Happy Days

                               

                  హ్యాపీ... .ఇంకా ఉంది..       




                   ఎలా మొదలు పెట్టాలో.. ఎక్కడ మొదలు పెట్టాలో  తెలియడం లేదు.. మళ్లీ ఎదురు చూపులు మొదలయ్యాయి.. కొన్ని నెలల ఎదురు చూపులకు.. మరి కొన్ని గంటల్లో సమాధానం దక్కనుంది..    

                    నా ఎదురు చూపులు దేనికోసం అనేది అందరికి తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పాల్సింది , ఏం లేదు కానీ....


                    ఏడాది కిందటి వరకు మళ్లి ఇలా ఎదురు చూపులు చూస్తాను అనుకోలేదు.. చాలా మంది స్నేహితులు సన్నిహితులు.. ఒక్క బాబేనా.. వాడికి తోడుండాలి.. మీరు ఇద్దరు.. మీకు ఇద్దరూ.. అదే కరెక్టు అంటూ సలహాలు ఇస్తూ వచ్చారు.. బేసిక్ గా.. సలహాలు వింటాను కానీ.. చివరిగా నామనసు ఏది చెబితే అదే ఫాలో అవుతాను తప్పైనా.. ఒప్పైనా..


                          సో ఒక్కడే ముద్దు అనే ఫార్ములాకి ఫిక్స్ అయ్యాను.. అందులోను ఈ రోజుల్లో ఇద్దరిని పెంచడం అంటే మాటలు కాదు.. ఫిజికల్ గా.. ఫైనాన్సియల్ గా.. ఎలా అలోచించినా.. అమ్మో ఇద్దరా అని.. ఆశ్రిత్ చాలు .. సుమ కూడా సేమ్ ఫీలవ్వడంతో.. ఒక్కరే ముద్దు అంటూ.. ఐదేళ్లు ఆశ్రిత్ తో  ఆనందంగా గడిపేసాం..




                           కానీ ఓ పది  నెలల కిందట బైక్ పై వెళ్తున్నప్పుడు ఆశ్రిత్ ఒక ప్రశ్న అడిగాడు..

నాన్న నాకు చెల్లి ఉంటే హ్యాపీ  కదా అన్నాడు.. ఎందుకురా అంటే.. ఒక్కడినే ఉన్నా కదా అన్నాడు.. నువ్వు ఒక్కడివే కాదు.. నీకు కార్తీక, కౌమది, సింధు, రోహిణి, శ్రావణి అక్కలు.. రఘు అన్నయ్య  ఉన్నారు నవ్వు ఒక్కడివే కాదు అన్నాను.. అవును అక్కలంతా నాకు ఇష్టం.. కానీ రోజు నాతో ఆడుకోడానికి.. ఒక చెల్లి ఉండాలి కదా.. రోజు నాతో పాటు స్కూల్ కి రావాలి కదా.. నేను చెయ్య  పట్టుకొని స్కూలుకి తీసుకెళ్లాలి కదా అన్నాడు.. సో ఆ పసి మనసుకి అర్థమైంది.. ఒక్కరు కాదు ఇద్దరు ఉండాలి అని.. వాడికి ఎందుకు అలా అనిపించిందో తెలీదు కానీ..  ఆ కొన్ని రోజులకే మాకు గుడ్ న్యూస్ తెలిసింది..

                                  ఆ రోజు నుంచి ఆశ్రిత్.. నేను ఎదురు చూస్తూనే ఉన్నాం.. చెల్లి పుడుతుందా.. తమ్ము డు పుడతాడా అని..  ఆ ఎదురు చూపులకు.. మరి కొన్ని గంటల్లో  సమాధానం దొరుకుతుంది.. తమ్ముడైనా.. చల్లైనా.. ఆడుకోడానికి ఒకే అన్నాడు ఆశ్రిత్..


                                      ఆశ్రిత్ పుట్టాడు ఆనందం తెచ్చాడు.. ఇప్పుడు వచ్చే బేబి ఆనందం అదృష్టం రెండూ తెస్తోంది.. అసలు ఆశ్రిత్ వచ్చాక అదృష్టం కలిసి వచ్చింది..  ఆ ఆనందం... అదృష్టం ఇకస రెట్టింపు అవ్వాలని కోరుకుంటున్నాం..  అందుకే ఇకపై ఆశ్రిత్ నిక్ నేమ్  హ్యాపి .. పుట్టబోయే బేబి నిక్ నేమ్.. బారసాల అయ్యాక చెబుతాను..

Comments

Post a Comment

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

వాట్ ఏ సూపర్ ఓవర్..