Posts

Showing posts from April, 2014

మాస్టర్ లేని ముంబై

Image
మాస్టర్ లేని ముంబై... విక్టరీలు వెనకడుగేస్తున్నాయి... పరాజయాలు వెక్కిరిస్తున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ లేని ఇండియన్స్ దగ్గరకు చేరేందుకు మొహమాట పడుతున్నాయి... ఔను ముంబైలో క్రికెట్ దేవుడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.   అందుకే ముంబై ఈ సీజన్ లో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఓడిన ఏకైక జట్టుగా నిలిచింది....   ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఫేవరెట్ జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి . ప్రతి ఏడాది ఇండియన్స్ ‌ పై భారీ అంచనాలు ఉంటున్నాయి . గత సీజన్ వరకు దాదాపు ప్రతి సారి ముంబై అదుర్స్ అనిపించింది . ఈ ఏడాది సీన్ రివర్స్ అయ్యింది . తొలి రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన చేసిన తరువాత పుంజుకుంది ముంబై ... వయసు మీద పడినా .. సచిన్ తమ జట్టులో ఉన్నాడన్న ఒక్క భరోసాతో ముంబై చెలరేగుతూ వచ్చింది . 2010 లో ఫైనల్ ‌ కు చేరుకొని సత్తా చాటింది ... 2011 లో ప్లే ఆఫ్ ‌ కు అర్హత సాధిచింది . 2012 లో అదే ప్రదర్శన పునరావృతం చేసి ప్లే ఆప్ ‌ కు అర్హత సాధిచింది . ఇక 2013 లో ముంబై ఇంకాస్త చెలరేగింది . ఛాంపియన్ ‌ గా నిలిచింది . సచిన్ పెద్దగా రాణించకున్నా ...