వాట్ ఏ సూపర్ ఓవర్..

సరిలేరు మీకెవ్వరు.. గూస్ బంప్స్.. వాట్ ఏ సూపర్ ఓవర్ మ్యాచ్.. అస్సలు ఊహించలేదు.. కివీస్ టార్గెట్ 180 రన్స్.. 19వ ఓవర్ ముగిసే సరికి.. న్యూజిలాండ్ 171 రన్స్ కి 4 వికెట్లు.. అంటే 6 బంతుల్లో కావాల్సింది కేవలం 9 రన్ప్.. అప్పటికే 95 రన్స్ తో భారత్ కు డామేజ్ చేసిన కె `విన్` క్రీజులో ఉన్నాడు.. అయినా సీనియర్ షమికి నమ్మకంతో బంతి ఇచ్చాడు కెప్టెన్ కోహ్లీ. . అప్పటికే క్రీజ్ లో ఉన్న హార్డ్ హిట్టర్ రాస్ టేలర్.. తొలి బంతినే సిక్సర్ బాదేశాడు.. దీంతో 5 బంతులకు 3 రన్స్ కావాలి.. అంతా డిసైడ్ అయ్యారు.. మ్యాచ్ గోవిందా అని.. సరే మ్యాచ్ అయితే పోయింది.. కనీసం కెవిన్ సెంచరీ చేస్తే హ్యాపీ అనుకున్నారు హైదరాబాద్ సన్ రైజర్స్ అభిమానులు.. ఎందుకంటే మన ఐ.పి.ఎల్ టీం కెప్టెన్ కెవిన్ కదా... కానీ పర్సనల్ లైఫ్ లో వైఫ్ వేసిన బౌన్సర్లతో.. ఇబ్బంది పడ్డ షమి.. కివీస్ బ్యాట్స్ మెన్ పై ఆ కసి చూపించాడు.. క్రీజ్ లో పాతుకుపోయిన కెవిన్ ను షార్ట్ పిచ్ బంతి వేసి బోల్తా కొ్ట్టించాడు.. కూల...