ఆట లేక అందమా?
మీ ఫేరెట్ ఎవరు?
భారత క్రీడా అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు సైనా నెహ్వాల్. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్‌మెడల్‌తో చరిత్ర
సృష్టించింది. బ్రాండ్
వాల్యూ అమాంతం పెంచుకుంది.
వరల్డ్ టాప్ ఫైవ్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో సైనా కూడా ఒక సూపర్ షట్లర్. కెరీర్‌లో అత్యుత్తమంగా రెండో ర్యాంక్‌కు చేరుకొని భారత స్టామినా ఏంటో ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది…
వీరిలో మీ ఫేవరెట్ క్రీడాకారిణి ఎవరు? ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు?... వీరే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మీ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారు?
మీరు క్రీడాభిమానులా? సైనా... సానియా... జ్వాలా లాంటి స్టార్ ప్లేయర్లను మీరు అమితంగా ఇష్టపడతరా?
లేక ఇంకెవరైనా ఫేవరెట్ ఉన్నారా? ఆటను ఆరాధిస్తారా? అందాన్ని ప్రేమిస్తారా? భారత్‌లో టాప్ టెన్ మహిళా అథ్లెట్లను ఎంచుకోమంటే ఎవరికి ఓటేస్తారు?
సాధరణంగా
భారత్‌లో పురుషులకు ఉన్న గుర్తింపు మహిళకు ఉండదు. ముఖ్యంగా
క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నా… పురుషులకు ఉన్నంత ఆదరన ఉండదు. ఐతే అవేవి లెక్క
చేయకుండా మగవారిని దాటి క్రేజ్
సంపాందించిన
ఉమెన్ అథ్లెట్స్ ఉన్నారు. పురుషుల కంటే ఎక్కువ ఫోకస్
తమపై ఉండేలా చేసుకున్నారు. కానీ ఇలాంటి వారి సంఖ్య
పదిలోపే ఉండడం విచారకరం.. మరి అలాంటి మహిళా మహారానుల్లో మీ టాప్ టెన్ ఎవరు?.. సెలెక్ట్ చేసుకోండి…
సైనా నెహ్వాల్
వరల్డ్ టాప్ ఫైవ్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో సైనా కూడా ఒక సూపర్ షట్లర్. కెరీర్‌లో అత్యుత్తమంగా రెండో ర్యాంక్‌కు చేరుకొని భారత స్టామినా ఏంటో ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది…
భారత్‌లో ఎంతోమంది యువ ప్లేయర్లకు ఆదర్శంగా
నిలిచింది. భారత బ్యాడ్మింటన్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చింది.
బ్రాండ్
వాల్యూలో క్రికెటర్లతో పోటీ పడింది. దటీజ్ సైనా అనిపించుకుంది...
సానియా మిర్జా
ఇండియన్ టెన్నిస్ బ్యూటీ
సానియా మిర్జా… భారత్‌లో మహిళ అథ్లెట్లకు అత్యంత గుర్తింపు
దక్కేలా చేసిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. అందంతోనూ,
ఆటతోనూ
ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ అభిమానుల సంఖ్యను పెంచుకోంటొంది…
ఆరేళ్లకే టెన్నిస్ రాకెట్ పట్టిన సానియా తరువాత పెను సంచలనమైంది. 2003లో ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా మారిన సానియా… ఆస్ట్రేలియా
ఓపెన్ సింగిల్స్‌లో మూడో రౌండ్‌కు చేరి చరిత్ర సృష్టించింది. అందంతోనూ ఆటతోనూ బ్రాండ్
వాల్యూను అమాంతం పెంచుకుంది. తరువాత వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది...
మిక్స్డ్డబుల్స్లో 2
గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గి చరిత్ర సృష్టించింది. కాని తరువాత వివాదాలు.. గాయాలు ఎక్కువ అవ్వడంతో ఆట తగ్గింది. సింగిల్స్కు పూర్తిగా దూరమైంది… కేవలం డబుల్స్పై దృష్టిపెట్టింది. మరోవైపు హైదరాబాద్లో తన పేరిట టెన్నిస్ అకాడమీ పెట్టి కోచింగ్ ఇస్తోంది…
దీపికా పల్లికల్
దీపికా పల్లికల్... ఈ చెన్నై బ్యూటీ స్క్వాష్లో సంచలనంగా మారింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న తొలి స్క్వాష్ ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచింది.
