ఆసియాకప్ తొలి మ్యాచ్‌లో లంక పేసర్ మలింగా మ్యాజిక్ చేశాడు. పాకిస్థాన్‌పై చివర్లో నిప్పులు చెరగడంతో లంక 12 పరుగుల తేడాతో టోర్నీలో బోణీ చేసింది. ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు నమోదయ్యాయి..  ఒక మ్యాచ్‌లో 250 పరుగులకు పైగా లక్ష్యం ఉన్నప్పుడు పాకిస్థాన్ ఓడిపోవడం ఇది 12వ సారి కావడం విశేషం.  మలింగా వన్డేల్లో ఆరోసారి 5 వికెట్ల ఫీట్ అందుకున్నాడు. అయితే 61 వన్డేల తరువాత మలింగా మల్లీ ఈ ఫీట్ సాధించాడు. భట్టి వికెట్ తీసిన వెంటనే అతడు ఈ అరుదైన మైలురాయికి చేరాడు.  250 వికెట్లు తీసిన నాలుగో శ్రీలంక బౌలర్‌గా మలింగా రికార్డుల్లో నిలిచాడు.  163 వన్డేల్లో మలింగా ఈ ఫీట్ సాధించాడు. ముత్తయ్య మురళీ ధరన్ 174 మ్యాచ్‌ల్లో 250 వికెట్లు తీశాడు. ఇప్పుడు మురళీ రికార్డును మలింగా బ్రేక్ చేశాడు.  తిరిమన్నె- సంగక్కర రెండో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పాక్‌పై లంక తరపున రెండో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గతంలో సమరవీరా-గురుసింహా జోడి 1992లో ముల్తాన్ వేదికగా జరిగిన వన్డేలో… రెండో వికెట్‌కు 157 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఓవరాల్‌గా శ్రీలంక తరపున రెండో వికెట్‌కు 150కు పైగా పరుగులు చేయడం ఇది పదమూడోసారి.  ఉమర్ అక్మల్ తన కెరీర్‌లో 18వ ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. శ్రీలంకపై అతడికి ఇది ఏడో అర్థ సెంచరీ.  మిస్బా-ఉల్-హక్ తన వన్డే కెరీర్‌లో 36వ అర్థ సెంచరీ చేశాడు. ఇందులో 16 అర్థ సెంచరీలు 2013 నుంచి 2014 మధ్య కాలంలో చేసినవే. ఈ సీజన్‌లో ఇన్ని అర్థ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌ మిస్బా ఒక్కడే కావడం విశేషం. ఓవరాల్‌గా లంకపై మిస్బా 9 అర్థ సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లు కలిపి మహేల జయవర్ధనే 600 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. సచిన్ 664 తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్ జయవర్థనే.

Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆ ఒక్క మాట చాలు....

ఓం నమశ్శివాయ

ఆట లేక అందమా?

టెస్టు రికార్డులు

పెదవే పలికిన మాటల్లోన తియ్యని మాటే అమ్మ...

My love letter