అమ్మను మించిన దైవం లేదు
అమ్మను మించి దైవమున్నదా...
ఈ రోజు ఆఫీసులో హెవీ వర్క్... చాలా
కష్టపడ్డాను... లైఫ్ మీదే విరక్తి పుట్టేసింది. ఎప్పుడు చూడు పని పనీ పనీ...
సినిమాలు షికార్లు లేనే లేవు. ఆఫీసు.. ఇళ్లు... ఇదేనా జీవితం... నా వళ్ల కాదు... ఈ
మాటలు సాధరణంగా చాలా మంది నోట వింటుంటాం....
అసలు
నేను పడ్డ కష్టాలు ఎవరూ పడలేదు... నా కష్టాలు మీకేం తెలుసు... బరువు.. బాధ్యతలూ
ఒకటా రెండా ఇలా నిట్టూర్చే వారు ఇంకొందరు....
మొన్నటి
వరకు నేనూ పై డైలాగులే చెప్పేవాడ్ని అనుకోండి.... అబ్బా ఈ రోజు ఆఫీసులో తెగ
కష్టపడ్డా అని ఫీలవుతుండేవాడ్ని... పని ఎంత ఇష్టంగా చేసినా అప్పుడప్పుడూ కష్టం
తప్పేది కాదు... కానీ ఇప్పుడు ఫీలింగ్
లేకుండా పోయింది. అందుకు కారణం... ఈ
ప్రపంచంలో కష్టం అంటూ ఏదైనా ఉందా అంటే అది అమ్మ డ్యూటీ మాత్రమే అని తెలుసుకున్నా
కాబట్టి...
ఓ
కొడుకు కోసం అమ్మపడే కష్టాలు చూశాకా... ఇంతకన్నా కష్టమైన పని ఈ ప్రపంచంలో ఇంకేది లేదనిపించింది. బిడ్డ
కడుపులో పడ్డాడు అని తెలిసిన దగ్గర నుంచే తల్లి తన ఇష్టాలను చంపుకుంటుంది. విటమిన్
ఫుడ్ అంటూ పత్యం పాటిస్తుంది. ఆపుకోవాలనుకున్నా ఆగని వాంతులు... నీరసం...
స్కానింగ్ లు.. మందులు ఇలా ఒకటా రెండా... తొమ్మిది నెలలూ తన బిడ్డ కోసం నానా యాతన
పడుతుంది. తరువాత నార్మల్ డెలివిరీ అయితే కాస్త ఒకే... అదే సిజేరియన్ అంటే... ఆ
తల్లి పడే యాతన అంతా ఇంతా కాదు... అయినా
ఆమెకు ఆ నొప్పులు ఓ క్షణం బాధ మాత్రమే... తన రూపం బయట ప్రపంచాన్ని చూస్తోందని
తెలియగానే బాధలన్నింటినీ గాలికి వదిలేస్తుంది...
అక్కడ
నుంచి మరిన్ని కష్టాలు... కొడుకు లేద కూతురు కోసం తన ఇష్టాలన్నీ చంపుకుంటుంది.
కనీసం ఇష్టమైన కూరలు తినే అవకాశం కూడా ఉండదు.. అంతా డాక్టర్ల సూచనలోనే డైట్...
తిండి సంగతి పక్కనపెడితే... ఇష్టమైన షికార్లు... సినిమాలు... అన్నింటికీ
పులిస్టాప్ పెట్టాల్సిందే. అంతెందుకు ఎంతో ఇష్టమైన భర్తతో కాసేపు సమయం గడిపే
అవకాశం కూడా ఉండదు... ఆ బిడ్డ అంత ఛాన్స్
ఇవ్వదు కదా... సరిగ్గా ఏదైనా తిందాం అని నోటిలో పెట్టుకోగానే.. సడెన్ గా తన బిడ్డ
నిద్రల్లో కదులుతున్న సౌండ్ వస్తుంది అంతే
ఆ పూటకు ఇక పస్తులే. ఆ బిడ్డ మెల్లి మెల్లిగా పెరుగుతుంటే అమ్మ
కష్టాలు కూడా పెరుగుతుంటాయి. ఆలనా పాలన.. మరోవైపు ఇంటి పనులు... ఇంత చాకీరీ
చేస్తున్నా... బిడ్డ ఏడుపు వినిపిస్తే చాలు ఆ అమ్మ మనసు రోధిస్తుంది. అయ్యో నా
బిడ్డ అంటూ కన్నీరు కారుస్తుంది. దెబ్బలు తగులుతాయేమో... అని ఏ పని చేస్తున్నా ప్రతి క్షణం తన ఆలోచనలు బిడ్డపైనే ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా... తన బిడ్డ
చేసే పనులకు కామన్ గా ఎవరికైనా కోపం వస్తుంది ఒక్క అమ్మకు తప్ప. నిజం చెప్పాలంటే
అమ్మ అయ్యాక... నిద్రకు దాదాపు ఆమె దూరం అయినట్టే... అయినా విసుక్కోదు... విరామం
తీసుకోదు... తన బిడ్డే సర్వసం అనుకుంటూ ఆడిస్తూ.. పాడిస్తూ... తన రూపాన్ని చూసి
మురిసిపోతుంటుంది... అందుకే ఆమె అమ్మ అయ్యింది. అలాంటి అమ్మ పడే కష్టం ముందు ఎవరి
కష్టమైనా దిగదుడుపే. అందుకే మనం అందరం ఖచ్చితంగా అమ్మని గౌరవించాల్సిందే. ఎన్ని
జన్మలైనా మన అమ్మ రుణం మనం తీర్చుకోలేం.. అలా తీర్చుకుందాం అనుకున్నవాడు నిజంగా
మూర్ఖుడే... అమ్మ బతికున్నంత కాలం ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకోగలితే... మన
డ్యూటీ మనం సక్రమంగా చేసినట్టే.. ఆమె ఈ లోకం లేనప్పుడు దానాలు ఎన్ని చేస్తేం ఏం
లాభం... షో అమ్మ ఉన్న ప్రతి ఒక్కరూ ఆమెను దైవంలా పూజిస్తారని ఆశిస్తున్నా.....
ఇప్పుడు నా అర్థాంగి కూడా అమ్మ అయ్యింది...
అవతార
పురుషుడైనా ఆ అమ్మకు కొడుకే...
Comments
Post a Comment