అనగనగా ఒక రోజు..

                                     
                                                   మరిచిపోలేని మదుర జ్ఞాపకం




                                                 ఆనందం ఆనందం.. చెప్పలేనంత ఆనందం.. చూపించలేనంత ఆనందం.. రాయడానికి పదాలు కనిపించనంత ఆనందం..చెప్పడానికి మాటలు కూడా అందనంత ఆనందం.. ఏమని చెప్పాలి..  ఎంతని చెప్పాలి.. నా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఒకరోజంతా చాలదేమో.. ఎందుకు అంత ఆనాందం అంటారా... ఆ ఆనందాన్ని ఇచ్చింది ఈ ఫోటోనే..  

                                             ఒకటి.. రెండు.. మూడు కాదు.. సరిగ్గా 25 ఏళ్లు.. అవును మీరు విన్నది నిజమే.. చిన్ననాటి నా మిత్రులను సరిగ్గా 25 ఏళ్ల తరువాత తొలిసారి కలిసిన ఆ రోజును నేను ఎప్పటికీ మరిచపోలేను. ఎందుకు అంత స్పెషల్‌ అంటారా.. అయితే పూర్తిగా చదవండి.. 


                                           విజయనగరం జిల్లా.. మెంటాడమండలం.. జక్కువ అనే గ్రామంలో పుట్టిన నేను.. హైస్కూల్‌ విద్య అంతా..చల్లపేట స్కూల్‌లోనే సాగింది.. ప్రభుత్వ పాఠశాల అంటే ఎవో పాడైన  పై కప్పులు.. వెలుతురు లేని గదులు.. బెంచీలు లేని క్లాస్‌ రూమ్‌లు కాదు.. నిజంగా ఇప్పటి కార్పొరేట్‌ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని స్కూల్‌ అది. చల్లపేట హైస్కూల్‌.. ఇప్పటికీ చాలా పెద్ద పెద్ద స్కూళ్లకు కూడా అందుబాటులో లేనంత విశాలమైన మైదానం.. చుట్టూ పచ్చని చెట్లు.. తాగేందుకు మంచినీటి సదుపాయం.. సూర్యుడి నేరుగా వెలుగులు నింపే.. సన్‌రైజ్‌ స్కూల్‌ మాది... స్కూలు వాతావరణమే కాదు.. టీచర్లు గురించి ఇంకా ఎత చెప్పినా తక్కువే.. ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎందో హెడ్‌మాస్టర్లు.. మాస్టర్లు అందరూ దైవ సమానులే.. నిజంగా అందరూ గురుబ్రహ్మలే.. పక్షపాతం అంటే ఎంటో తెలీదు.. అందరినీ ఒకేలా చూశేవారు.. మార్కులు తక్కువ వచ్చిన వాళ్లను పట్టించుకోకపోవడం.. మంచి మార్కులు వచ్చిన వారిని నెత్తిన పెట్టుకోవడం అనే మాటే లేదు. ఇక డబ్బు ఉన్న వాళ్లు.. పేదవాళ్లు అనే తేడా లేదు.. క్లాస్‌టీచర్లే కాదు.. డ్రాయింగ్‌, డ్రిల్‌ మాస్టార్లు సైతం మంచివారే దొరకడం మా అదృష్టం..


                                     ఇక నా క్లాస్‌మేట్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మేమంతా ఒక్కఊరి వాళ్లం కూడా కాదు.. దాదాపు చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల నుంచి వచ్చిన 62 మంది స్టూడెంట్స్‌.. సొంత అన్నదమ్ముల్లా కలిసిపోయే వాళ్లం.. నాకు తెలిసి మా మధ్య ఎప్పుడు ఏ విషయంలో చిన్న గొడవ కూడా రాలేదు. బెస్ట్‌ ఫ్రెండ్స్ అన్నదానికి అప్పుడు అర్థం తెలియికపోవచ్చు కాని.. అంతకంటే ఎక్కువగానే కలిసి మెలిసి ఉన్నాం.. చదువులోనే కాదు.. అన్ని విషయాల్లోనూ.. అందరి మధ్య స్నేహపూర్వపోటీ ఉండేది.. ఇక మా క్లాస్‌ అమ్మాయిల విషయానికి వస్తే.. నిజంగా అందరూ మహాలక్ష్మిలే.. చిన్నప్పుడు చూసిని వారి రూపాలు ఇప్పటికీ.. ఎప్పటికీ మాకు గుర్తుకు వస్తూనే ఉంటాయి..  

                                       ఆటలు.. పాటలు.. అల్లర్లు.. ఒకటేంటి.. స్కూల్‌ రోజుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన రోజులు ఏవంటే.. ఏమాత్రం ఆలోచించకుండా చెప్పేవి హైస్కూల్‌ డేస్‌ మాత్రమే.. కానీ 10వ తరగతితోనే అన్నీ బంద్‌ అయ్యాయి. ఆ ఆనందం ఐదేళ్లు మాత్రమే.. తరువాత ఎవరు ఎక్కడున్నారో తెలీదు.. ఎలా ఉన్నారో తెలీదు.. ఇక మళ్లీ వాళ్లను కలుస్తామో లేదో తెలీదు.. కానీ మా ఫ్రెండ్స్‌షిప్‌కు ఉన్న బలం.. దేవుడి ఆశీస్సులతో అందరం మళ్లీ కలవగలిగాం.. అది ఒకటి రెండు ఏళ్ల తరువాత కాదు.. సరిగ్గా 25 ఏళ్ల తరువాత మళ్లీ నా చిన్న నాటి స్నేహితులను అందరినీ కలవగలిగాను.. వారితో నా జ్ఞాపకాలను నెమరవేసుకోగలిగాను. అలా నా చిన్ననాటి స్నేహితులను 25 ఏళ్ల తరువాత కలిపిన మే 13.. ఎప్పటికీ మరిచిపోలేని మదుర జ్ఞపకమే.. 


Comments

Post a Comment

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..