సూపర్ షటిల్
షటిల్ సంచలనం
భారత షటిల్ చరిత్రలో
పెను సంచలనం నమోదైంది. బ్యాడ్మింటన్ రారాజుగా దూకుడు చూపిస్తున్న చైనా గడ్డపై ఇద్దరు హైదరాబాదీలు
ఒకే సూపర్ సిరీస్‌లో రెండు టైటిళ్లు నెగ్గి చరిత్ర సృష్టించారు. మహిళల సింగిల్స్లో
సైనా నెహ్వాల్, మెన్ సింగిల్స్లో శ్రీకాంత్ సూపర్ సిరీస్‌లు సాధించి చైనా కొమ్ములు విరిచారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో ఎందరో దిగ్గజాలు వచ్చి వెళ్లినా అందులో లిన్ డాన్ది ప్రత్యేక స్థానం. ఒలింపిక్స్లో అడుగు
పెట్టిన రెండు సార్లు గోల్డ్‌మెడల్స్ సాధించాడు. ఇప్పటి
వరకు అతడు సాధించని టైటిల్ లేదు. సొంతం చేసుకోని సిరీస్ లేదు. ప్రపంచ బ్యాడ్మింటన్లో
ఉన్న తొమ్మిది సూపర్ సిరీస్‌లను నెగ్గిన ఏకైవక వీరుడు డాన్. ఓవరాల్గా 56 మేజర్ టైటిళ్లతో సూపర్ డాన్ అనిపించుకున్నాడు. అతడు
బరిలో ఉంటే ప్రత్యర్థులు ముందుగానే మ్యాచ్పై
ఆశలు వదులు కుంటారు. అలాంటి చైనా దిగ్గజం లిన్ డాన్ను ఎలాంటి అంచనాలు లేని శ్రీకాంత్ ఓడించి సంచలనం సృష్టించాడు.
భారత్ తరపున పురుషుల విభాగంలో ప్రకాశ్ పదుకొనే 1980లో, 2001లో
గోపీచంద్లు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ విజేతలుగా నిలిచారు. వీరిద్దరి తరువాత ఓ సూపర్ సిరీస్‌లో 13 ఏళ్ల తరువాత ఫైనల్కు చేరిన తొలి భారత షట్లర్గా
రికార్డుల్లో నిలిచిన శ్రీకాంత్ 24 గంటలకు
తిరగక ముందే మరో ఘన సాధించాడు. చైనా దిగ్గజ ఆటగాడు లిన్డాన్ను వరస సెట్లలో మట్టి కరిపించాడు. ప్రపంచ 16వ ర్యాంక్లో ఉన్న శ్రీకాంత్
21-19, 21-17తో డాన్ను
ఓడించి తొలి సూపర్ సిరీస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇటీవల వరస వైఫల్యాలతో ఇటీవల కోచ్ను మార్చిన సైనా ఎట్టకేలకు సక్సెస్ బాట పట్టింది. చైనా ఓపెన్ సిరీస్ ఫైనల్లో 21-12, 22-20 తేడాతో జపాన్ క్రీడాకారిణి
అకానె యమాగూచిన ఓడించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఇప్పటి
వరకు ఆరు సార్లు చైనా ఓపెన్లో పాల్గొన్న సైనాకు ఇదే తొలి
టైటిల్ కావడం విశేషం.
Comments
Post a Comment