కెరీర్‌లో ఏడు మేజర్ సింగిల్స్ టైటిళ్లు... ఆరు టూర్ టైటిల్స్ నెగ్గిన దీపిక.. ఆటతోనే కాదు అందంతోనూ అభిమానులను
ఆకట్టుకుంటోంది. అర్జునతో పాటు పద్మశ్రీ
అవార్డు సొంతం చేసుకున్న చిన్నది ఇటీవల ఫెమినా మ్యాగ్జైన్ కవర్‌పేజ్‌కెక్కింది...
షర్మిలా నికోలెట్
భారత గోల్ఫ్ సంచలనం షర్మిలా
నికోలెట్… అత్యంత ఖరీదైన ఈ ఆటలో అమ్మడు అదుర్స్
అనిపిస్తోంది. ఆటతోనూ అందంతోనూ అభిమానులను కట్టిపడేస్తోంది.
ఐదేళ్ల
వయసులోనే గోల్ఫ్ స్టిక్ పట్టిన ఈ బెంగళూర్ అమ్మడు ఇప్పుడు చరిత్ర సృష్టిస్తోంది.
18
ఏళ్ల
వయసులో ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా మారిన నికోలెట్... లేడీస్ యూరోపియన్ టూర్‌కు అర్హత
సాధించి చరిత్ర సృష్టించింది. 2010 గోల్ఫర్ ఆఫ్ ది ఇయర్‌గా
నిలిచిన నికోలెట్ ఇప్పుడు అదే ఫాం కంటిన్యూ చేస్తోంది. 2012లో కె.జి.ఎ టోర్నమెంట్ విజేతగా నిలిచింది.
గుత్తా జ్వాలా
బ్యాడ్మింటన్‌లో
బ్యూటీ రెబల్‌గా గుర్తింపు పొందిన గుత్తా జ్వాలా ఆటలో మాత్రం సంచలనం.
కెరీర్‌లో
ఎన్నిసార్లు ఆటుపోట్లు ఎదురైనా అన్నింఃటినీ తట్టుకుంది.
నెగ్గింది…
కెరీర్‌లో ఎన్ని వివాదాలు
ఎదురైనా వేటిని లెక్కచేయని ధీర షటిలర్‌గా ముద్రవేసుకుంది.
కామన్వెల్త్
గేమ్స్‌లో గోల్డ్ మెడల్ నెగ్గి సత్తా చాటింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో
కాంస్యపతకం నెగ్గి చరిత్ర సృష్టించింది…
జ్వాలా కేవలం ఆటకే పరిమితం
కాకుండా సినీమా రంగంవైపూ అడుగులు వేసింది. గుండెజారి గల్లంతైందే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
మూవీలో
కేవలం ఒక్క పాటేకే పరిమితమైన గుత్తా.. మెయిన్ టార్గెట్ బిగ్
స్క్రీన్‌పై హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడమే…
మిథాలీ రాజ్
క్రికెట్టే శ్వాసగా జీవించే
అభిమానులు ఉన్న భారత దేశంలో మహిళల క్రికెట్‌కు అత్యంత గుర్తింపు తెచ్చిన
క్రీడాకారిణి మిథాలీ రాజ్. 1999లోలో తొలిసారిగా అంతర్జాతీయ
వన్డే క్రికెటర్‌లో ప్రవేశించి ఐర్లాండ్‌పై 114 పరుగులతో చరిత్ర
సృష్టించింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో
నెంబర్ వన్ మహిళ క్రికెటర్‌గా నిలిచింది.
