Is there any chance to win

అద్భుతమే జరగాలి..

నిజంగా అద్భుతం జరిగేనా..
కివీస్ ను కొట్టే అవకాశం కోహ్లీసేనకు ఉందా..?
ఇప్పటికే 51 రన్స్ ఆధిక్యం ఉంది
చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్నాయి
క్రీజ్ లో వాట్లింగ్, గ్రాండ్ హోమ్ ఉన్నారు
బూమ్రా ఫాంలో లేడు.. షమీ వికెట్లు తీయడం లేదు
అశ్విన్ తిప్పేస్తున్నది లేదు..
అప్పుడప్పుడు మెరిసే ఇషాంత్ మాత్రమే 3 వికెట్లు తీశాడు
ఈ బౌలింగ్ తో కివీస్ ను త్వరగా ఆలౌట్ చేయడం అంత ఈజీ కాదు..   

                            తొలి సెసెన్ లో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది కాబట్టి..  బూమ్రా, షమీలో ఫాంలోకి వచ్చి చెలరేగితే.. కివీస్ ను 200 నుంచి 250 లోపు ఆలౌట్ చేయగలగాలి. అంటే న్యూజిలాండ్ ఆధిక్యం ఎట్టి పరిస్థితిలో 100 దాటకూడదు. వందకు పైగా రన్స్  చేయడంతో పాటు.. టార్గెట్ పెట్టడం పాజిబుల్ కాదు.. 

ఒకప్పటిలా వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్ లేడు
వికెట్ల ముందు గోడలా నిలిచిపోయే గ్రేట్ వాల్ ద్రవిడ్ లేడు
విరోచిత ఇన్నింగ్స్ ఆడే లక్ష్మన్ లేడు
సెంచరీలపై సెంచరీలు బాదే సచిన్ లేడు
కనీసం హిట్ మెన్ రోహిత్ ఈ సిరీస్ లో లేడు
ప్రస్తుతం జట్టులో ఉన్న కింగ్ కోహ్లీ ఫాంలో లేడు

                    ఇప్పుడు భారత ఆశా కిరణాలు.. అసలైన టెస్టు.. ప్లేయర్లు పుజారా.. రహనేలు మాత్రమే.. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ ను 50 పరుగులు లోపే  ఆలౌట్ చేయాలి. తరువాత పుజారా, రహనేల్లో ఒకరు క్రీజ్ లో పాతుకుపోవాలి.. కివీస్ ముందు భారీ టార్గెట్ పెట్టాలి అప్పుడే అద్భుతం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయని ఆశించడం అత్యాశే అవుతుంది. గత రికార్డులు అంత అనుకూలంగా లేవు. ఇప్పటి  వరకు భారత క్రికెట్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులు, అంతకంటే తక్కువ పరుగులు చేయడం 59 టెస్టుల్లో జరిగితే, విదేశాల్లో 30వ సారి. వీటిలో ఏ ఒక్క టెస్టును టీమిండియా గెలిచిన సందర్భాలు లేవు. మొదటి ఇన్నింగ్స్‌లో 165, అంతకంటే తక్కువ పరుగులు నమోదు చేసిన అన్ని సందర్భాల్లో భారత్‌ను ఎక్కువ శాతం పరాజయమే.  వెక్కిరించింది. 59 టెస్టుల్లో 40 కోల్పోతే, 16 డ్రాగా ముగిసాయి. మరో మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్ విజయం సాధించింది. విదేశాల్లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 165, అంతకంటే తక్కువ రన్స్ నమోదు చేసినప్పుడు ఇప్పటి వరకు గెలిచింది లేదు. ఈ మ్యాచ్ మినహా 29 టెస్టుల్లో 23 మ్యాచ్‌ల్లో ఓడింది.  6 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ప్రస్తుత ప్లేయర్ల  ఫాం.. కివీస్ ఆట తీరు చూస్తూ ఉంటే.. డ్రా చేసుకోవడమూ కష్టమే.. కచ్చితంగా అద్భుతం జరగాల్సిందే.. 


                              ఈ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే కచ్చితంగా అదుర్సే అవుతుంది. మరి కోహ్లి నేతృత్వంలోని టీమిండియా గెలిచి కొత్త రికార్డు లిఖిస్తుందో లేదో చూడాలి. ఇక కివీస్‌తో తొలి టెస్టు డ్రా అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ టీమిండియాకు 5 శాతమే గెలిచే అవకాశం ఉంటే.. న్యూజిలాండ్‌ గెలవడానికి 80 శాతం ఛాన్స్ ఉంది. అద్భుతం జరిగితే తప్ప డ్రా అయ్యే అవకాశం లేదు. ఈ టెస్టులో భారత్‌ ఓడిపోతే మాత్రం టెస్టు చాంపియన్‌షిప్‌ ప్రవేశపెట్టిన తర్వాత భారత్‌కు ఎదురయ్యే తొలి ఓటమి ఇదే అవుతుంది. గతేడాది చివర్లో ఆ చాంపియన్‌షిప్‌ ఆరంభమయ్యాక భారత్‌ వరుసగా ఏడు విజయాలను నమోదు చేసింది. ప్రస్తుతం 360 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..