టీమిండియా తీన్‌ మార్‌ ఆడుతుందా?



నెగ్గేదెవరు?




                                                   ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆసక్తికర పోరాటలతో రసవత్తరంగా సాగిన వరల్డ్‌ లీగ్‌ దశ ముగిసింది. టోర్నీలో మొత్తం 14 జట్లు బరిలో దిగితే.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఎనిమిది జట్లూ నాకౌట్‌ పోరుకు అర్హత సాధించాయి. ఇక డూ ఆర్‌ డై తేల్చుకునేందుకు సై అంటై సై అంటున్నాయి.. ప్రస్తుతం ఎనిమిది జట్లు బరిలో ఉన్నా కేవలం  ఐదు జట్లనే అసలైన ఫేవరెట్లుగా అభిమానులు అంచనా వేస్తున్నారు. టీమిండియా మూడో సారి కప్‌ నెగ్గి తీన్‌ మార్‌ ఆడుతుందని.. ఆసీస్‌ ఐదో వరల్డ్‌ కప్‌ నెగ్గి పంచ్‌ పవర్‌ రుచి చూపిస్తుందని.. మరో ఆతిథ్య కివీస్‌ తొలి వరల్డ్‌ కప్‌ను ముద్దాడుతుందని.. సంగక్కర సూపర్‌ ఫాం లంకకు కప్‌ అందిస్తుందని.. సఫారీ టీం లక్‌ ఈ సారైనా మారొచ్చని.. ఇలా అంతా ఎవరికి నచ్చినట్టు వారు లెక్కేసుకుంటున్నారు. అయితే మిగిలిన వాటిలో బంగ్లాదేశ్‌ మినహా.. పాక్‌, విండీస్‌ నుకూడా తక్కువ అంచనా వేయలేం..
                 బ్రేక్‌ లేని మ్యాచ్‌లతో ప్లేయర్లు.. అభిమానులు అంతా అలసి పోయారు. అందుకే నాకౌట్‌కు ముందు రెండు రోజులు అందరికీ విరామం దొరికింది. మళ్లీ 18వ తేదీ నుంచి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు మొదలవనున్నాయి.. లీగ్‌ దశలో ఆయా జట్ల ప్రదర్శన చూస్తే.. భారత్‌, న్యూజిలాండ్‌లు సూపర్‌ ఫాం కనబర్చాయి. లీగ్‌ దశలో  డిఫెండింగ్ చాంపియన్ భారత్, ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌లు ఒక్కటంటే ఒక్క ఓటమి లేకుండా లీగ్‌ను ముగించాయి. దీంతో గ్రూపు లో కివీస్‌, గ్రూప్‌ బిలో భారత్‌ నెంబర్‌ వన్‌ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. గతంతో పోల్చుకుంటే తొలిసారి వరల్డ్‌ కప్‌లో నాకౌట్‌కు నాలుగు ఉపఖండ జట్లు అర్హత సాధించాయి. భారత్‌తో పాటు శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ కూడా టాప్‌ ఎయిట్‌లో నిలవడం విశేషం..
            లీగ్‌ దశలో ఆడిన జట్లు.. క్వార్టర్‌ ఫైనల్లో మళ్లీ తలపడే అవకాశం లేదు. ఆయా జట్ల పాయింట్ల ప్రకారం..  ఈ నెల 18న సిడ్నీలో జరిగే తొలి క్వార్టర్‌ ఫైనల్లో గ్రూప్‌ ఏలో మూడో ప్లేస్‌లో ఉన్న శ్రీలంక- గ్రూప్‌ బిలో రెండో ప్లేస్‌లో ఉన్న దక్షిణాఫ్రికా డూ ఆర్‌ డై తేల్చుకోనున్నాయి.
           19వ తేదీన మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే రెండో క్వార్టర్‌ ఫైనల్లో ఉపఖండపు జట్లు భారత్‌-బంగ్లాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గ్రూప్‌ బిలో టాపర్‌గా ఉన్న భారత్‌.. గ్రూప్‌ ఏలో నాలుగో ప్లేస్‌లో ఉన్న బంగ్లాతో తలపడనుంది.. 
            20వ తేదీన ఆడిలైడ్‌లో జరిగే మూడో క్వార్టర్‌ ఫైనల్లో గ్రూప్‌ ఏలో రెండో స్థానంలో ఉన్న ఆసీస్‌, గ్రూప్‌ బిలో మూడో స్థానంలో ఉన్న పాకిస్థాన్‌లు చావో రేవో తేల్చుకోనున్నాయి..
         21  విల్లింగ్టన్‌లో జరిగే ఆఖరి క్వార్టర్‌ ఫైనల్లో గ్రూప్‌ ఏ టాపర్‌ న్యూజిలాండ్‌తో గ్రూప్‌ బిలో నాలుగో స్థానంలో నిలిచిన విండీస్‌ తలపడనుంది.. 
          24న జరిగే  తొలి  సెమీ ఫైనల్లో భారత్‌-బంగ్లా, ఆసీస్‌-పాక్‌ మ్యాచ్‌ల విజేతలు పోటీ పడనున్నాయి. 26న జరిగే రెండో సెమీస్‌లో శ్రీలంక-దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ల విజేతలు పోటీ పడనున్నాయి. మార్చి 29న మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ వార్‌ జరగనుంది.

Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..