బ్లాక్‌బస్టర్‌ ఫ్రై డే!!!

                                       

                         వింటే భారతం వినాలి... తింటే గారెలే తినాలి... చూస్తే?...




బ్లాక్‌ బస్టర్‌ ఫ్రైడేకి క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా రెడీ అయ్యారా? మూడు గంటల పాటు ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు టీ20 వరల్డ్‌ కప్‌ రెడీ అయ్యింది. ఓ మెగా ఫైట్‌తో ధానధన్‌ వరల్డ్‌ కప్‌కు తెరలేస్తోంది…. అది అలాంటి ఇలాంటి మ్యాచ్‌ కాదు… రియల్‌ వరల్డ్‌ వార్‌ను తలపించే ఫటాఫట్‌ ఫైట్‌… అదే దాయుదల మధ్య అసలైన సమరం…
                వింటే భారతం వినాలి... తింటే గారెలే తినాలి... ఇది ఒకప్పటి సామెత…. అదే క్రికెట్‌కు అన్వయించి చూస్తే భారత్‌-పాకిస్థాన్‌ల మధ్యే మ్యాచ్‌ చూడాలి? అనుకోక తప్పదు.  అప్పుడే క్రికెట్‌ చూసిన ఫీలింగ్‌. ఈ రెండు జట్లు మైదానంలో తలపడుతుంటే అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి క్రికెటర్‌ ఒక సైనికుడిలా మారుతాడు… డూ ఆర్‌ డై తేల్చుకోడానికి సై అంటాడు… అక్కడ మాటల తూటాలు… బౌండరీ బాంబులూ… టపటపా వికెట్లు పేలడం కామన్‌. ఓటమిని అంగీకరించడానికి ఏ ఒక్కరూ ఇష్టపడరు. సర్వశక్తులూ ఒడ్డేందుకు ట్రై చేస్తారు. చెమటలు చిందేలా శ్రమిస్తారు. ఎందుకంటే ఈ వార్‌లో గెలిచిన వారు స్వదేశంలో హీరోలు అవుతారు… ఓడిన వారు సొంత ఊళ్లో అడుగుపెట్టేందుకు కూడా భయపడతారు… ముఖ్యంగా పాక్‌ ఓడితే… ఆ దేశ క్రికెటర్లు దేశంలో అడుగుపెట్టడం అంత ఈజీ కాదు. అందుకే ఈ వార్‌కు ప్రపంచ వ్యాప్తంగా చెప్పలేని క్రేజ్‌. కానీ ఇప్పుడు అంత వేడి వాతావరణం కనిపించడం లేదు. ఒకప్పుడు ఇండో –పాక్‌ వార్‌ అంటే ఆటగాళ్ల మధ్య మాటల యుధ్దం.. తోపులాట వెరీ కామన్‌. ఇప్పుడు కాస్త కూల్‌గానే మ్యాచ్‌లు ముగుస్తున్నాయి.. కానీ అభిమానులకు మాత్రం టెన్షన్‌ తప్పడం లేదు. మ్యాచ్‌ చూస్తున్నవారంతా వారే స్వయంగా బరిలో ఉన్నట్టు ఫీలైపోతారు?…

            మెగా ఈవెంట్లలో ఇండో-పాక్‌ వార్‌ అంటే భారత్‌దే పై చేయి… వరల్డ్‌కప్‌ల్లో ఇప్పటి వరకు భారత్‌-పాకిస్థాన్‌లు 8 సార్లు పోటీ పడితే.. పాకిస్థాన్‌ ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఐదు వన్డేలు, మూడు టీ 20ల్లో భారత్‌నే విజయలక్ష్మి వరిచింది. ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లూ ఐదుసార్లు పోటీ పడితే పాకిస్థాన్‌ ఒక్కసారి మాత్రం గెలుపొందింది. ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి?... మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నా… టీ20 వరల్డ్‌ కప్‌ ఆరంభ మ్యాచే చిరకాల ప్రత్యర్థుల మధ్య జరుగుతుండడంతో టోర్నీకి మంచి ఓపెనింగ్‌ లభించినట్టే… సో డోంట్‌ మిస్‌…

Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..