అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..
అనగనగా.. ఒక విషయం చెప్పాలి...
అనగనగా.. ఏంటి ఏదో కధ చెబుతున్నానని భయపడకండి.. ఎందుకంటే చిన్నప్పుడు మనం కధలు విన్నప్పుడు.. అనగనగాతోనే మొదలయ్యేది. ఇప్పుడు మన పిల్లలకు మనం చెప్పాలన్నా అనగనగా అనే ప్రారంభించాలి.. కానీ నేను అలాంటి కధ ఏదీ చెప్పాలి అనుకో్వడం లేదు. నా జీవితంలోకి వచ్చిన నా అదృష్ట దేవతను పరిచయం చేయాలి అని ఆరాటం..
ఇప్పటి వరకు నా జీవితం అంటే నన్ను అమితంగా ప్రేమించే నా భార్య సుమ.. తరువాత నా సంతోషం.. నా ఆనందం.. నా లోకం.. అన్నీ తానైన నా కొడుకు ఆశ్రిత్.. ఆ ప్రేమ.. ఆ ఆనందానికి ఇప్పుడు అదృష్టం తోడైంది. అదే నా చిన్నారి చిట్టి తల్లి.
ఇదే నా లక్కీ..
మా అమ్మ
నన్ను ఈ ప్రపంచంలో అందరి కంటే అమితంగా ప్రేమించే అమ్మ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదే.. అమ్మ రుణం తీర్చు కోవడం ఏ కొడుకుకి. ఎప్పటికీ సాధ్యం కాదు.. ఎందుకంటే అమ్మ ప్రేమని వెలకట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు.. అమ్మ పడే కష్టం ఏంటో ఛిన్నప్పుడు నాకు తెలీదు.. నాకే కాదు. నాకు తెలిసి ఏ కొడుక్కీ తెలీదు.. ఎందుకు అంటే అమ్మ ఉన్న ఏ కొడుక్కి కష్టం అన్నది ఎదురు కాదు.. ఒక వేళ పొరపాటున ఏదైనా కష్టం వచ్చినా.. నేను ఉన్నాను అనే ధైర్యం ఇస్తుంది అమ్మ. ఎంతటి కష్టాన్నిఅయినా తను తీసుకొని.. కేవలం ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. ఇక మనం చిన్నప్పుడు అమ్మ పడ్డ కష్టం ఏ బిడ్డకు తెలీదు.. తండ్రి అయిన తరువాతే.. తన భార్య ప్రసవ సమయంలో పడే నరకయాతన.. తరువాత వాళ్లను పెంచే సమయంలోనూ పడ్డ కష్టం.. కళ్ల ముందు ఫ్లాస్ బ్యాక్ లా కనబడి కన్నీ రు తెప్పిస్తుంది. అలా అమ్మ ప్రేమని.. గుర్తు చేసుకోవడమే తప్ప.. అమ్మ పడ్డ కష్టానికి ఏం చేసినా.. అది అతి తక్కువే. ఒక కొడుకుగా నేను అమ్మకి ఏం చేయలేకపోయాను.. అనే బాధ ఇప్పటికీ ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. బాధను కొంచెమైనా తీర్చుకోవాలి అంటే నా ముందు ఉన్నది ఒకటే మార్గం. అదే నా కూతురిని అమ్మలా కంటికి రెప్పలా కాపాడుకోవడమే.. ఈ న్యూ ఇయర్ సాక్షిగా నేను చేస్తున్న ప్రమాణం అదే.. మా అమ్మే నా కోసం కూతురుగా పుట్టింది. ఇక ఏ కష్టమైన నా దగ్గరకు రాదనే ధైర్యం నింపింది నా ముద్దుల కూతురు...
ఇది చెప్పడానికి అనగనగా అని ప్రారంభించడం ఎందుకు అంటారా..? దానికి ఒక రీజన్ ఉంది.. నవంబర్ 3.. 2019న నా కూతురు ఈ భూమ్మిదకు అడుగుపెట్టింది. అప్పటి నుంచి తనకు ఏ పేరు పెట్టాలి.. అని పెద్ద కసరత్తే చేశాను. చివరికి అన్నీ కలిసి వస్తాయనే నమ్మకంతో.. తనకి అనఘ అనే పేరు పెట్టాలి అని నిర్ణయించాను.. కాబట్టి నా అనఘ అమ్మకి మీ అందరి ఆశీస్సులు కావాలి.. కేవలం అనఘకు మాత్రమే కాను నా ముద్దుల కొడుకు ఆశ్రిత్ ని కూడా ఆశీర్వదించండి..
ఆశ్రిత్ ఆనంధం ఇచ్చాడు కాబట్టి హ్యాపీ.. అనఘ అద్రుష్టం తెస్తోంది కాబట్టి లక్కీ అని నిక్ నేమ్స్ కూడా ఫిక్స్ చేశాను..
ఇదిగో నా ముద్దుల Full name sri lalitha shiva sundhari mayukha srinija anagha
అనగనగా.. ఏంటి ఏదో కధ చెబుతున్నానని భయపడకండి.. ఎందుకంటే చిన్నప్పుడు మనం కధలు విన్నప్పుడు.. అనగనగాతోనే మొదలయ్యేది. ఇప్పుడు మన పిల్లలకు మనం చెప్పాలన్నా అనగనగా అనే ప్రారంభించాలి.. కానీ నేను అలాంటి కధ ఏదీ చెప్పాలి అనుకో్వడం లేదు. నా జీవితంలోకి వచ్చిన నా అదృష్ట దేవతను పరిచయం చేయాలి అని ఆరాటం..
ఇప్పటి వరకు నా జీవితం అంటే నన్ను అమితంగా ప్రేమించే నా భార్య సుమ.. తరువాత నా సంతోషం.. నా ఆనందం.. నా లోకం.. అన్నీ తానైన నా కొడుకు ఆశ్రిత్.. ఆ ప్రేమ.. ఆ ఆనందానికి ఇప్పుడు అదృష్టం తోడైంది. అదే నా చిన్నారి చిట్టి తల్లి.
మా అమ్మ

ఇది చెప్పడానికి అనగనగా అని ప్రారంభించడం ఎందుకు అంటారా..? దానికి ఒక రీజన్ ఉంది.. నవంబర్ 3.. 2019న నా కూతురు ఈ భూమ్మిదకు అడుగుపెట్టింది. అప్పటి నుంచి తనకు ఏ పేరు పెట్టాలి.. అని పెద్ద కసరత్తే చేశాను. చివరికి అన్నీ కలిసి వస్తాయనే నమ్మకంతో.. తనకి అనఘ అనే పేరు పెట్టాలి అని నిర్ణయించాను.. కాబట్టి నా అనఘ అమ్మకి మీ అందరి ఆశీస్సులు కావాలి.. కేవలం అనఘకు మాత్రమే కాను నా ముద్దుల కొడుకు ఆశ్రిత్ ని కూడా ఆశీర్వదించండి..
ఆశ్రిత్ ఆనంధం ఇచ్చాడు కాబట్టి హ్యాపీ.. అనఘ అద్రుష్టం తెస్తోంది కాబట్టి లక్కీ అని నిక్ నేమ్స్ కూడా ఫిక్స్ చేశాను..
ఇదిగో నా ముద్దుల Full name sri lalitha shiva sundhari mayukha srinija anagha
Full name sri lalitha Shiva sundhari mayukha srinija anagha
ReplyDeleteThank you so much
ReplyDelete