మాస్టర్ లేని ముంబై



మాస్టర్ లేని ముంబై...


విక్టరీలు వెనకడుగేస్తున్నాయి... పరాజయాలు వెక్కిరిస్తున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ లేని ఇండియన్స్ దగ్గరకు చేరేందుకు మొహమాట పడుతున్నాయి... ఔను ముంబైలో క్రికెట్ దేవుడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.  అందుకే ముంబై ఈ సీజన్ లో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఓడిన ఏకైక జట్టుగా నిలిచింది....




ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఫేవరెట్ జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ప్రతి ఏడాది ఇండియన్స్పై భారీ అంచనాలు ఉంటున్నాయి. గత సీజన్ వరకు దాదాపు ప్రతి సారి ముంబై అదుర్స్ అనిపించింది. ఏడాది సీన్ రివర్స్ అయ్యింది. తొలి రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన చేసిన తరువాత పుంజుకుంది ముంబై... వయసు మీద పడినా.. సచిన్ తమ జట్టులో ఉన్నాడన్న ఒక్క భరోసాతో ముంబై చెలరేగుతూ వచ్చింది. 2010లో ఫైనల్కు చేరుకొని సత్తా చాటింది... 2011లో ప్లే ఆఫ్కు అర్హత సాధిచింది. 2012లో అదే ప్రదర్శన పునరావృతం చేసి ప్లే ఆప్కు అర్హత సాధిచింది. ఇక 2013లో ముంబై ఇంకాస్త చెలరేగింది. ఛాంపియన్గా నిలిచింది. సచిన్ పెద్దగా రాణించకున్నా... అతడు జట్టులో ఉన్నాడనే ఒక్క భరోసా సహచరుల్లో ఉత్సాహం నిపింది. ముంబై ఆరేళ్ల తరువాత తొలి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. వెంటనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్... లీగ్ కెరీర్కు  గుడ్ బై చెప్పేశాడు...   


ప్రస్తుతం సచిన్ లేడనే లోటు తప్పా... ముంబై చూసేందుకు చాలా స్ట్రాంగ్గా  కనిపిస్తోంది. గతేడాదితో పోల్చుకుంటే స్టార్ ఆటగాళ్ల సంఖ్య పెరిగింది. రోహిత్, పొలార్డ్, మలింగ, రాయుడు, హర్భజన్ సింగ్ లాంటి మ్యాచ్ విన్నర్లు జట్టుతో పాటు ఉన్నారు. వీరికి తోడు మైకేల్ హసి, కోరె అండర్సన్, జహీర్ ఖాన్ లాంటి విలువైన ఆటగాళ్లు జట్టుతో చేరారు. దీంతో ముంబైపై ఇంకాస్త ఆంచనాలు పెరిగాయి. వైపు జట్టులో అందరూ స్టార్ ప్లేయర్లు... మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ముద్ర ఉండడంతో బ్లూ టీం ఇంకాస్త చెలరేగుతుందని అభిమానులు ఆశించారు

బ్యాటింగ్ ఆర్డర్లో అందరూ హార్డ్ హిట్టర్లే.. సింగిల్ హ్యాండ్ మ్యాచ్ విన్నర్లే.. అంతర్జాతీయ అనుభవం ఉన్నవారే. ఇక హర్భజన్, ఓజా లాంటి క్లాస్ స్పిన్నర్లు అదనపు బలం. మలింగ, జహీర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత పేస్ బౌలర్లు... ఇలాంటి జట్టు నుంచి సగటు అభిమాని ఈజీ విక్టరీలు ఆశిస్తాడు. కాని ముంబై ప్రదర్శన రోజు రోజుకూ దిగజారుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ చిత్తుగా ఓడింది.
  


ఆరంభ మ్యాచ్లో కోల్కతా 41 పరుగుల తేడాతో, బెంగళూర్ 7 వికెట్ల తేడాతో, చెన్నై 7 వికెట్ల తేడాతో గెలుపొందడం ముంబై ఓటముల్లో హ్యాట్రిక్ కొట్టింది. మూడు ఓటముల తరువాత ముంబైలో కసి కనిపించలేదు. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ముంబై చిత్తైంది.







ఆటగాళ్ల తాజా ఫాం చూస్తే అసలు ఏడో సీజన్ లో ముంబై బోణీ చేస్తుందా లేదా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. సచిన్ తప్ప దాదాపు అదే జట్టు ఇప్పుడు కొనసాగుతుంది. కొత్తగా జట్టులో చేరిన వారంతా మ్యాచ్ విన్నర్లే.... అయినా  ఆ జట్టు దరి చేరేందుకు విజయాలు వెనుకడుగు వేస్తున్నాయి. వియ్ మిస్ యు సచిన్ అంటూ... ముంబై ఇండియన్స్ ను ఏడిపిస్తున్నాయి...




Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..