సుహానా మెస్సీ ఖాన్‌

కింగ్‌ ఖాన్‌ కూతురు సాకర్‌ ప్లేయర్‌






టీచర్‌ పిల్లలు టీచర్‌ కావడం వెరీ రేర్‌.. కానీ డాక్డర్‌ పిల్లలు డాక్టర్‌.. యాక్టర్‌ పిల్లలు యాక్టర్‌ కావడం వెరీ కామన్‌ ఈ రోజుల్లో.. అదే నయో ట్రెండ్‌ కూడా... మరి అలాంటప్పుడు బాలీవడ్‌ సూపర్‌ స్టార్‌... కింగ్ ఖాన్ కూతురు ఏం అవ్వాలి.. లెక్క ప్రకారం ఆమె అడుగులు యాక్టింగ్ వైపే పడాలి... అఫ్‌కోర్స్‌ ఆయనగారి ముద్దుల కూతురు సుహానా టార్గెట్‌ కూడా అదే... కాని ఇప్పుడు మాత్రం బాద్ష్‌ కూతురి ధ్యాసవేరు. యాక్టింగ్‌ సంగతి ఏమో కాని.. ఆటలంటే ఆ అమ్మాయికి మహా ఇష్టం.  కేవలం కింగ్‌ ఖాన్‌ కూతురే కాదు… కొడుకు కూడా స్పోర్ట్స్‌ పై ఇంట్రెస్ట్ చూపడం విశేషం. షారూక్‌కు కూడా ఆటలంటే పిచ్చి. అందుకే ఐ.పి.ఎల్‌లో కోల్‌కతా ఫ్రాంచైజీని కొనుక్కున్నాడు. ఇప్పుడు ఫుట్‌బాల్‌పై దృష్టిపెట్టాడు. మరోవైపు ఆ మద్య స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న చక్‌ దే ఇండియా సినిమాలో నటించాడు. ఆ మూవీ సూపర్‌ హిట్‌ కూడా అయ్యింది. షారూక్‌కు క్రీడలకు ఉన్న బంధం విడదీయలేనిది. అందుకే కింగ్‌ ఖాన్‌ పిల్లలు కూడా ఆటలపై దృష్టిపెట్టారు. ఇది వరకు ఇద్దరూ ట్వైకాండో పోటీల్లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షారూక్‌ కూతురు గేమ్‌ మార్చింది. ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి అయ్యింది. 14 ఏళ్ల సుహానా ఇటీవల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో అదుర్స్‌ అనిపించింది. ధీరూబాయి అంబానీ స్కూల్‌ జట్టుకు కెప్టెన్‌గా సత్తా చాటుతోంది. సుహానా టీం 3-0 తేడాతో ఆర్య విద్యామందిర్‌ పై గెలుపొందింది. గేమ్‌ ఏదైనా సూపర్‌ హిట్‌ అవుతోంది బేబీ సుహానా... అయితే ఆమె టార్గెట్‌ మాత్రం ఒలింపిక్‌లో  మెడల్‌ సాధించడమే లేక.. ప్రపంచ్‌ ఛాంపియన్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవడమే కాదు. తండ్రి వారసత్వాన్ని అందుకొని మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలన్నదే తన అసలైన లక్ష్యం అంటోంది. సుహానా తండ్రి షారూక్‌ కన్న కూతురి ఆట చూసి తెగ మురిసిపోతున్నాడు. ఆమె ఫోటోస్‌ను ట్విట్టర్‌లో అప్‌ లోడ్‌ చేసి ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. తన కూతురు లేడీ మెస్సీ అంటూ తెగ పొంగిపోతున్నాడు. అదీ మేటర్‌...




Comments

my writings

చేతిలో చెయ్యేసి చెప్పేయన...

గంభీరం పోయిన గౌతమ్

టెస్టు రికార్డులు

కొడుకుకి ప్రేమ‌తో

వన్డే రికార్డులు

ఈ రాశి వారికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే

మీకు ఐశ్వర్య సిద్ధి ఉందా.. ఒక్కసారి మీ రాశి ఫలాలు చెక్ చేసుకోండి..

జాబిలి జస్ట్‌ మిస్‌