మెక్ మిషన్
మెక్ సునామీ
****************** కొడితే సిక్స్ ******************
****************** బాధితే బౌండరీ ******************
ఆఫ్ సైడ్
ఆన్ సైడ్ అనే తేడానే లేదు.. స్క్వేర్ కట్.. స్వీప్ షాట్.. ఏదైనా ఒకటే.. ప్రతి
బంతినీ బౌండరీ దాటించడమే లక్ష్యం అన్నట్టు ఆడాడు.. కివీస్ కండల
వీరుడు మెక్ కల్లమ్. పరుగుల సునామీ సృష్టించేశాడు..
***********6 సిక్సర్లు ************************
********** 21 ఫోర్లు *************************
*************54 బంతుల్లో సెంచరీ ************
****************** 79 బంతుల్లో 145 రన్స్*************
బాదుడికి ఇంతకన్నా స్టాటస్టిక్స్ ఏం కావాలి.. ఆడుతున్నది టెస్ట్ అని మరచిపోయాడో.. ఇక క్రికెట్‌కు
బై బై చెప్పేస్తున్నాడన్న కసో.. కారణం ఏదైనా.. కంగారులను కుమ్మేశాడు. ప్రతి బౌలర్‌ను ఏడిపించాడు..
బాల్ పడడమే పాపం అన్నట్టు దాదాపు ప్రతి బంతినీ బౌండరీ దాటించేశాడు..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో..
32 పరుగులకే 3 వికెట్లు పడిపోయి న్యూజిలాండ్ జట్టు
పీకల్లోతు కష్టాల్లో ఉన్నట్టు కనిపించింది. ఓ వైపు పచ్చికతో పిచ్
భయపెడుతోంది. మరోవైపు పేస్, స్వింగ్‌తో
ఆసీస్ బౌలర్లు రెచ్చిపోతున్నారు. ఇక కివీస్ పని ఔట్ అనుకుంటున్న
సమయంలో.. విధ్వంస కారుడు మెక్ కలమ్.. చెలరేగిపోయాడు.. టెస్టు మ్యాచ్‌ను కాస్త టీ 20గా మార్చేశాడు.. మొదట 54 పరుగులకే
సెంచరీతో రికార్డు సృష్టించిన మెక్... తరుబవాత అదే దూకుడు కంటిన్యూ
చేస్తూ.. రఫ్ ఆడించాడు.. 79 బంతుల్లో 21
ఫోర్లు, 6 సిక్సర్లతో 145 రన్స్ చేసి విద్వంసం సృష్టించేశాడు.. గతంలో వివ్ రిచర్డ్స్
పేరిట ఉన్న 56 బంతుల్లో సెంచరీ రికార్డును మెక్‌కల్లమ్ బ్రేక్
చేశాడు..
ప్రతీ బంతిని ఫోర్ లేదా సిక్స్ కొట్టాలనే ప్రయత్నించాను అని ఇన్నింగ్స్ తరువాత
చెప్పాడు మెక్‌కల్లమ్. తాను ఎంతో అభిమానించే రిచర్డ్‌ను అధిగమించడం
కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది అని విచారించాడు
మెక్..
పోతూ పోతూ కూడా క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు విధ్వంస వీరుడు. చాలా మందిలా చివరి మ్యాచ్‌లో ఆటకంటే భావోద్వేగాలకే ప్రాధాన్యం ఇవ్వలేదు.
తాను సైలెంట్ రాకెట్‌ను కాదని.. ఆరుడుగుల బుల్లెట్..
ధైర్యం నింపిన రాకెట్ అని నిరూపించుకున్నాడు. అందుకే అలా ఇలా కాదు వీరబాదుడు బాదాడు. బ్యాటింగ్ కల్లోలంతో
తన పేరిట కొత్త చరిత్రను లిఖించుకున్నాడు.
Comments
Post a Comment