BAD LUCK FOR YONG INDIA

                               యువ భారత్ కు బంగ్లా పంచ్..

బ్యాడ్ లక్.. 

భారత క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ న్యూస్ 

నిన్న కివీస్ చేతిలో భారత్ రెండో వన్డేలో ఓడింది 

దీంతో వన్డే సిరీస్ చేజారింది 

ఇవాళ అండర్ 19 వరల్డ్ కప్ లో బంగ్లా చేతిలో యువ భారత్ ఓడింది

దీంతో ఐదో అండర్ 19 వరల్డ్ కప్ మిస్సైంది 

సీనియర్ ఇండియా ఓడినా.. 

యువ భారత్ 100 % విశ్వవిజేతగా నిలుస్తుందని అంతా ఆశించారు

 కానీ బంగ్లా రివర్స్ పంచ్ వేసిందిమ్యాచ్ లు పోయినా 

నిన్న సైనా.. ఇవాళ జైశ్వాల్ జైహో అనిపించారు


ఇప్పటికే నాలుగు సార్లు అండర్ 19 విశ్వవిజేతగా నిలిచిన యంగ్ ఇండియా.. ఐదో టైటిల్ ను సాధించి.. బంగ్లాకు పంచ్ వేయాలి అనుకుంది.. కానీ టైటిల్ ఫైట్ లో సీన్ రివర్స్ అయ్యంది. సూపర్ ఫాంలో ఉన్న యువ భారత్ పై బంగ్లా టైగర్స్ పంజా విసిరారు.. ఏ స్థాయి క్రికెట్ లో అయినా ప్రపంచ కప్ నెగ్గడం బంగ్లాకు ఇదే తొలిసారి..
అండర్‌-19 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్‌ యంగ్ ఇండియాపై 3వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా మెగా ట్రోపీని ముద్దాడింది. బంగ్లాకు వరుణుడి రూపంలో కాస్త లక్ కూడా ఫేవర్ చేసింది. చివర్లో వర్షం ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం లక్ష్యాన్ని46 ఓవర్లలో 170 పరుగులకు కుదించారు. బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ అలీ 43 రన్స్ తో చివరివరకు అజేయంగా నిలిచి బంగ్లాదేశ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. అతడికి తోడుగా బంగ్లా ఓపెనర్‌ పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ 47 పరుగులతో రాణించాడు. సూపర్ ఫాంలో భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 4 వికెట్లతో ఫాం కంటిన్యూ చేసినా.. బంగ్లా విజయాన్ని ఆపలేకపోయాడు..
వరల్డ్ కప్ చేజారినా.. యశస్వి జైస్వాల్ మ్యాచ్ లో అదరగొట్టాడు. వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ అయిన.. జైశ్వాల్ జోరు కొనసాగించాడు. 88 పరుగులతో హిట్ అయ్యాడు. అయితే ఈ వరల్డ్ కప్ లో పరుగుల వరద పారించిన ఇతర భారత యువ బ్యాట్స్ మెన్ కీలక ఫైట్ లో చేతులెత్తేశారు. ఫైనల్ వరకు తమకు బ్యాటింగ్ లో తిరుగులేదు అనుకుంటే.. బంగ్లా బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో  భారత యువ జట్టు 177 పరుగులకే ఆలౌటైంది. యువ బంగ్లాను ఓడించడానికి ఈ స్కోరు సరిపోలేదు.. సో బ్యాడ్ లక్.. ఐదో అండర్ 19 వరల్డ్ కప్ తో పంచ్ పవర్ రుచి చూపిస్తుంది అనకున్నయంగ్ ఇండియా నిరాశ పరిచింది. రన్నరప్ ట్రోపీతో సరిపెట్టుకుంది..


Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..