పెదవే పలికిన మాటల్లోన తియ్యని మాటే అమ్మ...
తెలుగు అక్షరాలు మొదలయ్యేది అఆలతో...
మన జీవితం మొదలయ్యేదే అమ్మతో...
అందుకే అమ్మకోసం నా తొలి కవిత రాసే ధైర్యం చేశాను...
అ అంటే అమ్మ... ఆ అంటె ఆమె...
ఆనందానికి అసలైన అర్థం...
అందానికి ప్రతిరూపం...
అమృతానికి పర్యాయపదం..
అన్నీ తానైందే అమ్మ...
అల్లరి చేస్తే భరిస్తుంది...
అడుగులు
వేయిస్తుంది..
ఆకలేస్తే అన్నం పెడుతుంది...
అడుగడుగున తోడుంటుంది…
అపదలో ఆదుకుంటుంది...
అందుకే
ఆమె అమ్మైంది...
అమ్మేయడానికి...
ReplyDeleteకుప్పతొట్లో పారేయడానికి...
అంతెందుకు
ఈ లోకం చూడకముందే
చంపేయడానికీ...
ఆడపిల్ల
అయినందుకు గొంతునులిమేయడానికీ...
అవకాశం
ఉన్నా...
నీకు
జన్మనిచ్చి,
నిన్ను లాలించి,
పెంచి పెద్ద చేసిందామె...
మొత్తంగా బతుకునిచ్చేదే ఆమె...
ఆఖరున
ఆమెకు
దక్కేది...?!
నులక మంచం,
డొక్కు చెంబు,
సత్తు పళ్ళెం...
ఇంతకన్నా
గొప్పగా
అయితే వృద్ధశ్రమాల పాల్జేస్తారు...
జన్మనిచ్చినందుకిదేనా
ప్రతిఫలం...???
ఎన్నాళ్ళీ ఘోరం...
మనసున్న మా మంచి
అమ్మకు
ఎప్పటికీ హార్దిక శుభాకాంక్షలు!!!
అందుకే... పెదవే పలికిన మాటల్లోన తియ్యని మాటే అమ్మ అని.. అమ్మను మించి దైవమున్నదా అని.. సినీ కవులు పాటలు రాశారు
ReplyDelete