రచ్చ రచ్చే
రోహిత్ రచ్చ
ఈడెన్ ఇన్నింగ్స్ చూశాక రోహిత్ శర్మ కొడితే
అలా ఇలా ఉండదని లంక క్రికెటర్లు చెప్పుకోక తప్పదు. వన్డేల్లో
వీరబాదుడికి సరికొత్త నిర్వచనం చెప్పాడు రోహిత్. నెమ్మదిగా
మొదలెట్టి... మెళ్లి మెళ్లిగా గేర్లు మారుస్తూ
సాగిన అతడి ఇన్నింగ్స్ చివరికి సునామీని తలపించింది. వన్డేల్లో మరెవరికీ సాధ్యం కాని రీతిలో రెండో డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్లో
రెండు రికార్డులు సాధించాడు...
రోహిత్ శర్మ గురించి ఎప్పుడు చెప్పాలన్నా... మోస్ట్ టాలెండెట్ బ్యాట్స్మెన్ అంటారు కామెంటేటర్లు. కానీ
ఎప్పుడు ఆ పదానికి పెద్దగా న్యాయం చేయని ముంబాయి కుర్రాడు ఈడెన్లో విశ్వరూపం చూపించేశాడు. ఎంతో
మంది వన్డే దిగ్గజాలు సాధ్యం కాని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు 27 ఏళ్ల రోహిత్. వన్డేల్లో
రెండో డబుల్ సెంచరీ సాధించి అదుర్స్ అనిపించాడు...
ఈడెన్లో మొదట రోహిత్ బ్యాటింగ్ చూసి ఎవరూ ఈ విద్వంశాన్ని ఊహించి ఉండరు. ఒక్క పరుగుకే తప్పిన రనౌట్. ఆ
తర్వాత బంతిని పేస్ చేయడంలో తడబాటు. దీంతో లంకకు మెయిడిన్ ఓవర్ వచ్చింది. ఆ వెంటనే 4 పరుగుల
దగ్గర అనుకోని లైఫ్... 22వ బంతికి
తొలి బౌండరి... ఇది ఆరంభంలో రోహిత్ ఆట. కానీ తరువాతే మొదలైంది అసలు
స్టోరీ.
ఒక్కసారి
క్రీజ్లో నిలదొక్కుకున్నాక విలయం సృష్టించాడు. ఏ బౌలర్నూ లెక్కచేయలేదు. అతడు ఆడని షాట్ లేదు. మైదానంలో
బంతిని పంపని చోటు లేదు. విధ్వంసం బారిన పడని బౌలర్
లేడు. చూడచక్కని డ్రైవ్లు, అద్భుతమైన కట్ షాట్లు, ఆకట్టుకునే లేట్ కట్, పుల్
షాట్, చిన్న మార్పుతో హెలికాప్టర్ షాట్లు. అతని షాట్లలో ఎక్కడా తడబాటు
లేదు. అర్ధ సెంచరీ చేసేందుకు 72 బంతులు తీసుకున్న రోహిత్ మరో 28 బంతుల
తర్వాత సెంచరీ మార్క్ను అందుకున్నాడు. శతకం తర్వాతే మరింత చెలరేగిపోయాడు. తర్వాతి 164 పరుగులను 73 బంతుల్లోనే అందుకున్నాడు. 15 బంతేల
వ్యవధిలో అతడి స్కోరు 200 నుంచి 250కు చేరింది. ఈ క్రమంలో
అత్యధిక ఫోర్లు సహా అనేక రికార్డులను బ్రేక్ చేసేశాడు. ముందుగా తన 209 పరుగుల
స్కోరును క్రాస్ చేశాడు. ఆ వెంటనే సెహ్వాగ్ 219 పరుగులను
దాటేశాడు.
33 బౌండరీలు
9సిక్సర్లు... 100 బాల్స్ 100 రన్స్...
125 బాల్స్ 150 రన్స్... 151 బాల్స్ 200 రన్స్... 166 బాల్స్ 250 రన్స్... 173 బాల్స్ 264 రన్స్... రోహిత్ బ్యాటింగ్ సాగిన తీరు అది. ఓపెనర్గా బరిలో దిగి చివరి బంతి వరకు ఉండి చిచ్చర పిడుగులా చెలరేగాడు... 30వ ఓవర్ నుంచి హిట్టింగ్కు దిగిన రోహిత్.. ఆరంభం
నుంచి అదే దూకుడు కొనసాగించి ఉంటే అతడి స్కోరు ఈజీగా 300 దాటేదేమో...
Comments
Post a Comment