మస్త్ టైం పాస్ ఐడియా..

లాక్ డౌన్ చిట్కా 

                                         

                                 హాయ్ గ్రూప్ సభ్యులు అందరికీ ఓ చిన్న సలహా.. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతోందా..? ఆడిన ఆటలే ఆడి.. చెప్పిన కబుర్లే చెప్పి.. చేసిన పనే చేసి టైమ్ పాస్ అవ్వడం లేదా.. అయితే ఆన్ లైన్ లో హౌసీ ఆడండి.. కనిపించని వ్యక్తులతో హ్యాపీగా హౌసీ ఆడొచ్చు.. ఆన్ లైన్ లో హౌసీ ఎలా అని డౌట్ పడుతున్నారా..?

                    వెరీ సింపుల్.. ఒక పెన్ ఆర్ పెన్సిల్.. ఒక వైట్ పే పర్ తీసుకొని బాక్సులు వేసిమీకు నచ్చిన నెంబర్లు వేయండి.. 1 నుంచి 90  వరకు మీకు నచ్చిన 15 నెంబర్లు ఆ బాక్సులో పెట్టండి.. కింద ఉదహరణకు.. వేసిన నెంబర్ వేయకుండా చెక్ చేసుకోండి..
                    

6

26

43

61

83
4

15

36

55

70


9

29

47

64

90
                           ఇలా వేసిన తరువాత మస్ట్ గా ఏ గ్రూపు మిత్రులు, బంధువులతో హౌసీ ఆడాలి అనుకున్నారో ముందుగా ఆ గ్రూపులో మీరు రెడీ చేసిన టికెట్ గ్రూపులో పెట్టండి.. మినిమం పది మంది.. పది దాటి ఎంతమైందనా ఒకే..  ఒక టైం పెట్టుకొని ఆ టైంకి గ్రూపులో అంతా రెడీ అంటే.. అడ్మిన్ వన్ బై వన్ నెంబర్లు చెబుతుంటాడు. కానీ నెంబర్లు చెప్పే వ్యక్తి.. ఆడడానికి అవకాశం ఉండదు.. ఇక హౌసీ రూల్స్ అన్నికామన్ గా వర్తిస్తాయి.. ఇంకా కాస్త ఫన్నిగా కావాలి అంటే.. ఫస్ట్ జల్దీ ఫైవ్ అయిన వ్యక్తి.. గ్రూపులో ఒకరికి ఛాలెంజ్ లేదా ఫన్నీ టాస్క్ ఇవ్వొచ్చు.. తరువాత లైన్లు.. హౌస్ ఫుల్ అయిన తరువాత ఇలా ఫన్నీ గా టాస్క్ లు ఇస్తూ.. ఆత్మీయులతో టైం స్పెండ్ చేయోచ్చు..

                           ఇంకా సోషల్ రెస్పాన్స్ తీసుకుందామనుకుంటే.. టికెట్ కి కొంత అమౌంట్ పెట్టుకొని.. గెలిచిన వారంతా ఆ అమౌంట్ ను గ్రూపు తరపున సీం రిలీఫ్ ఫండ్ కు పంపొచ్చు.. టైం పాస్ అవుతుంది.. మీ వంతు సాయం చేసిన ఆనందం కూడా వస్తుంది.. సింగిల్ గా హెల్ప్ చేయడం కష్టం అనుకుంటే.. ఇలా టైం పాస్ చేస్తూ.. మనం గెలిచిన డబ్బును మన అందరి తరపున హ్యాపీగా సీం రిలీఫ్ ఫండ్ కు పంపొచ్చు... ఇలా ట్రై చేసి చూడండి.. నచ్చితే సలహా పాటించండి.. నచ్చకపోతే తిట్టుకోకండి.. కొన్ని సూచనలు చేయండి..


Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..