Posts

Showing posts from June, 2019

కొడుకుకి ప్రేమ‌తో

Image
                                 మా ఇంట పంచ‌వ‌సంతం                                           చిన్ని తండ్రి నిన్ను చూడ‌గ‌.. వేయి క‌ళ్లైనా స‌రిపోవురా.. అన్ని క‌ళ్లూ చూస్తుండ‌గా.. నీకు దిష్టంతా త‌గిలేనురా.. ఓ  సినీ క‌వి చెప్పిన ఈ మాట‌లు   అక్ష‌ర‌స‌త్యం.. ఎందుకంటే ప్ర‌తి త‌ల్లిదండ్రీ.. త‌న బిడ్డ బుడిబుడి అడుగులు చూస్తూ.. మురిసిపోతు అనుకునే మాట‌లు ఇవి.. ఇక నా ఫీలింగ్స్ చెప్పాలి అంటే.. ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో రెండు భాగాలు ఉంటాయి.. ఒక‌టి పెళ్లికి ముందు.. రెండోది పెళ్లికి త‌రువాత‌.. కానీ నిజాయితీగా చెప్పాలి అంటే.. నా జీవితం మాత్రం.. ఆశ్రిత్ పుట్ట‌క ముందు..ఆశ్రిత్ పుట్టిన త‌రువాత.. (వాడి మొద‌టి అడుగులు )                                         ఏంటి అంత స్పెష‌ల్ అంట‌రా.. మా ఇంట్లో వాడి బుడి బుడి అడుగులు ప‌డ‌డంతోనే ఏదో తెలియ‌ని క‌ళ‌ వ‌చ్చింది ఇంటికి.. ఆఫీసులోని ఎంత టెన్ష‌న్ ఉన్నా.. బ‌య‌ట ట్రాఫిక్ జామ్‌లు.. అనుకున్న ప‌నులు అవ్వ‌క‌పోవ‌డం.. ఇలా ప‌ర్స‌న‌ల్‌, మ‌నీ ప్రాబ్లమ్స్‌.. కార‌ణం ఏదైనా.. ఎంత ప్ర‌స్టేష‌న్ ఉన్నా.. .. ఇంటికి వ‌చ్చాక ఒక్క‌సారి వాడి నవ్వుల ఫేస్ చూస్తే చాలు అంతా క్ష‌ణాల

అనగనగా ఒక రోజు..

Image
                                                                                          మరిచిపోలేని మదుర జ్ఞాపకం                                                   ఆనందం ఆనందం.. చెప్పలేనంత ఆనందం.. చూపించలేనంత ఆనందం.. రాయడానికి పదాలు కనిపించనంత ఆనందం..చెప్పడానికి మాటలు కూడా అందనంత ఆనందం.. ఏమని చెప్పాలి..  ఎంతని చెప్పాలి.. నా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఒకరోజంతా చాలదేమో.. ఎందుకు అంత ఆనాందం అంటారా... ఆ ఆనందాన్ని ఇచ్చింది ఈ ఫోటోనే..                                                ఒకటి.. రెండు.. మూడు కాదు.. సరిగ్గా 25 ఏళ్లు.. అవును మీరు విన్నది నిజమే.. చిన్ననాటి నా మిత్రులను సరిగ్గా 25 ఏళ్ల తరువాత తొలిసారి కలిసిన ఆ రోజును నేను ఎప్పటికీ మరిచపోలేను. ఎందుకు అంత స్పెషల్‌ అంటారా.. అయితే పూర్తిగా చదవండి..                                             విజయనగరం జిల్లా.. మెంటాడమండలం.. జక్కువ అనే గ్రామంలో పుట్టిన నేను.. హైస్కూల్‌ విద్య అంతా..చల్లపేట స్కూల్‌లోనే సాగింది.. ప్రభుత్వ పాఠశాల అంటే ఎవో పాడైన  పై కప్పులు.. వెలుతురు లేని గదులు.. బెంచీలు లేని క్లాస్‌ రూమ్‌లు కాదు.. నిజంగా ఇప