kirak kurrollu.. (Never Before Ever After)

కోహ్లీ సేన.. సరిలేరు మీకెవ్వరు..

(వీరి వీరి గుమ్మడి పండు.. వీరిని ఓడించేదెవరు?)

కింగ్ కోహ్లీ క్రీజులో అడుగుపెట్టలేదు..
రోహిత్ కండరాల నొప్పితో క్రీజ్ వీడాడు..
వికెట్ల వీరుడు షమీ లేడు..
అయినా యంగ్ ఇండియా జోరు ఆగలేదు..
సూపర్ ఓవర్ మిస్సైనా.. సూపర్ సిరీస్ సొంతమైంది..
అదీ ఒక స్పెషల్ డే రోజు.. ఇవాళ తేదీ 02022020..
అంటే ఎటునుంచి రాసినా సేమ్ నెంబర్..
ఆ సెంటిమెంట్ కలిసివచ్చినట్టు ఉంది.
టీ 20 ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని..
ఫేస్ టు ఫేస్ సిరీస్ ను 5  0 తో కివీస్ ను క్లీన్ స్వీప్ చేసింది..
న్యూజిలాండ్ ను వారి గడ్డపై ఫేస్ చేయడమే బిగ్ సవాల్..
అలాంటింది కివీస్ ను కివీస్ గడ్డపై క్లీన్ స్వీప్ చేయడం మాటలా..
నిజంగా కుర్రాళ్లు కిరాక్...
                                        అయినా ఈ న్యూజిలాండ్ కు ఏమైంది.. సూపర్ ఓవర్ సెంటిమెంట్ కాదు.. సౌథీ ఓవర్ కూడా కాదు.. అయినా కివీస్ కథ మారలేదు.. టీమిండియా వదల్లేదు. ఒత్తిడిలో భారత్‌ బౌలింగ్‌లో మెరుపులకు బ్రేకులు పడలేదు.. పాపం బ్లాక్ క్యాప్స్  పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.. టీ20 ఫోబియానో.. లేక టీ20లు అచ్చి రావడం లేదో గెలవాల్సిన మ్యాచ్ ల్లోనూ పాపం ఓడిపోతోంది. ఎప్పుడూ ఫాంలో ఉన్నట్టు కనిపించే జట్టు ఒక్కసారి కూడా టీ20 వరల్డ్ కప్ లో ఒక్కసారి కూడా ఫైనల్ కు చేరలేదు పాపం..
            ఈ మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా పెట్టింది పెద్ద టార్గెట్ కాదు.. అందులోనూ ఒకే ఓవర్లో 34 పరుగులు ఓ బౌలర్ సమర్పించుకుంటే అమ్యాచ్ పోయినట్టే.. టీ20లో మ్యాచ్ టర్న్ అవ్వడానికి ఒక్క ఓవర్ చాలు.. సరిగా శివం దూబే వేసిన ఒక ఓవర్‌లో 34 పరుగులు చేసింది కివీస్. 10 ఓవర్‌ తొలి రెండు బంతుల్ని సీఫెర్ట్‌ సిక్స్‌లుగా మలచగా, మూడో బంతికి ఫోర్‌, నాల్గో బంతికి సింగిల్‌ తీశాడు. ఇక ఐదో బంతి నో బాల్‌ కాగా, దానికి ఫోర్‌ వచ్చింది. దాంతో ఎక్స్‌ట్రా పరుగు, బంతి కూడా వచ్చింది. దాంతో ఫ్రీ హిట్‌ను సిక్స్‌ కొట్టిన టేలర్‌.. ఆఖరి బంతికి కూడా సిక్స్‌ తో ముగింపు ఇచ్చాడు. 3 వికెట్ల నష్టానికి 93 రన్స్.. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ లేడు.. వైస్ కెప్టెన్ రోహిత్ గాయంతో క్రీజ్ వీడాడు.. అప్పటికి న్యూజిలాండ్ విజయానికి కావాల్సింది. 60 బంతుల్లో 66 రన్స్.. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.. వికెట్ల వీరుడు షమీ కూడా లేకపోవడంతో పోనీ లే న్యూజిలాండ్ బోణీ కొడుతోంది అని ఆ టీం ఫ్యాన్స్ ఆశించారు. 
                  కానీ  ఆ తర్వాత సీఫెర్ట్‌ను సైనీ పెవిలియన్‌కు పంపడంతో కివీస్‌ ఒత్తిడిలో పడింది. సీఫెర్ట్‌ అయిన కాసేపటికి  డార్లీ మిచెల్‌ రనౌట్‌ అయ్యాడు. శాంసన్‌, రాహుల్‌ల అద్భుతమైన రనౌట్‌కు డార్లీ మిచెల్‌ వికెట్‌ను చేజార్చుకున్నాడు. అక్కడ నుంచి రొటీన్ కథే.. వరుసగా న్యూజిలాండ్‌ వికెట్లు కోల్పోవడంతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.  శార్దూల్‌ వేసిన చివరి ఓవర్‌లో ఇష్‌ సోధీ రెండు సిక్సర్లు కొట్టినా.. సెంటిమెంట్ అడ్డుపడింది. సీరిస్ ను చేజర్చుకుంది.. న్యూజిలాండ్ గడ్డపై సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం.. (నెవ్వర్  భిఫోర్.. ఎవ్వర్  ఆఫ్టర్ ) అనొచ్చు..
                       మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. ఓ అరుదైన సీన్ కనిపించింది. సాధారణంగా ప్రత్యర్థి జట్ల కెప్టెన్లు ఒకేచోట కూర్చొని మ్యాచ్‌ చూడటం చాలా అరుదు. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. న్యూజిలాండ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌లు పక్కపక్కనే కూర్చొని మ్యాచ్‌ను తిలకించారు. వీరిద్దరూ అండర్‌-19 క్రికెట్‌  ఆడుతున్నప్పట్నుంచీ స్నేహితులు అందుకే ఒత్తిడిని జయించడం ఎలా..? సూపర్ ఓవర్ లో నెగ్గడం ఎలా అని కోహ్లీ దగ్గర కెవిన్ సలహాలు తీసుకున్నట్టు ఉన్నాడు..

            ఇక ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ మెరుపు ఫీల్డింగ్ ఒక హైలైట్.. బంతిని గాల్లో ఎగిరి పట్టుకున్న శాంసన్‌..  బౌండరీ లైన్‌ అవతలకు వెళ్లే క్రమంలో గ్రౌండ్‌లోకి విసిరేశాడు. దాంతో సిక్స్‌  అనుకున్న ఆ షాట్‌కు రెండు పరుగులే వచ్చాయి.


CLEEN SWEEP

Comments

Post a Comment

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..