నా లైఫ్‌లో ఓ రోజు
నా లైఫ్‌లో
ఓ రోజు
లైఫ్ అంటే బ్యూటీఫుల్…
లైఫ్ అంటే వెరీ శాడ్…
లైఫ్ అంటే పరమ బోరింగ్…
లైఫ్ అంటే కలర్‌ఫుల్…
లైఫ్ అంటే కష్టాలు నష్టాలు…
లైఫ్ అంటే సుఖం.. సంతోషం…
చాలా మంది నోటంట వినిపించే మాటలు ఇవి…
జీవితం మీద ఎవరి ఒపీనియన్ ఎలా ఉన్నా… నా వరకు లైప్ అంటే ఉగాది పచ్చడి..
కష్టం.. సుఖం… దుఖం… సంతోషం అన్నింటి కలయికే… ఇందులో ఏదీ లేకపోయినా.. లైఫ్‌ను పూర్తిగా
ఎంజాయ్ చేయలేం… నాకు తెలిసి చిన్నదొ… పెద్దదో బాధలు లేని జీవితం ఎవరికీ ఉండదేమో?
అలా ఎవరైనా ఉన్నా ఉంటే చాలా సంతోషం…
నా లైఫ్‌లో పెద్దగా కష్టాలు ఏం లేకపోయినా… ఎవో రొటీన్ కష్టాలు కామన్.. పని ఎక్కువైంది… నిద్ర సరిపోలేదు… కావాల్సినప్పుడు నో లీవ్… నెలఖరు అయ్యే సరికి బ్యాంక్ బ్యాలెన్స్
నిల్... ఏం చేసినా ఈ పొట్ట తగ్గడం లేదురా బాబు… పర్సనల్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేయలేకపోతున్నా… ఇలాంటివి తప్ప
పెద్దగా కష్టాలు లేవనే చెప్పాలి?.
అయితే అలాంటి చిన్న చిన్న కష్టాలన్ని మరిచిపోయేలా చేసింది ఓ రోజు…
నేను ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను…
నా జీవితంలో మరచిపోలేని రోజు ఇది…
ఇలా ప్రతి ఒక్కరికీ ఎదో ఒకరోజు మరచిపోని
తీపి గుర్తుగా ఉంటుంది… అలాంటి రోజు నా లైఫ్‌లోనూ ఉంది.. వెరీ వెరీ స్పెషల్ డే… నా జీవితంలో చాలా స్వీట్ మెమొరీస్
ఉన్నా… అన్నింటికీ మించి సంతోషాన్ని ఇచ్చింది
మాత్రం ఒకే ఒక్క రోజు….
Comments
Post a Comment