ఆప్ఘన్ సంచలనం
పసికూన కాదు... ప్రత్యర్థి పని పట్టే జట్టు...
ఆఫ్ఘనిస్తాన్ అంటే తీవ్రమైన
అంతర్యుద్ధాలు, తీవ్రవాద కార్యకలాపాలు, విదేశీ దాడులు.. ఎప్పుడూ ఏవో ఇబ్బందులు...
ఆ దేశం అంటే అందరికీ గుర్తొచ్చేవి ఇవే. అలాంటి ఆప్ఘన్ క్రికెట్‌లో అద్భుతం చేసింది. చరిత్ర సృష్టించింది. తొలిసారి
ఒక టెస్టు ఆడే దేశంపై విక్టరీ కొట్టింది. పదేళ్ల తరువాత శ్రమకు తగ్గ ఫలితం అందుకుంది. ఓవరాల్‌గా ఆఫ్ఘన్
టీంకు ఇది 17వ విజయం మాత్రమే. ఆసియాకప్‌లో భాగంగా ఆతిథ్య బంగ్లాదేశ్‌తో ముగిసిన మ్యాచ్‌లో మొదట ఆ జట్టు 90
పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినా తేరుకుంది. నౌరొజ్ మంగల్ 90, సమీయుల్లా 81 పరుగులతో
విరొచిత బ్యాటింగ్ చేశారు. తమ జట్టుకు 254 పరుగుల గౌరవప్రథమైన స్కోరు అందించారు. షపూర్,
హమిద్ హాసన్‌లు నిప్పులు చెరగడంతో ఆతిథ్య బంగ్లాదేశ్ విలవిల్లాడింది. అయితే చివర్లో జురీ రహ్మాన్ మెరుపు ఇన్నింగ్స్
ఆడడంతో ఆఖర్లో బంగ్లా కాస్త పోరాడగలిగింది. కానీ ఆఫ్ఘన్ కెప్టెన్
నబీ కీలకమైన రెండు వికెట్లు తీసి తన జట్టుకు చిరస్మరనీయమైన విజయాన్ని అందించాడు. బోనస్
పాయింట్‌ను మిస్ అయినా 32 పరుగుల తేడాతో బంగ్లాపై గెలుపొందిన ఆఫ్ఘన్ టీం.. ఈ విజయాన్ని
ఎప్పటికీ మరచిపోలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే ఓ టెస్టు
జట్టుపై గెలుపొంది ఆఫ్ఘన్ టీం చరిత్ర సృష్టించింది.

Comments
Post a Comment