MY SCHOOL DAYS
నా స్కూలు.. ఎంతో అందమైన ప్రదేశము
అదో అందమైన జ్ఞాపకం.. కనులు మూసినా.. తెరిచినా చెరగని ఆనందం.. ఎన్ని సార్లు గుర్తు తెచ్చుకున్నా.. తెలియని మధురానుభూతి.. నా టీనేజ్ హై స్కూల్ జీవితం..
మన జీవిత ప్రయాణంలో కళాశాలలో విద్యార్థిగా ఎందరో నేస్తాలు, ఎన్నో ఙ్ఞాపకాలు. కాలం వెనక్కి తిరిగి రాదు అని తెలిసినా మళ్లీ అక్కడికే తిరిగి వెళ్లాలనిపిస్తుంది. మన మిత్రులను కలుసుకోవాలనిపిస్తుంది. తెలిసి తెలియని వయసులో.. ఎన్నో అద్భుతాలు మిస్ అయ్యాం. అసంభవం అని తెలిసినా అందుకే మళ్లీ వెనక్కు వెళ్లాలి అనిపిస్తోంది.
ఒకటా రెండా.. ఎన్నో అంతులేని అనుభూతులు.. అబ్బుర పడే ఆనందాలు.. కదిలిపోయే అరుదైన క్షణాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిక్షణం ఒక ఆందమైన జ్ఞాపకమే మనకు..
మీ అందరితో గడిపిన జ్ఞాపకాలు.. మీతో పంచుకున్నఅబిప్రాయాలు.. మీ దగ్గర నేర్చుకున్న అలవాట్లు.. మీతో చెప్పిన అబద్ధాలు.. మీతో ఆడిన ఆటలు.. చిలిపి చేష్టలు.. అప్పుడప్పుడూ అలకలు. అల్లర్లు.. ఒకటేంటి.. క్లాస్ రూమ్‌లో.. క్లాస్ బయతా ప్రతి ఫ్రేమ్ ఒక రంగుల ప్రపంచలా కళ్ల ముందుకు కదులుతోంది..
40 ఏళ్ల వయసులో వంద అడుగులు వేయాలంటేనే ఆయసం వచ్చే రోజులు ఇవి.. కానీ స్కూల్‌కు వెళ్తున్నామనే ఉత్సాహమో.. మీరంతా ఉన్నారన్న ఆనందమో.. కారణం తెలియదు కాని.. ఇటు రెండు కిలోమీటర్లు.. అటు రెండు కిలోమీటర్లు.. గాల్లో తేలిపోయేలా రయ్‌మంటూ నడిచేసేవాళ్లం.. రోడ్లు లేవు. సరైన చెప్పులు లేవు.. అంతా పొలం గట్లు.. జలజల పారే గెడ్డలు.. వర్షం పడితే తెగిపోయే చెరువు గట్లు.. మధ్యలో పాము.. పురుగులు ఇలా ఎన్ని అడ్డంకులు ఉన్నా.. ఉత్సాహం ఎక్కడా ఆగలేదు.
టమోటాలు, దొండకాయలు, చింతకాయలు, ఉల్లిపాయలు, కందికాయలు ఇలా ఒకటేంటి తోవంటా ఎన్నో చిలిపి చేష్టలు.. భుజానికి బ్యాగులు.. చేతిలో క్యారేజీలు.. మాస్టర్లతో బడిత పూజలు.. ఏదీ ఎప్పటికీ మరిచి పోలేని మధుర జ్ఞాపకమే.. ఇవన్నీ నిన్నటి మన తీపి జ్ఞాపకాలు..
ఇంకా ఎన్నో.. ఎన్నో ఊసులు.. చెప్పడానికి ఒక పేజీ కూడా చాలదు.. మన 40 ఏళ్ల జీవితంలో.. ఎప్పటికీ గుర్తుండిపోయే మధురస్మృతులు.. రాస్తున్నంత సేపు కళ్ల ముందు కదలాడుతున్నాయి.. ఇకా ఎన్నో చెప్పాలి అని ఉన్నా.. అందరికీ చదివే ఓపిక ఉటుందో లేదో అని.. మధ్యలో ఆపుతున్నా.. మీ అందరికీ మన స్కూల్ జీవితం గుర్తు చేసేందుకు ఓ చిరు ప్రయత్నం..
Comments
Post a Comment