గంభీరం పోయిన గౌతమ్



గంభీరమేమైంది...


క్లాసిక్ ఓపెనర్ గౌతమ్ గంభీర్... ఒకప్పుడు టీమిండియాలో పర్మినెంట్ మెంబర్. 2011 వరల్డ్కప్వరకు అతడి ప్లేస్కు తిరుగులేదు. ఎన్నోసార్లు భారత జట్టుకు శుభారంభాలు అందించాడు. కేవలం అంతర్జాతీయ మ్యాచ్ల్లో నే కాదు.. IPLల్లోనూ గంభీర్ దూకుడు కొనసాగించాడు. 2012తో కోల్కతా జట్టును ఛాంపియన్గా నిలిపాడు. మరి ఇప్పుడు ఆ గంభీరమేమైంది...



క్లాసిక్ బ్యాట్స్మన్గా... మ్యాచ్ విన్నర్గా గుర్తింపు పొందిన గౌతి భారత జట్టుకు ఎన్నో చిరస్మరనీయ విజయాలు అందించాడు. టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటాడు. 2011 వరకు గంభీర్ మెన్ ఇన్ బ్లులో శాస్వత సభ్యుడిగా కొనసాగాడు. తరువాత అతడి ఫేట్ మారింది. ధోనీతో విబేధాలు... వ్యక్తిగత ప్రవర్తన.. ఫాం లేమితో టీమిండియాకు దూరమయ్యాడు. భారత జట్టులో చోటు కోల్పోయినా...  కోల్కతా కెప్టెన్గా .పి.ఎల్లో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు .పి.ఎల్లోనూ ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్నాడు. ఏడాది నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు. మూడు సార్లు డకౌట్ అయ్యాడు...
 
 
 

టీమిండియాకు దూరమై దాదాపు ఏడాది కావొస్తోంది. మళ్లీ జట్టులోకి వస్తాడనే నమ్మకం లేదు. మూడేళ్ల క్రితం గంభీర్ కోసం 12.5 కోట్లు ఖర్చు చేసి కొనుక్కుంది కోల్కతా ఫ్రాంచైజీ. తనపై పెట్టిన ఖర్చుకు గంభీర్ న్యాయం చేశాడు. 2012లో తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అయితే అది గతంగానే మిగిలిపోయింది. జట్టులో చోటు కోల్పోయిన గంభీర్ మళ్లీ టీమిండియావైపు చూడాలంటే సీజన్లో అదరగొట్టాల్సి ఉంది. అందుకు భిన్నంగా గంభీర్ఫ్లాప్షో కంటిన్యూ చేస్తున్నాడు...
 




ముంబైతో జరిగిన ఆరంభ మ్యాచ్లో గంభీర్ డకౌట్ అయ్యాడు. పది నిమిషాల పాటు క్రీజ్ లో నిలిచి.. 8 బంతులు ఎదుర్కొన్న గంభీర్ డకౌట్ అయ్యాడు...
ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్ లోనూ అదే రిపీట్ అయ్యింది. 11 నిమిషాలు క్రీజ్లో ఉండి నాలుగు బంతులు ఫేస్ చేసిన గంభీర్ పరుగుల ఖాతా తెరువకుండానే పెవిలియన్ కు చేరాడు...
తొలి రెండు మ్యాచ్లో  కనీసం కొన్ని బంతులు పేస్ చేసిన గంభీర్ బెంగళూర్తో మ్యాచ్లో మరీ తొందర పడ్డాడు. ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు
హ్యాట్రిక్ డకౌట్లతో రికార్డుల్లో నిలిచిన గంభీర్ పంజాబ్తో నైనా రాణిస్తాడని టీం మేనేజ్ మెంట్ ఆశిచింది. అభిమానులు సైతం గంభీర్ ఖాతా తెరవేలంటూ కోరుకున్నారు. అందుకు తగ్గట్టే గంభీర్ సింగిల్తో ఖాతా తెరిచాడు. చేసింది ఒక్క పరుగే అయినా.. సెంచరీ సాధించినంత సంబరపడ్డాడు. కానీ ఏం లాభం ఒక్క పరుగుతూనే సంతృప్తి చెందాడు. 5 బంతులు ఎదుర్కొన్న గంభీర్ 1 పరుగు చేసి పెవిలియన్కు చేరాడు... 





ఒకప్పుడు నిలకడకు మారు పేరు గంభీర్. ఇప్పుడు ఫ్లాప్ అవ్వడంలో నిలకడ ప్రదర్శిస్తున్నాడు. బ్యాట్స్మన్గా.. కెప్టెన్గా  ఫెయిలవుతూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఇదే చెత్త ఫాం కంటిన్యూ అయితే ఫ్యూచర్లో .పి.ఎల్లోనూ గంభీర్కు ప్లేస్ ఉండే అవకాశం లేదు...


 

Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆ ఒక్క మాట చాలు....

ఓం నమశ్శివాయ

ఆట లేక అందమా?

టెస్టు రికార్డులు

పెదవే పలికిన మాటల్లోన తియ్యని మాటే అమ్మ...

My love letter