వాట్ ఏ సూపర్ ఓవర్..

                                      సరిలేరు మీకెవ్వరు..


గూస్ బంప్స్..
వాట్ ఏ సూపర్ ఓవర్ మ్యాచ్..
అస్సలు ఊహించలేదు..
కివీస్ టార్గెట్ 180 రన్స్..

19వ ఓవర్ ముగిసే సరికి.. న్యూజిలాండ్ 171 రన్స్ కి 4 వికెట్లు..  అంటే 6 బంతుల్లో కావాల్సింది కేవలం 9 రన్ప్.. అప్పటికే 95 రన్స్ తో భారత్ కు డామేజ్ చేసిన కె `విన్` క్రీజులో ఉన్నాడు.. అయినా సీనియర్ షమికి నమ్మకంతో బంతి ఇచ్చాడు కెప్టెన్ కోహ్లీ. .
అప్పటికే క్రీజ్ లో ఉన్న హార్డ్ హిట్టర్ రాస్ టేలర్.. తొలి బంతినే సిక్సర్ బాదేశాడు.. దీంతో 5 బంతులకు 3 రన్స్ కావాలి.. అంతా డిసైడ్ అయ్యారు.. మ్యాచ్ గోవిందా అని.. సరే మ్యాచ్ అయితే పోయింది.. కనీసం కెవిన్ సెంచరీ చేస్తే హ్యాపీ అనుకున్నారు హైదరాబాద్ సన్ రైజర్స్ అభిమానులు.. ఎందుకంటే మన ఐ.పి.ఎల్ టీం కెప్టెన్ కెవిన్ కదా...
కానీ పర్సనల్ లైఫ్ లో వైఫ్ వేసిన బౌన్సర్లతో.. ఇబ్బంది పడ్డ షమి.. కివీస్ బ్యాట్స్ మెన్ పై ఆ కసి చూపించాడు..
క్రీజ్ లో పాతుకుపోయిన కెవిన్ ను షార్ట్ పిచ్ బంతి వేసి బోల్తా కొ్ట్టించాడు.. కూల్ కీపర్ ధోనీ లేకపోయినా.. పార్ట్ టైమ్ కీపర్ రాహుల్ సూపర్ క్యాచ్ తో కేక పుట్టించాడు.. అయినా మ్యాచ్ గెలుస్తుందని ఎవరు అనుకొని ఉండరు..
కానీ షమి మాత్రం మ్యాజిక్ చేశాడు.. వరుసగా డాట్ బాల్స్ తో.. కివీస్ కీపర్ షివర్ట్ ను బెంబేలెత్తించాడు..
అవతల ఎండ్ లో ఉన్న సీనియర్ టేలార్ ఐదో బంతికి సింగిల్ తీసాడు.. రెండు జట్ల స్కోర్లని సమం అయ్యేలా చేశాడు.. మ్యాచ్ టై అయ్యింది.. దీంతో అందరిలో నరాల తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి టేలర్ ఏం చేస్తాడు అని..
షమి మాత్రం సూపర్ స్పెల్ తో బ్లాక్ హోలో బంతిని వేసి.. టేలర్ ను బోల్తా కొట్టించాడు.. మ్యాచ్ నెగ్గేలా చేశాడు..
మ్యాచ్ టైగా ముగించాడు... పోయింది అనుకున్న మ్యాచ్ సూపర్ ఓవర్ కి దారి తీసింది.
సూపర్  ఓవర్ లో సూపర్ షో..
సూపర్ ఓవర్స్ స్పెషలిస్ట్ అయిన కోహ్లీసేన ఎప్పటి లానే రెచ్చిపోయింది.. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 18 రన్స్ టార్గెట్ పెట్టింది.. అయితే ఒక  ఓవర్ లో 18 రన్స్ నాట్  ఏ పాజిబుల్ స్కోర్.. కానీ హిట్ మెన్ రోహిత్ శర్మ పైన భారత అభిమానుల ఆశ.. అయితే అందరి నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆఖరి బంతికి స్టైలిష్ సిక్సర్ తో భారత్ ను గెలిపించాడు మన తెలుగింటి మనవడు రోహిత్ శర్మ..

షమి.. రోహిత్ సూపర్ షో తో టీమిండియా కివీస్ పై  తీన్మార్ ఆడేశారు..
5 టీ20ల సిరీస్ లో.. వరుసగా మూడు మ్యాచ్ లు నెగ్గి..
మరో రెండు మ్యాచ్ లు ఉండాగానే సిరీస్ ను సొంతం చేసుకుంది..
నాకు తెలిసి కివీస్ గడ్డపై భారత జట్టు క్రికెట్ చరిత్రలో..
ఇలా ఒక సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లు నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవడం తొలిసారి అనుకుంటా..
సో సాహో టీమిండియా.. జై హైంద్.. అన్నిఫార్మాట్లలో ఇదే దూకుడు కొనసాగాలని కోరుకుంటున్నా..
పాపం బ్యాడ్ లక్.. కివీస్  ఆడినా ఆరు సూపర్  ఓవర్ మ్యాచ్ ల్లో కివీస్  ఐదో సారి   ఓడింది..
ఆ  ఐదు మ్యాచ్ ల్లోనూ  ఓవర్ వేసింది.. సౌతీనే.. 


Comments

Post a Comment

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days