బ్లాక్‌బస్టర్ ఫ్రై డే!!!

వింటే భారతం వినాలి... తింటే గారెలే తినాలి... చూస్తే?... బ్లాక్ బస్టర్ ఫ్రైడేకి క్రికెట్ ఫ్యాన్స్ అంతా రెడీ అయ్యారా? మూడు గంటల పాటు ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు టీ20 వరల్డ్ కప్ రెడీ అయ్యింది. ఓ మెగా ఫైట్‌తో ధానధన్ వరల్డ్ కప్‌కు తెరలేస్తోంది…. అది అలాంటి ఇలాంటి మ్యాచ్ కాదు… రియల్ వరల్డ్ వార్‌ను తలపించే ఫటాఫట్ ఫైట్… అదే దాయుదల మధ్య అసలైన సమరం… వింటే భారతం వినాలి... తింటే గారెలే తినాలి... ఇది ఒకప్పటి సామెత…. అదే క్రికెట్‌కు అన్వయించి చూస్తే భారత్-పాకిస్థాన్‌ల మధ్యే మ్యాచ్ చూడాలి? అనుకోక తప్పదు. అప్పుడే క్రికెట్ చూసిన ఫీలింగ్. ఈ రెండు జట్లు మైదానంలో తలపడుతుంటే అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి క్రికెటర్ ఒక సైనికుడిలా మారుతాడు… డూ ఆర్ డై తేల...