Posts

Showing posts from February, 2020

WHY THIS KOLAVERI.. KOHLI?

Image
                                వై దిస్ కొలవరి కోహ్లీ..?                                  3.. 19.. 2.. 15 ఇవి విరాట్ కోహ్లీ గత నాలుగు ఇన్నింగ్స్ లో చేసిన పరుగులు.. అసలు కింగ్ కోహ్లీకి ఏమైంది..? కివీస్ గడ్డపై అడుగు పెట్టాక కాన్ఫిడెన్స్ కోల్పోయాడా..? క్రీజ్ లో కాసేపు నిలవాలన్న సంగతి మరిచిపోయాడా..? ఎంత దిగ్గజ క్రికెటర్ కి అయినా.. కెరీర్ లో డౌన్  ఫాల్ ఉంటుంది..  అప్ అండ్ డౌన్స్ కామన్.. అయితే ఒక ఇన్నింగ్స్ లో  కాకపోయినా.. మరో ఇన్నింగ్స్ లో అయినా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ గత 20 ఇన్నింగ్స్ లో కోహ్లీ ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు..                              కోహ్లీ అంటే ఒక పరుగుల యంత్రం.. కివీస్ పర్యటనకు ముందు వరకు కోహ్లీ అంటే ఇదే.. సిరీస్ ఏదైనా.. ఫార్మాట్ ఇంకేదానై.. వేదిక ఎక్కడైనా..? క్రీజ్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి పరుగుల వరద పారించడమే అతడి స్టైల్.. విదేశీ పర్యటనలో సైతం సెంచరీలపై సెంచరీలు సాధించగలిగే టాలెంట్ విరాట్ సొంతం.. మరి ఇప్పుడు కోహ్లిలో పస తగ్గిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.. వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 శతకాలతో మొత్తంగా అంతర్జా

Is there any chance to win

Image
అద్భుతమే జరగాలి.. నిజంగా అద్భుతం జరిగేనా.. కివీస్ ను కొట్టే అవకాశం కోహ్లీసేనకు ఉందా..? ఇప్పటికే 51 రన్స్ ఆధిక్యం ఉంది చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్నాయి క్రీజ్ లో వాట్లింగ్, గ్రాండ్ హోమ్ ఉన్నారు బూమ్రా ఫాంలో లేడు.. షమీ వికెట్లు తీయడం లేదు అశ్విన్ తిప్పేస్తున్నది లేదు.. అప్పుడప్పుడు మెరిసే ఇషాంత్ మాత్రమే 3 వికెట్లు తీశాడు ఈ బౌలింగ్ తో కివీస్ ను త్వరగా ఆలౌట్ చేయడం అంత ఈజీ కాదు..                                తొలి సెసెన్ లో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది కాబట్టి..  బూమ్రా, షమీలో ఫాంలోకి వచ్చి చెలరేగితే.. కివీస్ ను 200 నుంచి 250 లోపు ఆలౌట్ చేయగలగాలి. అంటే న్యూజిలాండ్ ఆధిక్యం ఎట్టి పరిస్థితిలో 100 దాటకూడదు. వందకు పైగా రన్స్  చేయడంతో పాటు.. టార్గెట్ పెట్టడం పాజిబుల్ కాదు..  ఒకప్పటిలా వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్ లేడు వికెట్ల ముందు గోడలా నిలిచిపోయే గ్రేట్ వాల్ ద్రవిడ్ లేడు విరోచిత ఇన్నింగ్స్ ఆడే లక్ష్మన్ లేడు సెంచరీలపై సెంచరీలు బాదే సచిన్ లేడు కనీసం హిట్ మెన్ రోహిత్ ఈ సిరీస్ లో లేడు ప్రస్తుతం జట్టులో ఉన్న కింగ్ కోహ్లీ ఫాంలో లేడు                     ఇప్పుడు భారత ఆశా కిరణాలు..

