Posts

Showing posts from September, 2019

జాబిలి జస్ట్‌ మిస్‌

Image
జాబిలి జస్ట్‌ మిస్‌                       జాబిలి .. అందినట్టే అంది జస్ట్‌ మిస్‌ అయ్యింది. సక్సెస్‌ అయిపోతోంది అనుకుంటున్న సమయంలో సిగ్నల్‌ నిలిచిపోయింది. కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్-2 చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. ఊపిరి సలపకుండా ఊరించి చివరికి ఉసూరుమనిపించింది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో దారి తప్పింది. మరికొన్ని క్షణాల్లో చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్‌ అందకుండా పోయింది. చివరి సందర్భంలో విక్రమ్ ల్యాండర్ కొన్ని క్షణాల పాటు తీవ్ర ఉత్కంఠతకు కారణమైంది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో ల్యాండర్ దారి తప్పింది. సుమారు 12 సెకెన్ల పాటు తన నిర్దేశిత మార్గాన్ని వీడి గతి తప్పింది. సరిగ్గా 12 సెకెన్ల తరువాత విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందాయి. గతి తప్పిన ల్యాండర్.. మళ్లీ తన దారిని తానే వెదుక్కుంటూ వచ్చింది. ల్యాండర్ నుంచి సంకేతాలు అందిన వెంటనే శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో అయిదు సెకెన్ల తర