ఆ ఒక్క మాట చాలు....

ఫైనల్ ఫైట్ ప్రియమైన ప్రత్యర్థితో....



ఇండియా లక్ష్య చేధనలో ఉన్నప్పుడు... విరాట్ సూపర్ ఫాంలో ఉన్నప్పుడు.. అది ఒక మెగా టోర్నీ అయినప్పుడు... అందులోనూ అది సెమీ ఫైనల్ మ్యాచ్ అయ్యి... దక్షిణాఫ్రికా ప్రత్యర్థి అయినప్పుడు ఏం జరుగుతుంది?...
 సగటు క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ ఫలితాన్ని ఎప్పుడో ఊహించి ఉంటాడు. సరిగ్గా ఆ ఊహ నిజమే అయ్యింది. ఎలాంటి సంచలనాలు లేవు.. భారత అభిమానులకు టెన్షనూ లేదు.. బంగ్లాగడ్డపై మెన్ ఇన్ బ్లూ ఆడుతూ పాడుతూ ప్రొటీస్ టీంను మట్టికరపించేసింది. ఫైనల్లో అడుగుపెట్టింది. ఇష్టమైన ప్రత్యర్థి శ్రీలంకతో టైటిల్ వార్ కు రెడీ అయిపోయింది... ఇక సూపర్ సండే ఏం జరుగుతుందో చూడాలి...
 భారత్-లంక మధ్య మేజర్ టోర్నీలో ఫైనల్ ఫైట్ అంటే... అందరికీ 2011 వరల్డ్ కప్ గుర్తుకు రావడం వెరీ కామన్.. మరి రిజల్ట్ కూడా రిపీట్ అయితే... ఒక ఇండియన్ కు అంతకన్నా కావలసింది ఏ ముంటుంది. అందులోనూ ఇప్పుడు ధోనీ సేన సూపర్ ఫాంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో అదుర్స్ అనిపిస్తోంది. 2011 వరల్డ్ కప్ కు ముందు కూడా ఇదే సీన్. టోర్నీ ఆరంభానికి ముందు భారత్ తీవ్ర ఒత్తిడిలో ఉండేది. అసలు టీమిండియా ఫేవరెట్ అన్న సంగతే ఎవరి నోటంటా వినిపించేది కాదు... కానీ అప్పటి వరకు జట్టులో చోటు కోల్పోయిన యువరాజ్ ఫైనల్ లెవెన్ లో చేరాడు. ధోనీ, కోహ్లీ అవసరమైన సమయంలో చెలరేగారు... అసలు అంచనాలు లేని బౌలర్లు ఇరగదీశారు. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. వన్డే వరల్డ్ కప్ ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కానుకగా ఇచ్చారు....
ఇపా్పాుడోు టీ20 వరల్డ్ కప్ కు ముందూ అదే సీన్. ధోనీ సేనను ఎవరూ ఫేవరెట్ కింద లెక్క కట్టలేదు. యువరాజ్, రైనా ఇద్దరూ జట్టులో చోటు కోల్పోయి... నేరుగా టీ20 వరల్డ్ కప్ లో అడుగు పెట్టారు. ధోనీ, కోహ్లీ సూపర్ ఫాంలో ఉన్నారు. బౌలింగ్ విభాగం వీక్ అనుకుంటే ఇప్పుడు యమ స్ట్రాంగ్ అయ్యింది. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను బురిడీ కొట్టిస్తోంది. ఈ టోర్నీలో భారత్ నెగ్గిన ఐదు మ్యాచ్ ల్లో నాలుగు సార్లు స్పిన్నర్లే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు... అంటే మన బౌలింగ్ డిపార్ట్ మెంట్ ఫాం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు... ఇలా అన్ని పోలీకలు... 2011 వరల్డ్ కప్ కు మేచ్ అవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఫైనల్ వార్ భారత్ –శ్రీలంకల మధ్య జరుగుతోంది...  ఈ ఒక్క మాట చాలు... టీమిండియా ఖాతాలో.. ధోనీ సారథ్యంలో మరో వరల్డ్ కప్ చేరుతుంది అని నమ్మకం పెట్టుకోడానికి.... 

Comments

Post a Comment

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..