My love letter

HAPPY BIRTHDAY TO YOU SUMA

                        ఎలా చెప్పను.. ఏమని చెప్పను.. హ్యాపీ బర్త్ డే టు యు  సుమ ఈ మాట చెపితే సరిపోతుందా.. పోని నచ్చిన గిఫ్ట్ చేతిలో పెట్టి శుభాకాంక్షలు చెపితే సరిపోతుందా.. అసలు ఏమి ఇవ్వకపోయినా.. గుర్తుపెట్టుకొని హ్యాపీ బర్త్ డే డార్లింగ్ అని ఒక్క మాట చెబితే చాలు.. మురిసిపోతుంది.. అదే మూర మల్లెలు ఇచ్చి i love u అని మనకు వచ్చిన మూడు ఇంగ్లీష్ ముక్కలతో పాటు many more happy returns of the day అని చెబితే సంబర పడిపోతుంది.. మా ఆయనకు నా మీద ఎంత ప్రేమ అంటు సిగ్గులు ఒలకబోస్తుంది.. సుమ అనే కాదు ఎవరి భార్య అయినా అంతే అనుకుంటాను.. వాళ్లకంటు ప్రత్యేకంగా ఏమి కోరుకోరు.. భర్త స్తోమతను బట్టే వాళ్ల కోరికలు ఉంటాయి.. ఏ భార్య కూడా.. తాను బాగుండాలి అని దేవుడ్ని కోరుకోదు.. మా ఆయన బాగుండాలి.. నా పిల్లలు బాగుండాలి అని మాత్రమే కోరుకుంటుంది.. కొడుకు పట్ల అమ్మ ప్రేమ ఎలా స్లార్ధం లేకుండా ఉంటుందో.. భర్తపై భార్య ప్రేమ కూడా అంతే స్వార్ధం లేకుండా ఉంటుంది.. అమ్మ కడుపు చూస్తుంది.. భార్య జేబు చూస్తుంది అని పెద్దలు సామెత చెప్పారు.. అవును నిజమే  నా కొడుకు ఆకలితో ఉన్నాడని అమ్మ మాత్రమే గుర్తించగలదు.. భార్య కూడా జేబు చూసేది అందుకే.. రేపటి రోజు మా ఆయన డబ్బులు లేకుండా ఇబ్బంది పడతారేమో అని జాగ్రత్త పడుతుంది..  భర్త ఆకలి గురించి భార్య ఆలోచించాల్సిన అవసరం రాదు.. ఎందుకు అంటే తాను పస్తులు ఉన్నా.. మన కడుపు నింపుతుంది.. ( నా భార్య కాని.. నాకు తెలిసిన మా వదినలైనా.. మా అక్కా చెల్లెల్లు అయినా.. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయినా..ఇంట్లో భర్త ఉన్నాడు అంటే.. మనకు  పెట్టిన తరువాతే వాళ్లు తింటారు.. ) భర్తే తన లోకంగా భార్య బతికేస్తుంది.. అమ్మగా  పిల్లలే తన ప్రపంచం అని జీవితం గడిపేస్తుంది.. అందుకే ఏ భర్త తన భార్య ప్రేమను వెలకట్టలేడు.. నగదు.. నగలు.. ఎన్ని ఇచ్చినా.. ఆమె కోరుకునేది మన నుంచి ప్రేమ మాత్రమే.. ఒక్క పది నిమిషాలు మనం వాళ్లకోసం కేటాయిస్తే చాలు.. భర్తను దేవుడితో కొలిచేస్తారు.. సో భార్య ప్రేమను బహుమానాలతో తక్కువ చేయలేం.. మనం కొంతైనా వాళ్లని సంతోష పెట్టాలి అంటే.. వీలైనంత ప్రేమ చూపించడమే..నేనే తన ప్రపంచం అనుకునే నా భార్యకు.. మాటల్లో చెప్పలేక.. రాస్తున్న ప్రేమ లేఖ ఇది..    ఇలాంటి పుట్టిన రోజులు మళ్లీ జరుపుకోవాలని ఆశిస్తున్నా.. Happy birth day to you suma(సుమం ప్రతి సుమం సుమం.. ప్రేమ మయం నాదు హృదయం..)

Comments

Post a Comment

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..