శ్రీలంక డేంజరస్ బౌలర్ లసిత్ మలింగ అరుదైన ఘనత సాధించాడు. 250 వికెట్లు తీసిన నాలుగో లంక బౌలర్గా రికార్డుల్లో నిలిచాడు. ముత్తయ్య మురళీ ధరన్ కంటే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించాడు. ప్రపంచ వన్డే చరిత్రలో ఈ ఘనత అందుకున్న తొమ్మిదో బౌలర్గా రికార్డులకెక్కాడు. అత్యంత వేగంగా 250 వికెట్లు తీసిన టాప్ టెన్ లిస్టులో ముగ్గురు పాకిస్థాన్, ముగ్గురు ఆసీస్ క్రికెటర్లు ఉన్నారు. ఇండియాకు చెందిన అజిత్ అగార్కర్ 163 వన్డేల్లో 250 వికెట్లు తీసినా మలింగా కంటే ఒక ప్లేస్ ముందు… అంటే ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ రికార్డుల్లో విశాఖపట్నం కూడా స్థానం సంపాదించింది. దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్నర్ తన 250 వికెట్ల ఫీట్ను వైజాగ్ స్టేడియంలోనే అందుకోవడం విశేషం. అయితే ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి స్టేడియంలో మాత్రం కాదు. అప్పుడు అంతర్జాతీయ మ్యాచ్లకు వేదికగా నిలిచిన ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో. కానీ ఇప్పుడు ఆ స్టేటియం చుట్టూ ఎక్కడ చూసినా చెత్తా చెదారాలే కనిపిస్తాయి. అక్కడ మ్యాచ్లు జరిగాయంటే ఇప్పుడు చూసినవాళ్లవరూ నమ్మరు…
వన్డేల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు అందుకున్న వీరులు…
సక్లైన్ ముస్తాక్ పాకిస్థాన్ 138...
బ్రెట్ లీ ఆస్ట్రేలియా 139...
వకార్ యూనిస్ పాకిస్థాన్ 148...
అలెన్ డొనాల్డ్ ధక్షిణాఫ్రికా 148...
షేన్ వార్న్ ఆస్ట్రేలియా 161...
మెక్గ్రాత్ ఆస్ట్రేలియా 161...
మఖియా ఎంతిని ధక్షిణాఫ్రికా 162...
అజిత్ ఆగార్కర్ భారత్ 163...
లసిత్ మలింగా శ్రీలంక 163...
వసీం అక్రమ్ పాకిస్థాన్ 173...

Comments
Post a Comment