అటు
బ్యాటర్‌గా ఇటు కెప్టెన్‌గానూ సక్సెస్ అయ్యింది. టెస్టుల్లో డబుల్ సెంచరీ
చేసి చరిత్ర సృష్టించింది…
మధ్యలో ఫాం తగ్గి కెప్టెన్సీ
కోల్పోయినా.. మళ్లీ భారత సెలక్టర్లు
మిథాలీనే నమ్ముకున్నారు. ఇటీవల అద్భుతమైన ప్రదర్శనతో మిథాలీ మళ్లీ నెంబర్ వన్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడిప్పుడే
బ్రాండ్లపై దృష్టి పెట్టింది…
హంపి, హారిక, తాన్య సచిదేవ్
అన్ని ఉన్నా గుర్తింపుకు
నోచుకోని మహిళా అథ్లెట్లు ఎవరంటే చెస్ క్వీన్సే అని చెప్పాలి. అద్భుతమైన టాలెంట్‌తో దేశ ఖ్యాతిని చాటిన
కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తాన్య సచిదేవ్ లాంటి క్రీడాకారిణిలకు
రావాల్సినంత గుర్తింపు రాలేదు. గ్రాండ్‌మాస్టర్లుగా ఎన్నో సంచలనాలు చేసిన వారంతా చెస్‌కు
సరైన ఆదరణ లేకపోవడంతో రేసులో కాస్త వెనుకపడ్డారు. చెస్ ఒలింపిక్ గేమ్ కాకపోవడంతో వీరు
స్పాన్సర్లను, అభిమానులను అతిగా
ఆకర్షించలేకపోతున్నారు…
పి.వి.సింధు, అశ్విని పొన్నప్ప
సైనా,
జ్వాలా
బాటలోనే బ్యాడ్మింటన్‌లో ఎన్నో సంచనాలు సృష్టించారు పి.వి.సింధు,
అశ్వినీ
పొనప్ప.. గుత్తా జ్వాలాతో కలసి అశ్వినీ డబుల్స్‌లో అనేక విజయాలు
సాధిచింది. ఇక పి.వి.సింధు సంచలనాలతో
చెలరేగిపోతోంది. భారత్ నెంబర్ వన్ సైనాకే సవాల్ విసురుతోంది.
వరస
విజయాలతో వరల్డ్ టాప్ టెన్ ర్యాంకింగ్స్‌లోరి దూసుకొచ్చింది.
గతేడాది
మకావ్ ఓపెన్ విజేతగా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించుకుంది.
ఇప్పుడు
సైనాతో పోటీ కూడా సై అంటోంది…
మేరీ కాం
మేరీకాం ఈ పేరే పెద్ద సంచలనం.
భారత
పంచ్ పవర్‌ను విదేశాలకు రుచి చూపించిన మేటి బాక్సర్.
అమ్మ
అయిన తరువాత కూడా దూకుడుతో పతకాలు నెగ్గుతోంది. ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా
నిలుస్తోంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు బంగారు
పతకాలు నెగ్గి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. మహిళల బాక్సింగ్‌కు ఆదరణ
పెరిగేలా చేసింది. బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గి
చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ ప్రవశపెట్టిన
తొలిసారే పతకంతో మెరిసింది…
గీతా
కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా
గీతా చరిత్ర సృష్టించింది. లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించి అందరి
దృష్టినీ ఆకర్షించింది. ప్రస్తుతం రియో ఒలింపిక్స్ టార్గెట్‌గా సాధన
కొనసాగిస్తోంది…
దీపికా కుమారి
దీపికా
కుమారి ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది.
కామన్వెల్త్
గేమ్స్ మహిళల వ్యక్తిగత విభాగంలో గోల్డెమెడల్ సాధించి అందరి దృష్టినీ తనవైపు
తిప్పుకుంది. లండన్ ఒలింపిక్స్‌లో భారీగా అంచనాలు పెంచినా…
ఒత్తిడిలో
పతకం సాధించడంలో ఫెయిలైంది. కానీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మాత్రం దీపికా
అదుర్స్ అనిపించింది. ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న దీపిక…
వచ్చే
ఒలింపిక్స్‌లో మెడల్ సాధించాలనే లక్ష్యంతో కఠోర సాధన చేస్తోంది…
వీరిలో మీ ఫేవరెట్ క్రీడాకారిణి ఎవరు? ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు?... వీరే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మీ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారు?
aata andam telivitetalu anni kalpi drudamaina sankalpam gelavallane thapana (y)
ReplyDeleteavuna
ReplyDelete