అనగనగా.. ఒక విషయం చెప్పాలి... అనగనగా.. ఏంటి ఏదో కధ చెబుతున్నానని భయపడకండి.. ఎందుకంటే చిన్నప్పుడు మనం కధలు విన్నప్పుడు.. అనగనగాతోనే మొదలయ్యేది. ఇప్పుడు మన పిల్లలకు మనం చెప్పాలన్నా అనగనగా అనే ప్రారంభించాలి.. కానీ నేను అలాంటి కధ ఏదీ చెప్పాలి అనుకో్వడం లేదు. నా జీవితంలోకి వచ్చిన నా అదృష్ట దేవతను పరిచయం చేయాలి అని ఆరాటం.. ఇప్పటి వరకు నా జీవితం అంటే నన్ను అమితంగా ప్రేమించే నా భార్య సుమ.. తరువాత నా సంతోషం.. నా ఆనందం.. నా లోకం.. అన్నీ తానైన నా కొడుకు ఆశ్రిత్.. ఆ ప్రేమ.. ఆ ఆనందానికి ఇప్పుడు అదృష్టం తోడైంది. అదే నా చిన్నారి చిట్టి తల్లి. ...
మీ ఫేరెట్ ఎవరు? మీరు క్రీడాభిమానులా? సైనా... సానియా... జ్వాలా లాంటి స్టార్ ప్లేయర్లను మీరు అమితంగా ఇష్టపడతరా? లేక ఇంకెవరైనా ఫేవరెట్ ఉన్నారా? ఆటను ఆరాధిస్తారా? అందాన్ని ప్రేమిస్తారా? భారత్లో టాప్ టెన్ మహిళా అథ్లెట్లను ఎంచుకోమంటే ఎవరికి ఓటేస్తారు? సాధరణంగా భారత్లో పురుషులకు ఉన్న గుర్తింపు మహిళకు ఉండదు . ముఖ్యంగా క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నా … పురుషులకు ఉన్నంత ఆదరన ఉండదు. ఐతే అవేవి లెక్క చేయకుండా మగవారిని దాటి క్రేజ్ సంపాందించిన ఉమెన్ అథ్లెట్స్ ఉన్నారు . పురుషుల కంటే ఎక్కువ ఫోకస్ తమపై ఉండేలా చేసుకున్నారు . కానీ ఇలాంటి వారి సంఖ్య పదిలోపే ఉండడం విచారకరం .. మరి అలాంటి మహిళా మహారానుల్లో మీ టాప్ టెన్ ఎవరు ?.. సెలెక్ట్ చేసుకోండి … సైనా నెహ్వాల్ భారత క్రీడా అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు సైనా నెహ్వాల్ . 2008 బీజింగ్ ఒలింపిక్స్లో బ్రాంజ్మెడల్తో చరిత్ర సృష్టించింది . బ్రాండ్ వాల్యూ అమాంతం పెంచుకుంది . ...
ఫైనల్ ఫైట్ ప్రియమైన ప్రత్యర్థితో.... ఇండియా లక్ష్య చేధనలో ఉన్నప్పుడు... విరాట్ సూపర్ ఫాంలో ఉన్నప్పుడు.. అది ఒక మెగా టోర్నీ అయినప్పుడు... అందులోనూ అది సెమీ ఫైనల్ మ్యాచ్ అయ్యి... దక్షిణాఫ్రికా ప్రత్యర్థి అయినప్పుడు ఏం జరుగుతుంది?... సగటు క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ ఫలితాన్ని ఎప్పుడో ఊహించి ఉంటాడు. సరిగ్గా ఆ ఊహ నిజమే అయ్యింది. ఎలాంటి సంచలనాలు లేవు.. భారత అభిమానులకు టెన్షనూ లేదు.. బంగ్లాగడ్డపై మెన్ ఇన్ బ్లూ ఆడుతూ పాడుతూ ప్రొటీస్ టీంను మట్టికరపించేసింది. ఫైనల్లో అడుగుపెట్టింది. ఇష్టమైన ప్రత్యర్థి శ్రీలంకతో టైటిల్ వార్ కు రెడీ అయిపోయింది... ఇక సూపర్ సండే ఏం జరుగుతుందో చూడాలి... భారత్-లంక మధ్య మేజర్ టోర్నీలో ఫైనల్ ఫైట్ అంటే... అందరికీ 2011 వరల్డ్ కప్ గుర్తుకు రావడం వెరీ కామన్.. మరి రిజల్ట్ కూడా రిపీట్ అయితే... ఒక ఇండియన్ కు అంతకన్నా కావలసింది ఏ ముంటుంది. అందులోనూ ఇప్పుడు ధోనీ సేన సూపర్ ఫాంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో అదుర్స్ అనిపిస్తోంది. 2011 వరల్డ్ కప్ కు ముందు కూడా ఇదే సీన్. టోర్నీ ఆరంభానికి ముందు భారత్ తీవ్ర ఒత్తిడిలో ఉండేది. అసలు టీమిండియా ఫేవరెట్...
