Posts

Showing posts from December, 2014

బిగ్ ఫైట్

Image
                                                 హ్యూస్ కు అంకితం                      గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే బంతులు ... టపటపా రాలే వికెట్లు .. బంతిని కొట్టలేక తలవంచే బ్యాట్స్ ‌ మెన్లు ... బాడీనే లక్ష్యంగా చేసుకొనే బౌన్సర్లు .. మైదానం బయటా లోపలా మాటల తూటాలు ... ఆసీస్ ‌ గడ్డపై భారత్ ‌ టెస్టు సిరీస్ ‌ అంటే సాధరణంగా కనిపించే దృష్యాలు ఇవే . వీటన్నంటికీ తోడు సిరీస్ ‌ ఆరంభానికి ముందే మొదలయ్యే మాటల యుద్ధం . కానీ ఈ సారి పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి . బౌన్సర్ ‌ కారణంగా హ్యూస్ ‌ మరణంతో సిరీస్ ‌ లో కాస్త వేడి తగ్గినట్టు కనిపిస్తోంది ..                  సాధరంగా మైండ్ ‌ గేమ్ ‌ తోనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే ఆసీస్ ‌ జట్టు ఈ సారి సహచర ఆటగాడి మృతితో కాస్త ఒత్తిడిలో ఉంది . ఇది ఆటపై ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి . ముఖ్యంగా బౌన్సర్లు వేయడంలో దిట్టలైన ఆసీస్ ‌ పేసర్లు ఈ సారి జోరు తగ్గిస్తారో .. లేక ఆన వాయితీని కొనసాగిస్తారా అన్నది ఆడిలైడ్ ‌ లో తేలిపోనుంది ...                   అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి తొలి టెస్టు ఫలితం వచ్చేసి ఉండేది