బిగ్ ఫైట్
హ్యూస్ కు అంకితం
గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే
బంతులు... టపటపా రాలే వికెట్లు.. బంతిని కొట్టలేక తలవంచే బ్యాట్స్మెన్లు... బాడీనే లక్ష్యంగా చేసుకొనే బౌన్సర్లు.. మైదానం బయటా
లోపలా మాటల తూటాలు... ఆసీస్ గడ్డపై
భారత్ టెస్టు సిరీస్ అంటే సాధరణంగా
కనిపించే దృష్యాలు ఇవే. వీటన్నంటికీ తోడు సిరీస్ ఆరంభానికి ముందే మొదలయ్యే మాటల యుద్ధం. కానీ ఈ సారి
పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. బౌన్సర్
కారణంగా హ్యూస్ మరణంతో సిరీస్లో కాస్త వేడి తగ్గినట్టు కనిపిస్తోంది..
సాధరంగా మైండ్గేమ్తోనే
ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే ఆసీస్ జట్టు ఈ సారి సహచర
ఆటగాడి మృతితో కాస్త ఒత్తిడిలో ఉంది. ఇది ఆటపై ఎంత వరకు
ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. ముఖ్యంగా బౌన్సర్లు
వేయడంలో దిట్టలైన ఆసీస్ పేసర్లు ఈ సారి జోరు తగ్గిస్తారో..
లేక ఆన వాయితీని కొనసాగిస్తారా అన్నది ఆడిలైడ్లో తేలిపోనుంది...
అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి తొలి టెస్టు ఫలితం వచ్చేసి ఉండేది.
కానీ హ్యూస్ మృతితో సిరీస్ లేటుగా ఆరంభం అవుతోంది. 9 నుంచి 13 వరకు ఆడిలైడ్లో తొలి టెస్టు, బ్రిస్బేన్లో 17 నుంచి 21 వరకు రెండు,
మెల్బోర్న్లో
26 నుంచి 30 వరకు మూడు, సిడ్నీలో
6 నుంచి 10 వరకు ఆఖరి టెస్టు జరగనుంది...
సీనియర్లు లేకుండా తొలిసారి ఆసీస్ గడ్డపై
అడుగుపెట్టిన యంగ్ ఇండియాకు ఇది బిగ్ సవాల్. మరోవైపు ఆడిలైడ్లో
జరుగుతున్న తొలి టెస్టుకు గాయం కారణంగా కెప్టెన్ ధోనీ
దూరమయ్యాడు. దీంతో ముందు ఊహించినట్టే కోహ్లీ సారథ్యంలో
భారత జట్టు తొలి పోరుకు సై అంటోంది. గత పర్యటలో 4-0తో వైట్‌వాష్ చేయించుకొన్న
టీమిండియా ప్రతీకారం కోసం ఆరాటపడుతోంది. కానీ అది నెరవేరడం
అంత సాధ్యం కాదు. ప్రస్తుతం ఆసీస్ పర్యటలో
ఉన్న వారిలో ధోనీ, కోహ్లీ, అశ్విన్,
ఉమేష్, ఇషాంత్లకు తప్ప
ఆసీస్ గడ్డపై టెస్టులు ఆడిన అనుభవం ఎవరికీ లేదు. అయినా సిరీస్ నెగ్గితే అద్భుతం జరిగినట్టే.
ఆడిలైడ్లో పిచ్ కండిషన్...
భారత ఆటగాళ్ల ప్రదర్శన లెక్క చూసుకుంటే... కోహ్లీ
(కెప్టెన్) మురళీ విజయ్, శిఖర్ ధావన్, చటేశ్వర్
పుజారా, రహానె, రోహిత్ శర్మ,
వృద్ధిమాన్ సాహా, అశ్విన్
లేదా జడేజా, వరుణ్ అరోన్,
ఇషాంత్ శర్మ, మహ్మద్
షమీలు తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. ధోనీ
దూరం కావడంతో వృద్ధిమాన్ సాహా కీపర్గా
ఆడడం ఖాయం. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అరోన్ అదుర్స్ అనిపించడంతో
భువనేశ్వర్కు రెస్టు తప్పకపోవచ్చు. నలుగురు
పేసర్లతో బరిలో దిగాలి అనుకుంటే ఒక బ్యాట్స్మెన్ను తప్పించి
భువీకి ఛాన్స్ వస్తుంది...
ఇక ఆసీస్ జట్టు విషయానికి వస్తే కెప్టెన్ క్లార్క్, క్రిస్ రోజర్స్,
డేవిడ్ వార్నర్, షేన్
వాట్సన్, స్టీవెన్ స్మిత్,
మిచెల్ మార్షల్, బ్రాడ్
హడిన్, మిచెల్ జాన్సన్,
రైన్ హరీస్, పీటర్
సిడెల్, నాథన్ లైన్లు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. తొలి మ్యాచ్కు వేదికగా నిలుస్తున్న ఆడిలైడ్ పిచ్ తొలి సెషన్లో బంతి పూర్తిగా బౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తరువాత మూడు
సెషన్లలో బ్యాట్స్మెన్కు
అనూకూలించొచ్చు...
Comments
Post a Comment