ఆగడు

                                                 ఆగడు

పకడో.. పకడో..  అంటూ పరుగులు తీయాల్సిందే కోహ్లీ క్రీజ్లో ఉంటే… ఫీల్డర్లకు ఇంతకన్నా వేరే ఆఫ్షన్ఉండుదులక్ష్య చేధనలో అతడు ఆగడు. ప్రత్యర్థి టీం అతడ్ని ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దూకుడు తగ్గించడు. అందుకే లక్ష్య చేధనలో ఆడు మగాడ్రా బుజ్జీ అనిపించుకున్నాడు. రెండు మూడు సార్లు కాదు.. 75 శాతం సూపర్‌ ఇన్నింగ్స్తో అతడు భారత్ను గెలిపించాడు

                 టీమిండియా రెండో ఇన్నింగ్స్ఆడుతున్నప్పుడు కోహ్లీ క్రీజ్లో ఉంటే మ్యాచ్మనదే అని సగటు అభిమాని డిసైడ్అవ్వడం ఖాయం. ఇక సెంచరీ కొట్టాడంటే వార్వన్సైడ్అవ్వాల్సిందే. ఆసియాకప్లో ఆతిథ్య బంగ్లాదేశ్తో ముగిసిన మ్యాచ్లోనూ అదే జరిగింది. లక్ష్య చేధనలో కోహ్లీ 12వ సెంచరీ చేశాడు. అందులో 11 సార్లు భారత్విక్టరీలు సాధించిందంటే కోహ్లీ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు...
              ప్రపంచ క్రికెట్ చరిత్రను చూస్తే లక్ష్య చేధనలో అత్యధికంగా సెంచరీలు చేసి జట్టును గెలిపించిన రెండో క్రికెటర్గా కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటి వరకు మాస్టర్ బ్లాస్టర్సచిన్‌ టెండూల్కర్‌ 14 శతకాలతో జట్టును గెలిపించి అగ్రస్థానంలో ఉన్నాడు. 11 సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఫాం కంటిన్యూ అయితే సచిన్ను ఈజీగా క్రాస్చేసేస్తాడు
          
               ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీతో వన్డే కెరీర్లో 19 శతకం తన ఖాతలో వేసుకున్నాడు. అందులో 13 సెంచరీలు రెండో ఇన్నింగ్స్ఆడుతున్నప్పుడు చేసినవే కావడం విశేషం. కోహ్లీ కంటే సచిన్మాత్రమే రెండో ఇన్నింగ్స్సెంచరీల్లో ముందున్నాడు. లక్ష్య చేధనలో సచిన్‌ 17 శకతాలతో టాప్‌ లిస్టులో ఉన్నాడు...


               వన్డే వరల్డ్‌ క్రికెట్‌లో నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌ ఎవరంటే సచిన్‌ లేదా లారా పేర్లే వినిపించేవి... ఇకపై కోహ్లీ పేరే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అతి తక్కువ మ్యాచ్‌ల్లోనే లారాను కోహ్లీ ఈక్వల్‌ చేశాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్‌గా చెప్పుకొనే.. బ్రయన్‌ లారా తన కెరీర్‌లో చేసింది కేవలం 19 సెంచరీలు మాత్రమే. విరాట్‌ కోహ్లీ 124 వన్డేలకే 19 శతకాలను అందుకున్నాడు. ప్రపంచ వన్డే క్రికెటర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో విరాట్‌ ఎనిమదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ లిస్టులో సచిన్‌ 49, పాంటింగ్‌ 30,  జయసూర్య 28, గంగూలీ 22, గేల్‌ 21, గిబ్స్‌ 21, అన్వర్ 20 శతకాలతో ముందున్నారు. ఆసియా కప్‌లోనే కోహ్లీ ఒకరిద్దరిని దాటే అవకాశాలు ఉన్నాయి..

       
              కేవలం సెంచరీలు చేయడమే కాదు.. మ్యాచ్‌లను గెలిపించడంలోనే కోహ్లీ ఒక్క మగాడే. అందుకే అంత్యంత యంగ్‌ ఏజ్‌లో 18 మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్నాడు. వన్డేల్లో అజారుద్దీన్‌, ధోనీలు కూడా ఇప్పటి వరకు 18 సార్లు ఈ అవార్డును అందుకున్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు కోహ్లీ 11 సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్నాడు. మరే ప్లేయర్‌కు ఇన్నిసార్లు ఈ అవార్డు దక్కలేదు...
      
            ప్రస్తుతానికి కోహ్లీ ఒక బ్యాట్స్ మన్‌గా ఇంకా ప్రూవ్‌ చేసుకోవాల్సింది ఏమీ లేదు. కెప్టెన్సీలో కూడా తాను సూపర్‌ సక్సెస్‌ అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.  కెప్టెన్‌గా రెండో సెంచరీతో భారత్‌ను గెలిపించాడు. ఇప్పటి వరకు  12 సార్లు భారత కెప్టెన్‌లు జట్టును గెలిపించే సెంచరీలు చేశారు. గంగూలీ అందరికంటే  సెంచరీలతో ముందున్నాడు.



       రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ… ఇక వన్డే క్రికెట్‌కు నేనొక్కడినే నెంబర్‌ వన్‌ అని సెంచరీలతో చేసి చూపిస్తున్నాడు.  ఎవడు కొడితే బంతులు బౌండరీలు దాటేస్తాయో? ఎవడు క్రీజ్‌లో ఉంటే లక్ష్యం చిన్నది అయిపోతుందో. ఎవరు సెంచరీ చేస్తే రికార్డులు బ్రేక్‌ అవుతాయో. అతడే విరాట్‌ కోహ్లీ అనిపించుకుంటున్నాడు…

Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..