ఆనందం... ఆనందం...
లైఫ్ అంతా జింగిలాలా....
ఓ గుడ్ న్యూస్
వింటే..
కల నిజమైతే...
కోరిక నెరవేరితే..
కొన్ని రోజుల
నిరీక్షణ ఫలిస్తే...
అసలు నిజంగా అలాంటి
రోజు ఒకటుంటే...
ఉంటే ఏంటి..
కచ్చితంగా ఉంటుంది...
నా లైఫ్ లోనూ
ఉంది...
ఆదే 10 జూన్
2014...
దాదాపు రెండేళ్ల
నుంచి... అయితే మధ్యలోనే తెలిసింది. అంటే 10 అక్టోబర్ 2014నే నా కోరిక త్వరలో తీరుతోంది అని.. ఆ తరువాతే అసలు నిరీక్షణ మొదలైంది... అప్పటి
నుంచి సరిగ్గా తొమ్మిది నెలల నుంచి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది...
మంగళవారం..
స్వాతీ నక్షత్రం.. ఉదయం.. 6 గంటల నుంచి ఓ శుభవార్తకోసం వెయిటింగ్... అప్పటి వరకూ
బాగానే ఉన్నా... సడెన్ గా ఎదో తెలియని ఫీలింగ్.. మరి కాసేపట్లో ఏం జరగబోతోంది అనే
ఆత్రుత... సరిగ్గా 7.15 నిమిషాల నుంచి 7.30 వరకు ఆ పావుగంటా అంతా నిశబ్ధం... లోపల ఏం జరుగుతోంది అనే టెన్షనో లేక మరికొన్ని సెకెన్లలో నా కోరిక నెరవేరుతోందనే
సంతోషమో కారణం తెలియదు కాని.. కొన్ని క్షణాలు నా మైండ్ పని చేయలేదు అసలు... ఆలా
మౌనంగా ఆలోచిస్తూ నాలో నేనే ప్రశ్నలు వేసుకుంటుండగా... సరిగ్గా ఓ ఏడుపు
వినిపిచింది... అయినా ఇంకా ఏదో అలోచిస్తున్నా... అప్పుడు ఒకామె వచ్చి తలుపు తీయమన్నట్టు సైగ చేస్తోంది
కాని నాకు ఏం అర్థం కాలేదు.. పక్కనే ఉన్న మా అత్తయ్యగారు.. తలుపు తీసి... అబ్బాయా
అని అడిగారు.. ఆమె అవును అబ్బాయి పుట్టాడు అని సమాధానమిచ్చింది... అయితే నేను
ఆలోచిస్తున్నది అమ్మాయా.. అబ్బాయా అన్నదాని గురించి కాదు.. ఎందుకంటే నేను అమ్మాయే
పుడుతుందని అనుకున్నా... అయినా అబ్బాయి పుట్టాడు అని తెలిసింది.. అప్పటికే
తేరుకున్న నేను సుమ ఎలా ఉంది అని అడిగాను.. బాగుందని ఆమె చెప్పాక కాస్త రిలాక్స్
అయ్యాను.. కానీ నా లైఫ్ లో ఎప్పుడు అంత హ్యాపీగా ఉన్నట్టు అనిపించ లేదు. ఇప్పటి వరకు నా లైఫ్ లో మరచి పోలేని క్షణాలు అవి. అందుకే నా మనసు
నాకు తెలియకుండానే గాల్లో ఎగిరిపోయింది... ఏదో సాధించాననే సంతోషం దక్కింది... ఆ క్షణం నా
ఆనందాన్ని వర్ణిండానికి నా దగ్గర మాటలు దొరకడం లేదు. ఆ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్
చేసుకోవాలో అర్థం కాలేదు. వెంటనే ఆ నర్సును...
నా కొడుక్కి ఫోటో తీసుకోవచ్చా అని అడిగితే...
ఆ తీసుకోండి అంది.. అలా నా కొడిక్కి తీసిని ఫోటో.. నా జీవితంలో ఓ
మధురానుభూతి...
ఇదిగో ఇదే నా
కొడుడు తొలి ఫోటో...
Nyc
ReplyDelete