WHY THIS KOLAVERI.. KOHLI?
                                      వై దిస్ కొలవరి కోహ్లీ..?                                        3.. 19.. 2.. 15 ఇవి విరాట్ కోహ్లీ గత నాలుగు ఇన్నింగ్స్ లో చేసిన పరుగులు.. అసలు కింగ్ కోహ్లీకి ఏమైంది..? కివీస్ గడ్డపై అడుగు పెట్టాక కాన్ఫిడెన్స్ కోల్పోయాడా..? క్రీజ్ లో కాసేపు నిలవాలన్న సంగతి మరిచిపోయాడా..? ఎంత దిగ్గజ క్రికెటర్ కి అయినా.. కెరీర్ లో డౌన్  ఫాల్ ఉంటుంది..  అప్ అండ్ డౌన్స్ కామన్.. అయితే ఒక ఇన్నింగ్స్ లో  కాకపోయినా.. మరో ఇన్నింగ్స్ లో అయినా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ గత 20 ఇన్నింగ్స్ లో కోహ్లీ ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు..                                 కోహ్లీ అంటే ఒక పరుగుల యంత్రం.. కివీస్ పర్యటనకు ముందు వరకు కోహ్లీ అంటే ఇదే.. సిరీస్ ఏదైనా.. ఫార్మాట్ ఇంకేదానై.. వేదిక ఎక్కడైనా..? క్రీజ్ లో అడుగు పెట్ట...