Posts

Showing posts from January, 2020

వాట్ ఏ సూపర్ ఓవర్..

Image
                                      సరిలేరు మీకెవ్వరు.. గూస్ బంప్స్.. వాట్ ఏ సూపర్ ఓవర్ మ్యాచ్.. అస్సలు ఊహించలేదు.. కివీస్ టార్గెట్ 180 రన్స్.. 19వ ఓవర్ ముగిసే సరికి.. న్యూజిలాండ్ 171 రన్స్ కి 4 వికెట్లు..  అంటే 6 బంతుల్లో కావాల్సింది కేవలం 9 రన్ప్.. అప్పటికే 95 రన్స్ తో భారత్ కు డామేజ్ చేసిన కె `విన్` క్రీజులో ఉన్నాడు.. అయినా సీనియర్ షమికి నమ్మకంతో బంతి ఇచ్చాడు కెప్టెన్ కోహ్లీ. . అప్పటికే క్రీజ్ లో ఉన్న హార్డ్ హిట్టర్ రాస్ టేలర్.. తొలి బంతినే సిక్సర్ బాదేశాడు.. దీంతో 5 బంతులకు 3 రన్స్ కావాలి.. అంతా డిసైడ్ అయ్యారు.. మ్యాచ్ గోవిందా అని.. సరే మ్యాచ్ అయితే పోయింది.. కనీసం కెవిన్ సెంచరీ చేస్తే హ్యాపీ అనుకున్నారు హైదరాబాద్ సన్ రైజర్స్ అభిమానులు.. ఎందుకంటే మన ఐ.పి.ఎల్ టీం కెప్టెన్ కెవిన్ కదా... కానీ పర్సనల్ లైఫ్ లో వైఫ్ వేసిన బౌన్సర్లతో.. ఇబ్బంది పడ్డ షమి.. కివీస్ బ్యాట్స్ మెన్ పై ఆ కసి చూపించాడు.. క్రీజ్ లో పాతుకుపోయిన కెవిన్ ను షార్ట్ పిచ్ బంతి వేసి బోల్తా కొ్ట్టించాడు.. కూల్ కీపర్ ధోనీ లేకపోయినా.. పార్ట్ టైమ్ కీపర్ రాహుల్ సూపర్ క్యాచ్ తో కేక పుట్టించాడు.. అయినా మ్యాచ్ గెలుస్త

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

Image
                                                       అనగనగా.. ఒక విషయం చెప్పాలి...                            అనగనగా.. ఏంటి  ఏదో కధ చెబుతున్నానని భయపడకండి..  ఎందుకంటే చిన్నప్పుడు మనం కధలు విన్నప్పుడు.. అనగనగాతోనే మొదలయ్యేది. ఇప్పుడు మన పిల్లలకు మనం  చెప్పాలన్నా అనగనగా అనే ప్రారంభించాలి..  కానీ నేను అలాంటి కధ  ఏదీ చెప్పాలి అనుకో్వడం లేదు. నా జీవితంలోకి వచ్చిన నా అదృష్ట దేవతను పరిచయం చేయాలి అని ఆరాటం..                             ఇప్పటి వరకు నా జీవితం అంటే నన్ను అమితంగా ప్రేమించే నా భార్య సుమ.. తరువాత  నా సంతోషం.. నా ఆనందం.. నా లోకం.. అన్నీ తానైన నా కొడుకు ఆశ్రిత్.. ఆ ప్రేమ.. ఆ ఆనందానికి ఇప్పుడు అదృష్టం తోడైంది. అదే నా చిన్నారి చిట్టి తల్లి.                                                                                                                                     ఇదే నా లక్కీ..