సెంటిమెంటల్ డబుల్



సెంటిమెంటల్ డబుల్ సెంచరీ


రోహిత్‌ డబుల్‌ సెంచరీపై విరాట్‌ కోహ్లీ గుర్రుగా ఉన్నాడా? వన్డేల్లో డబుల్‌ సెంచరీ అంటే భారత్‌కే పరిమితమా? బౌండరీల రికార్డు భారత్‌కే  సొంతమా? డబుల్‌ కొడితే ప్రత్యర్థి 153 రన్స్‌ తేడాతో ఓడిపోవాల్సిందేనా

                        150 ఏళ్ల చరిత్రగల ఈడెన్‌లో రోహిత్‌ శర్మ రికార్డుల మోత మోగించాడు. కోట్లాది క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించాడు. స్టాండిన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి మాత్రం కోపం తెప్పించాడు.
            రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ చేయాలంటే విరాట్ రన్‌ ఔట్‌ అవ్వాలేమో? గతేడాది ఆసీస్‌ మ్యాచ్‌లో రోహిత్‌ మిస్టేక్‌తో కోహ్లీ రనౌట్‌ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ డబుల్‌ సెంచరీ చేశాడు. ఈడెన్‌ గార్డెన్స్‌లో రోహిత్‌ మిస్టేక్‌తో కోహ్లీ రనౌట్‌ అయ్యాడు. ఔటైన వెంటనే కాస్త గుర్రుగా కనిపించిన కోహ్లీ... రోహిత్‌ డబుల్‌తో ఫుల్‌ ఖుషీ అయ్యాడు.

           వన్డే ఇన్నింగ్‌లో అత్యధిక బంతులు ఆడిన రోహిత్‌ డబుల్‌ సెంచరీతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో 25 ఫోర్లతో అగ్రస్థానంలో ఉన్న సచిన్‌, సెహ్వాగ్‌లను  39 ఫోర్లతో వెనక్కు నెట్టేశాడు... 
       కేవలం బౌండరీల ద్వారానే 150 పరుగులు సాధించిన వాట్సన్‌  రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 186 పరుగులు చేశాడు.       

                    వన్డేల్లో ఇప్పటి వరకు నమోదైన నాలుగు డబుల్‌ సెంచరీ భారత బ్యాట్స్‌మెన్‌ చేసినవే కావడం విశేషం. 2010 ఫిబ్రవరిలో గ్వాలియర్‌ వన్డేలో దక్షిణాఫ్రికాపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ 200 పరుగులతో అజేయంగా నిలిచి తొలి డబుల్‌ సెంచరీ రికార్డు సాధించాడు. అదే ఏడాది డిసెంబర్‌లో ఇండోర్‌ వేదికగా విండీస్‌పై సెహ్వాగ్‌ 219 పరుగులు చేసి సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. నవంబర్‌ 2013లో రోహిత్‌ శర్మ బెంగళూర్‌లో ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేశాడు. తాజాగా లంకపై 264 రన్స్‌తో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో డబుల్ డబుల్‌ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. మరోవైపు సచిన్‌, సెహ్వాగ్‌, రోహిత్‌  శర్మ డబుల్‌ సెంచరీ చేసిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ 153 పరుగుల తేడాతో నెగ్గడం విశేషం.ఈ సూపర్బ్‌ ఇన్నింగ్స్‌తో రోహిత్‌ వరల్డ్‌ కప్‌ బెర్త్‌ ఖారరు చేసుకున్నట్టే...



Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆ ఒక్క మాట చాలు....

ఓం నమశ్శివాయ

ఆట లేక అందమా?

టెస్టు రికార్డులు

పెదవే పలికిన మాటల్లోన తియ్యని మాటే అమ్మ...

My love letter