WHY THIS KOLAVERI.. KOHLI?

                               వై దిస్ కొలవరి కోహ్లీ..?


                                 3.. 19.. 2.. 15 ఇవి విరాట్ కోహ్లీ గత నాలుగు ఇన్నింగ్స్ లో చేసిన పరుగులు.. అసలు కింగ్ కోహ్లీకి ఏమైంది..? కివీస్ గడ్డపై అడుగు పెట్టాక కాన్ఫిడెన్స్ కోల్పోయాడా..? క్రీజ్ లో కాసేపు నిలవాలన్న సంగతి మరిచిపోయాడా..? ఎంత దిగ్గజ క్రికెటర్ కి అయినా.. కెరీర్ లో డౌన్  ఫాల్ ఉంటుంది..  అప్ అండ్ డౌన్స్ కామన్.. అయితే ఒక ఇన్నింగ్స్ లో  కాకపోయినా.. మరో ఇన్నింగ్స్ లో అయినా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ గత 20 ఇన్నింగ్స్ లో కోహ్లీ ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు..

                             కోహ్లీ అంటే ఒక పరుగుల యంత్రం.. కివీస్ పర్యటనకు ముందు వరకు కోహ్లీ అంటే ఇదే.. సిరీస్ ఏదైనా.. ఫార్మాట్ ఇంకేదానై.. వేదిక ఎక్కడైనా..? క్రీజ్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి పరుగుల వరద పారించడమే అతడి స్టైల్.. విదేశీ పర్యటనలో సైతం సెంచరీలపై సెంచరీలు సాధించగలిగే టాలెంట్ విరాట్ సొంతం.. మరి ఇప్పుడు కోహ్లిలో పస తగ్గిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి..

వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 శతకాలతో మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 70 శతకాలు సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లి.  శత సంచరీల వీరుడు సచిన్ ను దాటే ఏకైక మొనగాడు విరాట్ మాత్రమే అనుకున్నవారంతా ఇప్పుడు షాక్ కు గురవుతున్నారు. గత 20 ఇరవై ఇన్నింగ్స్ లో ఒక్కటంటే ఒక్క సెంచరీ  కూడా చేయలేకపోయాడు. గతేడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లి చివరిసారి సెంచరీ సాధించాడు. మళ్లీ ఇప్పటివరకూ సెంచరీ చేయలేదు.  న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు..

ఓవరాల్‌గా న్యూజిలాండ్‌ పర్యటలో కోహ్లి దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ పర్యటనలో కేవలం ఒక హాఫ్‌ సెంచరీ మాత్రమే సాధించిన కోహ్లి.. పరుగులు చేయడానికి అపసోపాలు పడుతున్నాడు. కోహ్లి వరుస 20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ లేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా 20 అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే కోహ్లి ఖాతాలో అంతర్జాతీయ సెంచరీ లేకపోవడం ఇది మూడోసారి. గతంలో 2011 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ వరకూ 24 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి సెంచరీ సాధించకపోగా, 2014 ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ వరకూ 25 వరుస ఇన్నింగ్స్‌ల్లో శతకం నమోదు చేయలేకపోయాడు.  2011లో వరుస 24 ఇన్నింగ్స్‌ల్లో 4 అర్థ శతకాలకే పరిమితమైన కోహ్లి.. 2014లో 25 వరుస ఇన్నింగ్స్‌ల్లో ఆరు హాఫ్‌ సెంచరీలు మాత్రమే చేశాడు. ఇప్పుడు కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతోంది. 2019లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసే సమయానికి చూస్తే ప్రతీ ఆరు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లి  శతకం సాధించాడు. ఇప్పుడు వరుసగా 20 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ కూడా లేకపోవడం నిజంగానే షాక్..

                                   ఎలాంటి క్లిష్ట  పరిస్థితుల్లో అయినా పరుగుల వరద పారించగలిగే సత్తా ఉన్న కోహ్లీ ఇలా ఫెయిలవ్వడంతో ఆ భారం భారత్ పై పడుతోంది. దీంతో భారత జట్టుకు వరుస ఓటములు తప్పడం లేదు. కివీస్ పర్యటన ముందు వరకు టెస్టు ఛాంపియన్ షిప్ లో జైత్రయాత్ర కొనసాగించిన భారత్.. ఇప్పుడు ఒక్క గెలుపు కోసం ఆపసోపాలు పడుతోంది. ఈ ఓటములకు బ్రేక్ పడాలంటే కచ్చితంగా కోహ్లీ బ్యాట్ కి పని చెప్పాల్సిందే.. సో ఆల్ ది బెస్ట్ కోహ్లీ..

Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..