MY SCHOOL DAYS

Image
                            నా స్కూలు.. ఎంతో  అందమైన ప్రదేశము                                                                                               అదో అందమైన జ్ఞాపకం.. కనులు మూసినా.. తెరిచినా చెరగని ఆనందం.. ఎన్ని సార్లు గుర్తు తెచ్చుకున్నా.. తెలియని మధురానుభూతి.. నా టీనేజ్‌ హై స్కూల్‌ జీవితం.. మన జీవిత ప్రయాణంలో కళాశాలలో విద్యార్థిగా ఎందరో నేస్తాలు, ఎన్నో ఙ్ఞాపకాలు. కాలం వెనక్కి తిరిగి రాదు అని తెలిసినా మళ్లీ అక్కడికే తిరిగి వెళ్లాలనిపిస్తుంది. మన మిత్రులను కలుసుకోవాలనిపిస్తుంది. తెలిసి తెలియని వయసులో.. ఎన్నో అద్భుతాలు మిస్‌ అయ్యాం. అసంభవం అని తెలిసినా అందుకే మళ్లీ వెనక్కు వెళ్లాలి అనిపిస్తోంది.  ఒకటా రెండా.. ఎన్నో అంతులేని అనుభూతులు.. అబ్బుర పడే ఆనందాలు.. కదిలిపోయే అరుదైన క్షణాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిక్షణం ఒక ఆందమైన జ్ఞాపకమే మనకు..  మీ అందరితో గడిపిన జ్ఞాపకాలు.. మీతో పంచుకున్నఅబిప్రాయాలు.. మీ దగ్గర నేర్చుకున్న అలవాట్లు.. మీతో చెప్పిన అబద్ధాలు.. మీతో ఆడిన ఆటలు.. చిలిపి చేష్టలు.. అప్పుడప్పుడూ అలకలు. అల్లర్లు.. ఒకటేంటి.. క్లాస్‌ రూమ్‌లో..

My love letter

Image
HAPPY BIRTHDAY TO YOU SUMA                         ఎలా చెప్పను.. ఏమని చెప్పను.. హ్యాపీ బర్త్ డే టు యు  సుమ ఈ మాట చెపితే సరిపోతుందా.. పోని నచ్చిన గిఫ్ట్ చేతిలో పెట్టి శుభాకాంక్షలు చెపితే సరిపోతుందా.. అసలు ఏమి ఇవ్వకపోయినా.. గుర్తుపెట్టుకొని హ్యాపీ బర్త్ డే డార్లింగ్ అని ఒక్క మాట చెబితే చాలు.. మురిసిపోతుంది.. అదే మూర మల్లెలు ఇచ్చి i love u అని మనకు వచ్చిన మూడు ఇంగ్లీష్ ముక్కలతో పాటు many more happy returns of the day అని చెబితే సంబర పడిపోతుంది.. మా ఆయనకు నా మీద ఎంత ప్రేమ అంటు సిగ్గులు ఒలకబోస్తుంది.. సుమ అనే కాదు ఎవరి భార్య అయినా అంతే అనుకుంటాను.. వాళ్లకంటు ప్రత్యేకంగా ఏమి కోరుకోరు.. భర్త స్తోమతను బట్టే వాళ్ల కోరికలు ఉంటాయి.. ఏ భార్య కూడా.. తాను బాగుండాలి అని దేవుడ్ని కోరుకోదు.. మా ఆయన బాగుండాలి.. నా పిల్లలు బాగుండాలి అని మాత్రమే కోరుకుంటుంది.. కొడుకు పట్ల అమ్మ ప్రేమ ఎలా స్లార్ధం లేకుండా ఉంటుందో.. భర్తపై భార్య ప్రేమ కూడా అంతే స్వార్ధం లేకుండా ఉంటుంది.. అమ్మ కడుపు చూస్తుంది.. భార్య జేబు చూస్తుంది అని పెద్దలు సామెత చెప్పారు.. అవును నిజమే  నా కొడుకు ఆకలితో ఉన్నాడని అమ్మ మాత్రమే గుర్తించగ

