదా..? ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు ప్రకటించినా మీకు పట్టదా..? ప్రపంచం మునిగిపోయేట్టు.. భూమి బద్దలయ్యేట్టు.. మీకు మాత్రమే పనులు ఉన్నట్టు ఇలా రోడ్లపైకి వచ్చేస్తున్నారు.. గుంపులు గుంపులుగా షికార్లు చేస్తున్నారు.. కొంచమైనా ఆలోచించరా..? అసలు బుద్ధీ జ్ఞానం ఉందా..? కరోనా అంటే సునామీ కాదు.. భూకంపం కాదు.. ప్రకృతి ప్రకోపం కాదు.. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఉత్పాతం.. ఊహకు అందని ప్రమాదం.. నిర్లక్ష్యంగా ఉంటే తప్పదు భారీ మూల్యం.. బీ కేర్‌ ఫుల్‌.. మీ ప్రాణాల కోసం వైద్యులు వారి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.. మీకు రక్షణ కవచంగా నిలిచేందుకు పోలీసులు ఎండని.. తిండిని లెక్క చేయక రోడ్లపై చెమటలు కక్కుతున్నారు..? పారిశుధ్య కార్మికులు.. అధికారులు, ప్రభుత్వం.. ఒక్కరేంటి ఇలా.. ఎందరో మీకు సంబంధం లేని వాళ్లు.. ఒకరికి ఒకరు ఏమీ కాని వారు.. మీ అందరికీ బంధు