జాబిలి జస్ట్ మిస్ జాబిలి .. అందినట్టే అంది జస్ట్ మిస్ అయ్యింది. సక్సెస్ అయిపోతోంది అనుకుంటున్న సమయంలో సిగ్నల్ నిలిచిపోయింది. కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్-2 చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. ఊపిరి సలపకుండా ఊరించి చివరికి ఉసూరుమనిపించింది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో దారి తప్పింది. మరికొన్ని క్షణాల్లో చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందకుండా పోయింది. చివరి సందర్భంలో విక్రమ్ ల్యాండర్ కొన్ని క్షణాల పాటు తీవ్ర ఉత్కంఠతకు కారణమైంది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో ల్యాండర్ దారి తప్పింది. సుమారు 12 సెకెన్ల పాటు తన నిర్దేశిత మార్గాన్ని వీడి గతి తప్పింది. సరిగ్గా 12 సెకెన్ల తరువాత విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందాయి. గతి తప్పిన ల్యాండర్.. మళ్లీ తన దారిని తానే వెదుక్కుంటూ వచ్చింది. ల్యాండర్ నుంచి సంకేతాలు అందిన వెంటనే శాస్త్రవేత్తలు ఆనందంలో ముని...
అందమైన జీవితం అందులో ఒక రోజు అక్టోబర్ 2 నా జీవితంలో మరచిపోలేని రోజు.. గాంధీ జయంతి కదా అందరికీ ప్రత్యేకమైన రోజే కావచ్చు.. కానీ నా జీవితంలో చాలా చాలా ముఖ్యమైన రోజు.. నాకు అంటూ ఒక జీవితం ఉందని తెలిసిన రోజు.. నాకోసమే ఒకరు పుట్టారని తెలిసిన రోజు.. నా జీవితం మలుపు తీసుకున్న రోజు. ఇక నా జీవితం ఆనందంగా ఉండబోతోందని అర్థమైన రోజు.. నేనే తన జీవితం అనుకొని.. తన కెరీర్ ని.. అమ్మా నాన్నల్ని..ఇలా అన్నిటిని.. వదిలి.. నాతో పాటు మొదట ఏడు అడుగులు వేసి.. జీవితాంతం నాకు తోడుగా నీడగా ఉండేందుకు ఆమె సిద్ధమైన రోజు.. ఆమె ఎవరో కాదు సుమ.. ఓహో పెళ్లి రోజా అనుకోకండి.. కానే కాదు.. ...
హ్యాపీ... .ఇంకా ఉంది.. ఎలా మొదలు పెట్టాలో.. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు.. మళ్లీ ఎదురు చూపులు మొదలయ్యాయి.. కొన్ని నెలల ఎదురు చూపులకు.. మరి కొన్ని గంటల్లో సమాధానం దక్కనుంది.. నా ఎదురు చూపులు దేనికోసం అనేది అందరికి తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పాల్సింది , ఏం లేదు కానీ.... ఏడాది కిందటి వరకు మళ్లి ఇలా ఎదురు చూపులు చూస్తాను అనుకోలేదు.. చాలా మంది స్నేహితులు సన్నిహితులు.. ఒక్క బాబేనా.. వాడికి తోడుండాలి.. మీరు ఇద్దరు.. మీకు ఇద్దరూ.. అదే కరెక్టు అంటూ సలహాలు ఇస్తూ వచ్చారు.. బేసిక్ గా.. సలహాలు వింటాను కానీ.. చివరిగా నామనసు ఏది చెబితే అదే ...
సరిలేరు మీకెవ్వరు.. గూస్ బంప్స్.. వాట్ ఏ సూపర్ ఓవర్ మ్యాచ్.. అస్సలు ఊహించలేదు.. కివీస్ టార్గెట్ 180 రన్స్.. 19వ ఓవర్ ముగిసే సరికి.. న్యూజిలాండ్ 171 రన్స్ కి 4 వికెట్లు.. అంటే 6 బంతుల్లో కావాల్సింది కేవలం 9 రన్ప్.. అప్పటికే 95 రన్స్ తో భారత్ కు డామేజ్ చేసిన కె `విన్` క్రీజులో ఉన్నాడు.. అయినా సీనియర్ షమికి నమ్మకంతో బంతి ఇచ్చాడు కెప్టెన్ కోహ్లీ. . అప్పటికే క్రీజ్ లో ఉన్న హార్డ్ హిట్టర్ రాస్ టేలర్.. తొలి బంతినే సిక్సర్ బాదేశాడు.. దీంతో 5 బంతులకు 3 రన్స్ కావాలి.. అంతా డిసైడ్ అయ్యారు.. మ్యాచ్ గోవిందా అని.. సరే మ్యాచ్ అయితే పోయింది.. కనీసం కెవిన్ సెంచరీ చేస్తే హ్యాపీ అనుకున్నారు హైదరాబాద్ సన్ రైజర్స్ అభిమానులు.. ఎందుకంటే మన ఐ.పి.ఎల్ టీం కెప్టెన్ కెవిన్ కదా... కానీ పర్సనల్ లైఫ్ లో వైఫ్ వేసిన బౌన్సర్లతో.. ఇబ్బంది పడ్డ షమి.. కివీస్ బ్యాట్స్ మెన్ పై ఆ కసి చూపించాడు.. క్రీజ్ లో పాతుకుపోయిన కెవిన్ ను షార్ట్ పిచ్ బంతి వేసి బోల్తా కొ్ట్టించాడు.. కూల...
Comments
Post a Comment