కొడుకుకి ప్రేమతో
మా ఇంట పంచవసంతం
చిన్ని తండ్రి నిన్ను చూడగ.. వేయి కళ్లైనా సరిపోవురా.. అన్ని కళ్లూ చూస్తుండగా.. నీకు దిష్టంతా తగిలేనురా.. ఓ సినీ కవి చెప్పిన ఈ మాటలు అక్షరసత్యం.. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రీ.. తన బిడ్డ బుడిబుడి అడుగులు చూస్తూ.. మురిసిపోతు అనుకునే మాటలు ఇవి.. ఇక నా ఫీలింగ్స్ చెప్పాలి అంటే.. ప్రతి వ్యక్తి జీవితంలో రెండు భాగాలు ఉంటాయి.. ఒకటి పెళ్లికి ముందు.. రెండోది పెళ్లికి తరువాత.. కానీ నిజాయితీగా చెప్పాలి
అంటే.. నా జీవితం మాత్రం.. ఆశ్రిత్ పుట్టక ముందు..ఆశ్రిత్ పుట్టిన తరువాత.. (వాడి మొదటి అడుగులు)
ఏంటి అంత స్పెషల్ అంటరా.. మా ఇంట్లో వాడి బుడి బుడి అడుగులు పడడంతోనే ఏదో తెలియని కళ వచ్చింది ఇంటికి.. ఆఫీసులోని ఎంత టెన్షన్ ఉన్నా.. బయట ట్రాఫిక్ జామ్‌లు.. అనుకున్న పనులు అవ్వకపోవడం.. ఇలా పర్సనల్, మనీ ప్రాబ్లమ్స్.. కారణం ఏదైనా.. ఎంత ప్రస్టేషన్ ఉన్నా.. .. ఇంటికి వచ్చాక ఒక్కసారి వాడి నవ్వుల ఫేస్ చూస్తే చాలు అంతా క్షణాల్లో మటుమాయం అయ్యేది.. అప్పటి వరకు ఉన్న చిరాకు.. కోపం ఏమయ్యేదో తెలీదు.. వాడిని చూస్తే చాలు ఏదో మ్యాజిక్ చేసినట్టు ఆటోమేటిక్‌గా పెదవిపై చిరునవ్వు
వస్తుంది.. మనసు తేలికైపోతుంది..
వాడితో పాటు.. నా ఆనందం కూడా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం నా ధ్యాస.. నా ప్రపంచం అంతా వాడే.. నేను ఎక్కడ ఉన్నా..చేస్తున్నా.. నా ధ్యాస అంతా వాడే.. ఎందుకు అంత స్పెషల్ అంటారా?.. ఆశ్రిత్‌ను చూస్తే నాకు మా అమ్మే గుర్తుకు వస్తుంది. వాడి నడక.. వాడి మాటలు.. అన్నీ.. మా అమ్మలానే అనిపిస్తాయి. ముఖ్యంగా నేను ఆఫీసుకు లేదా.. బయటకు వెళ్లినప్పుడు వాడు చెప్పే మాటలు కచ్చితంగా నాకు మా అమ్మ చెప్పినట్టే అనిపిస్తుంది..
వాడు పుట్టేసరికి మా అమ్మ లేదు.. వాడు ఒక్కసారి కూడా అమ్మను చూడకపోయినా.. వాడికి మా అమ్మ అంటే ఎంతో ఇష్టం.. ఆశ్రిత్ బంగరడం (పాకడం) మొదలెట్టినప్పుడు.. ఆశ్రిత్ పట్టుకున్న మొదటి ఫోటో మా అమ్మదే.. ఐదు నెలల వయసులోనే దేవుడు గదివైపు పాకుతూ.. అక్కడఫో ఎన్ని ఫోటోలు ఉన్నా.. అమ్మ ఫోటోతోనే ఆడేవాడు..ఇదిగో ఆ వీడియో..
ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి.. వాడి అల్లరి భరించలేనిదే.. అయినా కోపం రాదు.. ఎందుకు అంటే వాడు మా అమ్మ ప్రతిరూపం అనిపిస్తోంది నాకు. 2014 జూన్ 10న వాడు పుట్టాడు.. అప్పుడే ఐదేళ్లు అయిపోయాయా అనిపిస్తోంది. వాడిలానే కాలం ఎంత వేగంగా పరిగె పరిగెడుతోందా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.. వాడి జ్ఞాపకాలతో సాగిన ఈ ఐదేళ్ల జీవితం నాకు ఎంతో ప్రత్యేకం.. ఇకపై వాడి భవిష్యత్తు బంగారంలా ఉండాలని ఓ మంచి తండ్రిగా దేవుడ్ని కోరుకుంటున్నా..
ఇట్లు
సుమానగేష్
కొడుకుకి ప్రేమతో
Comments
Post a Comment