టచ్‌లోకొచ్చిన ధోనీసేన
టచ్‌లోకి వచ్చిన ధోనీసేన...

ట్వంటీ20 వరల్డ్ కప్‌లో అసలైన సంగ్రామానికి ముందు యంగ్ ఇండియా టచ్‌లోకి వచ్చింది. చిరకాల ప్రత్యర్థితో వరల్డ్ వార్‌కు ముందు ఫాం అందుకుంది. తన రెండో వార్మ ప్ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ షో చేసింది. ఇంగ్లండ్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది.
టాస్ ఓడి
మొదట బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ ప్రత్యర్థి ముందు 179 పరుగుల
లక్ష్యాన్ని ఉంచింది. రొటీన్‌గా రోహిత్ శర్మ, ధావన్ ఫెయిలైనా.. యువరాజ్ సింగ్
సింగిల్ డిజిట్‌కే పరిమితమైనా... ఎప్పటిలానే
కోహ్లీ మరోసారి చెలరేగాడు. బంగ్లాదేశ్‌కు వెళ్లే ముందు తనలో కొత్త ప్లేయర్‌ను చూస్తారు
అన్న మాట నిలబెట్టుకునేలా రైనా మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లతో 54 రన్స్ చేసి విరాట్ కు అండగా నిలిచాడు.
రైనా ఔటైనా..
విరాట్ తనదైన స్టైల్లో చెలరేగాడు.. ధోనీ సహకారంతో సూపర్ ఫాం కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా
బ్రెస్నన్ వేసిన ఆఖరి ఓవర్లో 3 బౌండరీలతో కలిపి 17 రన్స్ తో ధనాధన్ అనిపించాడు.
74 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్ ముందు మంచి టార్గెట్ పెట్టేలా చేశాడు...
టార్గెట్
భారీగా ఉండడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్లు 16, లాంబ్ 36 పరుగులు చేసి శుభారంభం అందించారు. కానీ భారత స్పిన్నర్లు అంచనాలు అందుకోవడంతో
ఇంగ్లండ్ లక్ష్య చేధనలో బోర్లా పడింది. మిడిలార్డర్
బ్యాట్స్‌మన్ అలీ 46, చివర్లో బట్లర్ 30 పరుగులు చేసిన లక్ష్యాన్ని చేధించండంలో
తడబడింది. భారత బౌలర్లు పరుగులును కంట్రోల్ చేయడంతో ఇంగ్లండ్ 158 పరుగులకే
పరిమితమైంది. 20 పరుగులతో గెలుపొందిన ధోనీసేన పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు
ఆత్మవిశ్వాసం పెంచుకోగలిగింది...
Comments
Post a Comment