డి గ్యాంగ్ రెడీ అంటోంది...
ఐ.పి.ఎల్ కాస్త ఇండియన్ ఫిక్సింగ్ లీగ్‌గా మారిన సమయంలో
బీసీసీఐ మరో తప్పుడు నిర్ణయం తీసుకుంది... ఫిక్సింగ్.. బెట్టింగ్‌లకు అడ్డాగా
మారిని దుబాయ్‌లో తొలి లెగ్ పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది. డీ గ్యాంగ్‌కు తీపి కబురు అందించింది.
ఐపీఎల్ సెవెన్త్ ఎడిషన్ మొదటి షెడ్యూల్ ను బీసీసీఐ
ప్రకటిచింది. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల కారణంగా మొదటి దశలో జరిగే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహిస్తున్నట్టు అఫిషయల్‌గా తేల్చి చెప్పేసింది. ఆ లెక్కన మొదటి దశలో భాగంగా 20 మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. ఏప్రిల్ 16న జరిగే ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‑తో డిపెండింగ్
చాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఇక్కడ మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‌లు ఎలా సాగినా ఫిక్సింగ్.. బెట్టింగ్ లాంటి ఇతర అంశాలపై బీసీసీఐ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు ఇప్పటికే లీగ్‌పై కన్నేసి ఉంటారు. డీ గ్యాంగ్ ఇక ఆ పనిలో బిజీగా ఉండి ఉంటుంది.
Comments
Post a Comment