Posts

Showing posts from November, 2014

అమ్మను మించిన దైవం లేదు

Image
                                          అమ్మను మించి దైవమున్నదా...                                                           ఈ రోజు ఆఫీసులో హెవీ వర్క్... చాలా కష్టపడ్డాను... లైఫ్ మీదే విరక్తి పుట్టేసింది. ఎప్పుడు చూడు పని పనీ పనీ... సినిమాలు షికార్లు లేనే లేవు. ఆఫీసు.. ఇళ్లు... ఇదేనా జీవితం... నా వళ్ల కాదు... ఈ మాటలు సాధరణంగా చాలా మంది నోట వింటుంటాం....           అసలు నేను పడ్డ కష్టాలు ఎవరూ పడలేదు... నా కష్టాలు మీకేం తెలుసు... బరువు.. బాధ్యతలూ ఒకటా రెండా ఇలా నిట్టూర్చే వారు ఇంకొందరు....           మొన్నటి వరకు నేనూ పై డైలాగులే చెప్పేవాడ్ని అనుకోండి.... అబ్బా ఈ రోజు ఆఫీసులో తెగ కష్టపడ్డా అని ఫీలవుతుండేవాడ్ని... పని ఎంత ఇష్టంగా చేసినా అప్పుడప్పుడూ కష్టం తప్పేది కాదు... కానీ ఇప్పుడు   ఫీలింగ్ లేకుండా పోయింది. అందుకు కారణం...    ఈ ప్రపంచంలో కష్టం అంటూ ఏదైనా ఉందా అంటే అది అమ్మ డ్యూటీ మాత్రమే అని తెలుసుకున్నా కాబట్టి...           ఓ కొడుకు కోసం అమ్మపడే కష్టాలు చూశాకా... ఇంతకన్నా కష్టమైన పని   ఈ ప్రపంచంలో ఇంకేది లేదనిపించింది. బిడ్డ కడుపులో పడ్డాడు అని తెలిసిన దగ్గ

సూపర్ షటిల్

Image
                           షటిల్ సంచలనం                 భారత షటిల్ ‌ చరిత్రలో పెను సంచలనం నమోదైంది . బ్యాడ్మింటన్ ‌ రారాజుగా దూకుడు చూపిస్తున్న చైనా గడ్డపై ఇద్దరు హైదరాబాదీలు ఒకే సూపర్ ‌ సిరీస్ ‌ లో రెండు టైటిళ్లు నెగ్గి చరిత్ర సృష్టించారు . మహిళల సింగిల్స్ ‌ లో సైనా నెహ్వాల్ ‌, మెన్ ‌ సింగిల్స్ ‌ లో శ్రీకాంత్ ‌ సూపర్ ‌ సిరీస్ ‌ లు సాధించి చైనా కొమ్ములు విరిచారు .              ప్రపంచ బ్యాడ్మింటన్ ‌ చరిత్రలో ఎందరో దిగ్గజాలు వచ్చి వెళ్లినా అందులో లిన్ ‌ డాన్ ‌ ది ప్రత్యేక స్థానం . ఒలింపిక్స్ ‌ లో అడుగు పెట్టిన రెండు సార్లు గోల్డ్ ‌ మెడల్స్ ‌ సాధించాడు . ఇప్పటి వరకు అతడు సాధించని టైటిల్ ‌ లేదు . సొంతం చేసుకోని సిరీస్ ‌ లేదు . ప్రపంచ బ్యాడ్మింటన్ ‌ లో ఉన్న తొమ్మిది సూపర్ ‌ సిరీస్ ‌ లను నెగ్గిన ఏకైవక వీరుడు డాన్ ‌. ఓవరాల్ ‌ గా 56 మేజర్ ‌ టైటిళ్లతో సూపర్ ‌ డాన్ ‌ అనిపించుకున్నాడు . అతడు బరిలో ఉంటే ప్రత్యర్థులు ముందుగానే   మ్యాచ్ ‌ పై ఆశలు వదులు కుంటారు . అలాంటి చైనా దిగ్గజం లిన్ ‌ డాన్ ‌ ను ఎలాంటి అంచనాలు లేని శ్రీకాంత్ ‌ ఓడించి సంచలనం సృష్టించాడు .   భారత్ ‌ తరపున పురుష

నేటి బాలలే రేపటి పౌరులు

Image
                           హ్యాపీ చిల్డ్రన్స్ డే                    ఈ రోజు బాలల దినోత్సవం . ప్రతి ఏడాది నెహ్రూ జన్మదినోత్సవాన్ని ఘనంగానే జరుపుకుంటున్నాం . చాచాజీ జేబులో ఓ గుళాబి పువ్వు . చుట్టూ చేరి ఉన్న చిన్నారులు . ఈ ఫోటో చూస్తే మనకు స్వచ్ఛమైన రూపం కనిపిస్తోంది . ఖచ్చితంగా బాలల దినోత్సవం జరుపుకోవాలని ఆశ కలుగుతుంది . కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే .. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లవుతున్నా . మన దేశంలో చిన్నారుల భవిష్యత్తుకు మాత్రం భద్రత లేదు . దేశంలో అందరికంటే అత్యధికంగా నరక యాతన అనుభవిస్తున్నది చిన్నారులు మాత్రమే . లైంగిక దాడులు . కిడ్నాపులు . చైల్డ్ ‌ లేబరింగ్ ‌. ట్రాఫికింగ్ ‌. ఇలా ఒక్కటేంటే . చాలామంది చిన్నారులు నేటి సమాజంలో నరక యాతన అనుభవిస్తున్నారు . మళ్లీ బాల్యం వస్తే ఎంత బాగుటుందో .. దాదాపు ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా ఈ మాట అనుకోవడం కామన్ ‌. ముఖ్యంగా బుడి బుడి అడుగుల చిన్నారులను .. ముద్దులొలొకే బాల బాలికలను చూసినప్పుడు మనసులో చిన్న నాటి ఊహలు గుసుగుసలాడుతూనే ఉంటాయి . నిజమే బాల్యం అన్నది ఓ అందమైన అనుభవం . ఆటపాటలతో ఖుషీ ఖుషీగా సాగిపోయిన బాల్యం మళ్లీ మళ