ఓం నమశ్శివాయ
హాయ్ రా గుడ్ నైట్.. స్వీట్ డ్రీమ్స్... ప్రతి రోజు రాత్రి పూట చాలామంది నోటంట వచ్చే ఆఖరి పదం ఇదే... కానీ ఈ ఒక్క రాత్రి మాత్రం ఆ పదానికి చాలా మంది దూరమవుతారు... అదే శివరాత్రి మహత్యం... ఈ రోజుల్లోనూ చాలామందికి శివరాత్రి రోజు జాగారం చేసే అలవాటు ఉంటుంది. మన ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా హిందువలంతా భావిస్తారు.
శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. కాని ఎంతమంది నియమ నిష్టలతో శివరాత్రి
రోజు జాగారం చేస్తారు?...
ఎవరు ఏ
ఉద్దేశంతో శివరాత్రి జాగారం చేస్తారో చెప్పలేను కాని.. నేను మాత్రం ఐదేళ్ల క్రితం వరకు...
శివరాత్రి జాగారం తప్పని సరిగా చేసేవాడిని. విశాఖపట్నంలో ఉన్నప్పుడు మాత్రం ఏ
ఏడాది మిస్ కాలేదు. ఐతే అదేదో భక్తితో మాత్రం చేసింది మాత్రం కాదండి... నేనే
కాదు... మా ఫ్రెండ్స్ బ్యాచ్‌ది అంతా అదే పని. మార్నింగ్ లేచి హ్యాపీగా కాలేజ్
లేదా షికార్లు వెళ్లి రావడం, రాత్రి బోజనం చేసి.. 9 గంటలకు అడ్డా దగ్గరకి అందరం
చేరిపోయేవారిమి. ఈ రోజు జాగారం చేద్దాం..
ప్లాన్ చెయ్యండి అని ఎవరైనా అనడమే లేటు.. ఒక్కొక్కరిదీ ఒక్కో ఐడియా... మొత్తానికి అంతా కలిసి ఓ నిర్ణయానికి
వచ్చేవాళ్లం... వీదిలో ఎవరైనా అమ్మాయిలంతా కలసి హౌస్‌ఫుల్ ఆడితే... అక్కడ కాసేపు
టైం పాస్ చేసేవాళ్లం. తరువాత ఏదైనా థియేటర్‌లో మిడ్‌నైట్ షోకు వెళ్లిపోవడం
ఆనవాయితీగా జరిగేది. ఇక అక్కడి నుంచి వచ్చేక... అప్పుడే స్టార్ట్ అవుతుంది అసలైన
సమస్య... అందరివీ దాదాపు నిద్ర మొహాలే.. కొంతమంది నిద్ర తట్టుకోలేక ఎక్కడో ఒక
దగ్గర చేరబడడం.. కాఫీ లేదా టీ తాగేందుకు రోడ్ మీదకు వెళ్లి రావడం... అలా ఒక గంట
కష్టపడతూ.. 5 గంటల వరకు టైం గడపడమంటే గగనంలా ఉండేది. పోనీ పడుక్కుండి పోదాం అంటే..
కొందరికీ అమ్మో జాగారం ఉంటమాని మాట తప్పితే పాపం చుట్టుకుట్టుందని కొందరు. అసలైన
ప్రొగ్రాం మిస్ అవుతామని కొందరూ.. ఇలా ఎదో ఒకలా కష్టపడి ఐదు వరకు మెలుకవగా ఉండి..
ఐదు గంటలకు... రోడ్‌పైకి వచ్చి... ఆర్.కె.బీచ్‌కు వెళ్లే బస్ ఎక్కేవాళ్లం. ఇక
ఉదయాన్ని సముద్ర స్నానాలు అంటే అందులో ఉండే మజానే వేరు. ఎక్కడెక్కడినుంచో వచ్చే
అమ్మాయి.. మరోవైపు బీచ్‌లో ఉదయాన్ని ఈత... అసలు ఆ రోజులు ఊహించుకుంటేనే... లైఫ్
ఈజ్ బ్యూటి ఫుల్ అనిపిస్తుంది....
కానీ శివరాత్రి
అంటే అది కాదు. అలాంటి జాగారం చెయ్యాల్సిన అవసరం లేదు. ఇది ఉపవాస పండగ. పగలంతా
ఉపవాసం ఉండి... శివలింగార్చన రాత్రి జాగరణం..
అభిషేకాలు... పార్వతి కళ్యానం.. ఇలా రోజంతా భగవత్ సేవలో.. ధ్యానంతో గడిపితేనే
అసలైన ప్రతి ఫలం లభిస్తుంది. ఏదో టైం పాస్‌కు జాగారం చెయ్యడం వృధా... హ్యాపీగా ఉదయాన్ని
గుడికి వెళ్లి శివుడికి అభిషేకం.. లేదా కనీసం దర్శించుకొని... రాత్రి రెగ్యులర్‌గా టైంకు
పడుక్కోవడం బెస్టు… కానీ చాలా మంది ఈ రోజుల్లో కాస్త సిన్సియర్‌గానే శివరాత్రి ఉపవాసం
ఉంటున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు ఏ టైంలో చూసినా దేవాలయాలన్నీ కిటకిటలాడుతూ కనిపించాయి.
ప్రతి రోజూ ఆ గుడివైపు చూస్తే కనీసం పది మంది కూడ కనిపించేవారు కారు. అలాంటింది ఈ రోజు సాయంత్రం గుడికి
వెళ్తే… మనస్సాంతిగా కాసేపు దేవుడ్ని కోరుకునే అవకాశం కూడా లేనంతంగా జనాలు క్యూ లో
ఉన్నారు. ఏడాది ఏడాదికి దేవాలయాలకు వస్తున్నవారి
సంఖ్య పెరుగుతోంది. కాని అందులో చాల మంది పాపాలు పోతాయనే భయంతో వచ్చిన వారు మాత్రమే
కాదు. అక్కడ అందర్నీ చూశాక.. మళ్లీ మన సంప్రదాయాలు వైపు జనాలు ఆకర్షితులవుతున్నారన్నది
అర్థమైంది. చాలామంది పాత రోజులే బాగున్నాయనే
ఫీలింగ్‌లో ఉన్నారు. అందుకే ఇప్పుడు యూత్
అంతా... ఐదు రోజుల
పెళ్లి… మూడు రోజుల పెళ్లిలవైపు ఆకర్షితులవుతున్నారు. పర్వదినాల్లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.
ఏది ఏమైనా ఇది శుభపరిణామం… అందుకే ఈ రోజు ఏదో టైం పాస్‌గా జాగారం ఉండకూడదని డిసైడ్ అయ్యాను. ఈ సారి మళ్లీ జాగారం అంటూ చేస్తే… అది శివనామస్మరణ లేదా? రోజంతా
దైవ కార్యక్రమాలతొనే గడపాలని నిశ్చయించుకున్నాను… అందరికీ హ్యాపీ శివరాత్రి… అందరికీ
ఆ శివుడు శుభం కలుగజేయాలని ఆశిస్తున్నా.. ఓం నమశ్శివాయ…
Comments
Post a Comment