BAD LUCK FOR YONG INDIA

Image
                               యువ భారత్ కు బంగ్లా పంచ్.. బ్యాడ్ లక్..  భారత క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ న్యూస్  నిన్న కివీస్ చేతిలో భారత్ రెండో వన్డేలో ఓడింది  దీంతో వన్డే సిరీస్ చేజారింది  ఇవాళ అండర్ 19 వరల్డ్ కప్ లో బంగ్లా చేతిలో యువ భారత్ ఓడింది దీంతో ఐదో అండర్ 19 వరల్డ్ కప్ మిస్సైంది  సీనియర్ ఇండియా ఓడినా..  యువ భారత్ 100 % విశ్వవిజేతగా నిలుస్తుందని అంతా ఆశించారు   కానీ బంగ్లా రివర్స్ పంచ్ వేసింది మ్యాచ్ లు పోయినా  నిన్న సైనా.. ఇవాళ జైశ్వాల్ జైహో అనిపించారు ఇప్పటికే నాలుగు సార్లు అండర్ 19 విశ్వవిజేతగా నిలిచిన యంగ్ ఇండియా.. ఐదో టైటిల్ ను సాధించి.. బంగ్లాకు పంచ్ వేయాలి అనుకుంది.. కానీ టైటిల్ ఫైట్ లో సీన్ రివర్స్ అయ్యంది. సూపర్ ఫాంలో ఉన్న యువ భారత్ పై బంగ్లా టైగర్స్ పంజా విసిరారు.. ఏ స్థాయి క్రికెట్ లో అయినా ప్రపంచ కప్ నెగ్గడం బంగ్లాకు ఇదే తొలిసారి.. అండర్‌-19 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్‌ యంగ్ ఇండియాపై 3వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా మెగా ట్రోపీని ముద్దాడింది. బంగ్లాకు వరుణుడి రూపంలో కాస్త లక్ కూడా ఫేవర్ చేసిం

kirak kurrollu.. (Never Before Ever After)

Image
కోహ్లీ సేన.. సరిలేరు మీకెవ్వరు.. (వీరి వీరి గుమ్మడి పండు.. వీరిని ఓడించేదెవరు?) కింగ్ కోహ్లీ క్రీజులో అడుగుపెట్టలేదు.. రోహిత్ కండరాల నొప్పితో క్రీజ్ వీడాడు.. వికెట్ల వీరుడు షమీ లేడు.. అయినా యంగ్ ఇండియా జోరు ఆగలేదు.. సూపర్ ఓవర్ మిస్సైనా.. సూపర్ సిరీస్ సొంతమైంది.. అదీ ఒక స్పెషల్ డే రోజు.. ఇవాళ తేదీ 02022020.. అంటే ఎటునుంచి రాసినా సేమ్ నెంబర్.. ఆ సెంటిమెంట్ కలిసివచ్చినట్టు ఉంది. టీ 20 ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని.. ఫేస్ టు ఫేస్ సిరీస్ ను 5  0 తో కివీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.. న్యూజిలాండ్ ను వారి గడ్డపై ఫేస్ చేయడమే బిగ్ సవాల్.. అలాంటింది కివీస్ ను కివీస్ గడ్డపై క్లీన్ స్వీప్ చేయడం మాటలా.. నిజంగా కుర్రాళ్లు కిరాక్...                                         అయినా ఈ న్యూజిలాండ్ కు ఏమైంది.. సూపర్ ఓవర్ సెంటిమెంట్ కాదు.. సౌథీ ఓవర్ కూడా కాదు.. అయినా కివీస్ కథ మారలేదు.. టీమిండియా వదల్లేదు. ఒత్తిడిలో భారత్‌ బౌలింగ్‌లో మెరుపులకు బ్రేకులు పడలేదు.. పాపం బ్లాక్ క్యాప్స్  పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.. టీ20 ఫోబియానో.. లేక టీ20లు అచ్చి రావడం లేదో గెలవాల్సిన మ