ఆటోగ్రాఫ్‌తో జర జాగ్రత్త

                           ఆటోగ్రాఫ్‌ ఇస్తున్నారా జర జాగ్రత్త


               ఆటోగ్రాఫ్‌ కేవలం స్వీట్‌ మెమొరీస్‌ కోసం అనుకుంటే కొన్నిసార్లు కష్టాల్లోకి కూడా నెట్టేస్తుంది. అంతెందుకు ఓ ఆటోగ్రాఫ్ కొందరి జీవితాల్నే మార్చేస్తుంది. ఓ అభిమాని అడిగాడని ఎంతో అభిమానపడి ఒక ఆటోగ్రాఫ్‌ ఇస్తే తరువాత చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది. ఈ విషయం చాలా లేటుగా అర్థమైంది దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ హెర్షల్‌ గిబ్స్‌కి.. ఇంతకీ ఏమైందని డౌట్‌ పడుతున్నారా? 

         అయితే  ఈ స్టోరీ చదవాల్సిందే… ఆస్కార్‌ పిస్టోరియస్‌… ఈ పేరే పెను సంచలనం. బ్లేడ్‌ రన్నర్‌గా చరిత్ర సృష్టించిన ఘనత అతడిది. ఒరిజినల్‌గా కాళ్లు లేకపోయినా కృత్రిమ కాళ్లతో ఒలింపిక్స్‌లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో చిరుతలా లంఘించి ఎంతో కీర్తి ప్రతిష్టాలు సంపాదించాడు. కానీ ఏం లాభం. తప్పతాగి తప్పు చేశాడు. ఎంత త్వరగా ఫేమస్‌ అయ్యాడో.. అంత త్వరగా అన్‌ పాపులర్‌ అయ్యాడు. తన గర్ల్ ఫ్రెండ్‌ రీవాను హ్యత చేసి కటకటాల పాలయ్యాడు. ఫాస్టెస్ట్‌ రన్నర్‌ కాస్త హంతకుడయ్యాడు. పిస్టోరియస్‌ అరెస్టయ్యాడు సరే ఈ మర్డర్‌తో గిబ్స్‌కు ఎంటి సంబంధం అనుకుంటున్నారా? ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది…
          పిస్టోరియస్‌-రీవాల మర్డర్‌ మిస్టరీపై ఓ టీవీ ఛానెల్‌ కథనం నడిపించింది. అందులో పిస్టోరియస్‌ బ్యాట్‌తో గర్ల్‌ఫ్రెండ్‌తలపై బాదినట్టు చూపించింది. ఆ విడియోలో పిస్టోరియస్‌ ఆయుధంగా వాడిన బ్యాట్‌ను క్లోజప్‌లో చూపించింది. అయితే ఆ బ్యాట్‌పై హర్షల్‌ గిబ్స్‌ ఆటోగ్రాఫ్‌ ఉంది. దీంతో స్టోరీ సంగతి ఎలా ఉన్నా గిబ్స్‌ కూడా ఫేమస్‌ అయ్యాడు. ఆ స్టోరీని చూసినవాళ్లలో చాలమంది గిబ్స్‌కు మెసేజ్‌లు.. ఫోన్లు కూడా చేస్తున్నారంటా? ఇలా అనుకోని పబ్లిసిటీతో గిబ్స్‌ అవాక్కయ్యాడు. ఈ కథ ఎటు నుంచి ఎటు వెళ్తుందో చూడాలి మరి…

Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..